సినీ క్రిటిక్ కత్తి మహేష్....ఆంధ్రప్రదేశ్  సెక్రటేరియట్ లో హడావిడి చేశారు. మంగళవారం ఉదయం కత్తి మహేష్... అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ కి వెళ్లారు. ఈ సందరర్భంగా ఇటీవల మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఛాంబర్ కి వెళ్లి... శుభాకాంక్షలు తెలిపారు. కత్తి మహేష్... మంత్రి పెద్దిరెడ్డి.. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు. ఈ నేపథ్యంలో... సొంత జిల్లా మంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికే కత్తి మహేష్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోని పెద్దల సభలో ‘తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలతో పాటు కత్తి కూడా హాజరయ్యాడని సమాచారం. తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన కత్తి మహేష్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వైసీపీలో చేరి ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.