11:45 PM (IST) Apr 15

హార్వర్డ్‌కు ట్రంప్ షాక్: 2.3 బిలియన్ డాలర్ల నిధుల నిలుపుదల

ట్రంప్ ప్రభుత్వం డిమాండ్లకు హార్వర్డ్ తలొగ్గకపోవడంతో 2.3 బిలియన్ ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది.

పూర్తి కథనం చదవండి
11:42 PM (IST) Apr 15

Putin PA Dmitry Peskov: రష్యా అధ్యక్షుడి పీఏ మామూలు ఆటగాడు కాదు.. భార్యను ఎలా ఇంప్రెస్‌ చేశాడంటే!

Putin PA Dmitry Peskov: పెళ్లికి ముందు అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడం, సర్‌ప్రైజులు ఇవ్వడం అబ్బాయిలు కామన్‌గా చేసేదే. ఇక పెళ్లి తర్వాత భార్య ఇచ్చే సర్‌ప్రైజుల వల్లనో లేదా మరే ఇతర కారణాలో మగాళ్లు భార్యలను ఇంప్రెస్‌ చేయడం పనిగా పెట్టుకోరు. ఇక చాలా మంది మగాళ్లకి అసలు పెళ్లి రోజు డేట్‌ ఎప్పుడో గుర్తుంచుకోరు.. మరీ ముఖ్యంగా భార్య పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోని వారు అనేకమంది. అదేమంటే పని ఒత్తిడి వల్ల, ఆఫీస్‌ పనుల వల్ల మర్చిపోయానని భర్తలు చెబుతుంటారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పీఏ మాత్రం తన భార్య బర్త్‌డేను గుర్తుంచుకుని వెరైటీగా విషెస్‌ చెప్పాడు. అదీ కూడా ఓ ఆటతో.. సర్‌ప్రైజ్‌ చేసి ఆటగాడు అనిపించుకున్నాడు.

పూర్తి కథనం చదవండి
11:40 PM (IST) Apr 15

PBKS vs KKR: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ

IPL 2025 PBKS vs KKR: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించడంలో యుజ్వేంద్ర చాహల్ రియ‌ల్ హీరోగా నిలిచాడు. ఐపీఎల్‌లో తన రెండో బెస్ట్ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ టీమ్ 111 పరుగులను డిఫెండింగ్ చేసుకోగ‌లిగింది. 

పూర్తి కథనం చదవండి
11:31 PM (IST) Apr 15

బోయింగ్‌పై చైనా బ్యాన్: అమెరికాకు బిగ్ షాక్

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య బోయింగ్ విమానాల డెలివరీ నిలిచిపోయింది. దీంతో ఏవియేషన్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

పూర్తి కథనం చదవండి
11:09 PM (IST) Apr 15

మురికి కాలువల శుభ్రత రోబోల పనే ... పడ్నవిస్ సర్కార్ వినూత్న ప్రయత్నం

పారిశుద్ద్య కార్మికుల భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 100 రోబోలను కొనుగోలు చేయనుంది. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యాన్ హోల్స్ ను శుభ్రపరిచేందుకు ఈ రోబోలను ఉపయోగించనున్నారు 

పూర్తి కథనం చదవండి
10:37 PM (IST) Apr 15

IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి ఔట్

IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయ్యాడు. ఎందుకు? 

పూర్తి కథనం చదవండి
10:15 PM (IST) Apr 15

Heat Stroke : రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ ... ఇకపై ఎండల్లో చనిపోయినా ఎక్స్ గ్రేషియా

ప్రస్తుతం ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు పైపైకి వెళుతున్నాయి. ఈ క్రమంలో బయట తిరిగేవారు వడదెబ్బల బారినపడే ప్రమాదముంది. దీంతో వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. కాబట్టి ఇకపై ఎండల కారణంగా చనిపోయినా ఎక్స్ గ్రేషియా ఇస్తారు... ఎంతో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
10:07 PM (IST) Apr 15

స్విట్జర్లాండ్ ట్రిప్: స్టార్ హీరో వారసురాలు ఎలా చిల్ అవుతుందో చూశారా, వైరల్ పిక్స్

సారా అలీ ఖాన్ తన అమ్మ అమృత సింగ్, తమ్ముడు ఇబ్రహీంతో స్విస్ ఆల్ప్స్‌కి వెళ్ళింది. అక్కడి పిక్చర్స్ షేర్ చేసింది. మంచులో అడ్వెంచర్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపిన మూమెంట్స్ అన్నీ చూస్తే ఎవరికైనా ట్రిప్ వెళ్లాలనిపిస్తుంది.

పూర్తి కథనం చదవండి
09:57 PM (IST) Apr 15

Laptop Launched: మార్కెట్‌లోకి రోలబుల్‌ ల్యాప్‌టాప్‌... ధర, ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే!

Gadget: సామాన్యులకు మంచి ఫీచర్లు, సరసమైన ధరల్లో ల్యాప్‌టాప్‌లను లెనెవో సంస్థ అందిస్తోంది. తాజాగా లెనెవో లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో రోల్‌ చేసే ల్యాప్‌టాప్ డిస్‌ప్లేను లెనెవో కంపెనీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ థింక్‌బుక్ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటంటే.. 

పూర్తి కథనం చదవండి
09:34 PM (IST) Apr 15

మమతాజీ మౌనమెందుకు ... అల్లరి మూకలను కంట్రోల్ చేయాలంటే అదే మందు: యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఘాటుగా స్పందించారు. వెంటనే ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మౌనం వీడాలని ఆయన సూచించారు.

పూర్తి కథనం చదవండి
09:31 PM (IST) Apr 15

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా-రాహుల్ గాంధీలకు షాక్

National Herald Case ED Chargesheet: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ తొలిసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాబర్ట్ వాద్రాను కూడా విచారించారు, కాంగ్రెస్ దీన్ని 'రాజకీయ కుట్ర' అని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మరో వివాదంగా మారింది. 

పూర్తి కథనం చదవండి
09:21 PM (IST) Apr 15

India Justice Report: మహిళలు అన్నింటిలో సమానం.. పోలీసు దళంలో కాదు.. కిందిస్థాయిలోనే మిగిలిపోతున్నారట!

మన దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో కూడా సమాన హక్కులను చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. కానీ పోలీసుశాఖలో ఉన్నత ర్యాంకుల్లో పనిచేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోందని సర్వే చెబుతోంది. దీంతోపాటు న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం ఇలా మొత్తం నాలుగు రంగాల్లో మహిళా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను ఇటీవల ఓ సంస్థ సేకరించింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 

పూర్తి కథనం చదవండి
08:34 PM (IST) Apr 15

20 ఏళ్లకే బాస్..అమ్మగా, అధినేత్రిగా మామా ఎర్త్ గజల్ అలా‍ఘ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది!

Mamaearth's co-founder Ghazal Alagh: 21 ఏళ్లకే బాసు.. అప్పుడే తల్లి అయిన మామా ఎర్త్ కో-ఫౌండర్ గజల్ అలాఘ్ కు తన వ్యక్తిగత జీవితం, ఆఫీసు లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫిక్స్ అయిన టైమింగ్ లేకపోవడం, ప్రొఫెషనల్ అనుభవం తక్కువగా ఉండడం వంటి అంశాలతో ఎదురుదెబ్బలు తప్పలేదు. వద్దని పోయిన వారిని తనవద్దకు వచ్చేలా కొత్తగా నేర్చుకుంటూ ఎదిగారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి
07:56 PM (IST) Apr 15

మోదీ సర్కార్ తో స్టాలిన్ మరో జగడం... ఈసారి ఏకంగా సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జినే రంగంలోకి

కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లు, డీలిమిటేషన్ వంటి చాలా విషయాల్లో కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న స్టాలిన్ సర్కార్ తాజాగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి హక్కులను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

పూర్తి కథనం చదవండి
07:44 PM (IST) Apr 15

iPhone: ఐఫోన్ కంటే ఆ కీప్యాడ్ ఫోనే అత్యంత ఖరీదైంది. ఎందుకంటే..?

iPhone: మనకి తెలిసి అత్యంత ఖరీదైన ఫోన్ ఏదంటే.. ఐఫోన్ అని ఠక్కున చెప్పేస్తాం కదా.. కాని ఐఫోన్ రాక ముందు అంత ఖరీదైన ఫోన్ ఒకటి ఉండేది. దాని ధర అప్పట్లోనే ఎంత ఉండేదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి
06:56 PM (IST) Apr 15

Indian Stock Market : ఏం కమ్ బ్యాక్ గురూ... ట్రంప్ కే ఊహకే అందనంతగా భారత్ స్టాక్ మార్కెట్ లాభాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో దెబ్బతిన్న భారతీయ స్టాక్ మార్కెట్స్ మూడు రోజుల వరుస సెలవుల తర్వాత మళ్లీ జోరందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ టాప్‌లో ఉంది.

పూర్తి కథనం చదవండి
06:47 PM (IST) Apr 15

Waqf: ఆ ఊరంతా మాదే ఖాళీ చేయండి.. వక్ఫ్ బోర్డు నోటీసులతో తమిళనాడు గ్రామంలో ఆందోళనలు

Waqf Board Claims Entire Tamil Nadu’s village: వక్ఫ్ బోర్డు తమిళనాడులోని ఒక గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి, అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలకు ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. 

పూర్తి కథనం చదవండి
06:09 PM (IST) Apr 15

'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి ఇళయరాజా నోటీసులు.. క్షమాపణ తోపాటు 5 కోట్లు డిమాండ్

'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో తన అనుమతి లేకుండా తన 3 పాటలు వాడినందుకు ఇళయరాజా మైత్రి మూవీ మేకర్స్‌కు నష్టపరిహారం కోరుతూ నోటీసు పంపడం హాట్ టాపిక్‌గా మారింది.

పూర్తి కథనం చదవండి
06:02 PM (IST) Apr 15

Credit Card: క్రెడిట్ కార్డును గూగుల్‌పే, ఫోన్‌పేకి ఎలా లింక్‌ చేసుకోవాలో తెలుసా.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జేబుల్లో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా రకరకాల మొబైల్ వ్యాలెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే యూపీఐ సేవలను మరింత ప్రోత్సహించే క్రమంలో యాప్స్‌కు క్రెడిట్‌ కార్డును లింక్‌ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. 

పూర్తి కథనం చదవండి
05:59 PM (IST) Apr 15

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపులు... దక్షిణాది నుంచేనా?

అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆలయ ట్రస్ట్ భద్రత పెంచాలంటూ అధికారులను కోరారు. ఇటీవలే రామనవమి వేడుకలు అట్టహాసంగా ముగియగా ఇప్పుడిలా బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 

పూర్తి కథనం చదవండి