మమతాజీ మౌనమెందుకు ... అల్లరి మూకలను కంట్రోల్ చేయాలంటే అదే మందు: యోగి ఆదిత్యనాథ్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఘాటుగా స్పందించారు. వెంటనే ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మౌనం వీడాలని ఆయన సూచించారు.

Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 2017 కు ముందు అంటే తమ ప్రభుత్వ ఏర్పాటుకుముందు కూడా యూపాతో కూడా ఇలాగే రెండుమూడు రోజులకోసారి అల్లర్లు జరిగేవని యోగి అన్నారు. కానీ తమ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. అల్లరి మూకలకు లాఠీదెబ్బలే మందు... లాఠీ లేకుండా వాళ్ళు మారరని యూపీ సీఎం అన్నారు.
బెంగాల్ మండిపోతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారని... అల్లరిమూకలను శాంతిదూతలు అంటున్నారని యోగి మండిపడ్డారు. వాళ్ళు మాటలతో మారరని ఆయన అన్నారు. మతతత్వం పేరుతో అల్లరి చేసేవాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని... ముర్షిదాబాద్ వారం రోజులుగా మండిపోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ ఘటనలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. కానీ అక్కడి కోర్టు ఆ బాధ్యత తీసుకుంది... కేంద్ర బలగాలను పంపించి మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించిందన్నారు. ఇందుకు న్యాయస్థానాలను తప్పకుండా అభినందించాల్సిందేనని యోగి అన్నారు.
హర్దోయ్‌లో రూ.650 కోట్ల రూపాయలతో 729 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపారు యోగి. ఈ సందర్భంగా మాట్లాడుతూనే పశ్చిమ బెంగాల్ అల్లర్లపై ఆయన స్పందించారు.
వీళ్ళు దేశానికే భారం...
2017 ముందు యూపీలో రెండు మూడు రోజులకోసారి అల్లర్లు జరిగేవని... వాటిని సమర్ధవంతంగా నిలువరించామని సీఎం యోగి పేర్కొన్నారు. బెంగాల్ మండిపోతుంటే అక్కడి ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని, అల్లరిమూకలను శాంతిదూతలు అంటున్నారని ఆయన విమర్శించారు. అధికార టీఎంసీతో పాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కూడా మౌనంగా ఉండటాన్ని యోగి తప్పుబట్టారు.
బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనల గురించి స్పందిస్తున్నారు... కానీ ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని యోగి ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఇష్టమైన వాళ్ళు అక్కడికే వెళ్లిపోవాలని, ఎందుకు భారతదేశంలో భారంగా ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.