క్రికెటర్లకు, సినిమా వాళ్లకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంటాయి. అవి ప్రేమ వార్తలైతే ఇంక అంతే.. ఎంతవరకు నిజముందో తెలుసుకోకుండా ఆ విషయాలను ట్రెండింగ్ చేస్తుంటారు. తాజాగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఇలాంటి వదంతులే వినిపిస్తున్నాయి.

ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, బుమ్రా ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చలు నడుస్తున్నాయి. గతంలో బుమ్రాకి రాశిఖన్నాతో లింక్ చేసి వార్తలు రాశారు. అయితే రాశి అలాంటిదేమీ లేదని చెప్పడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. 

ఇప్పుడు అనుపమతో బుమ్రా ఎఫైర్ సాగిస్తున్నట్లు వార్తలు ఎందుకు వస్తున్నాయంటే.. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో బుమ్రా ఫాలో అవుతోన్న ఏకైన నటి అనుపమేనట. వీరిద్దరూ ఒకరి పోస్ట్ లను మరొకరు లైక్ చేసుకుంటూ ఉంటారు.

దీంతో నెటిజన్లు బుమ్రా, అనుపమల మధ్య లవ్ ట్రాక్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా అనుపమ స్పందించింది. బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు పుట్టించడం వలన ఎవరికీ ఉపయోగం లేదని ఘాటుగా బదులిచ్చింది.