భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఉత్తమ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్. అయితే సోమవారం నాడు ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతడి రిటైర్మెంట్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ క్రమంలో అతడి మాజీ ప్రియురాలు కిమ్ శర్మ కూడా స్పందించింది.  ''యూవీ అదుతంగా ఆడావు.. నీ ఆట, రికార్డులు మరువలేనివి. హేజల్ కీచ్ తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

గతంలో యూవీ చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేశాడని వార్తలు వినిపించాయి. వీరిలో కిమ్ శర్మతో పాటు దీపిక పడుకొనే, ప్రీతీ జింతా వంటి హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి.

ఇక రిటైర్ అవ్వడానికి ముందు యూవీ సచిన్ సలహా తీసుకోవడంతో పాటు తన సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు కూడా చెప్పానని, చాలా కాలం తరువాత తన తండ్రితో ఎక్కువసేపు మాట్లాడానని వెల్లడించాడు. యూవీ భార్య హేజల్ కీచ్.. 'నీ భార్య అయినందుకు గర్వపడుతున్నా' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.