అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్విస్టిచ్చారు. తనను అమరావతికి రావాలని ఎవరూ పిలవలేదని  రోజా స్పష్టం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో  పాల్గొనేందుకు వచ్చినట్టు రోజా స్పష్టం చేశారు.  వైఎస్ జగన్  పిలుపు మేరకు రోజా అమరావతికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారార్ని ఆమె ఖండించారు.

మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో రోజా మాట్లాడారు. తనకు జగన్ నుండి ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ జగన్ నుండి ఆహ్వానం వస్తే వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.మంత్రి పదవి రాలేదని తనకు బాధ లేదన్నారు.సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనకు మంత్రి పదవి రాలేదేమోనని ఆమె చెప్పారు. మంత్రి పదవి దక్కలేదని తాను అలిగినట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇదంతా మీడియా ప్రచారమేనని రోజా అభిప్రాయపడ్డారు.

తనకు కులం గురించి పట్టింపు లేదన్నారు. తనకు చిన్నప్పటి నుండి ఇతర కులాలకు చెందిన వారే ఎక్కువమంది స్నేహితులుగా ఉన్నారని  ఆమె గుర్తు చేశారు. తొలుత మంత్రి పదవి గురించి ప్రచారం సాగింది... ఇప్పుడేమో నామినేటేడ్ పదవి గురించి ప్రచారం సాగుతోందన్నారు. కానీ, తనకు నామినటేడ్ పదవి గురించి ఎవరూ కూడ మాట్లాడలేదని రోజా తెలిపారు.

మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కారణంగానే తాను మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేదని ఆమె చెప్పారు.మంత్రి పదవులు దక్కించుకొన్నవారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అసంతృప్తి: రోజా, ఆర్కేలకు ఫోన్లు, జగన్‌తో భేటీకి పిలుపు