20 ఏళ్లకే బాస్..అమ్మగా, అధినేత్రిగా మామా ఎర్త్ గజల్ అలాఘ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది!
Mamaearth's co-founder Ghazal Alagh: 21 ఏళ్లకే బాసు.. అప్పుడే తల్లి అయిన మామా ఎర్త్ కో-ఫౌండర్ గజల్ అలాఘ్ కు తన వ్యక్తిగత జీవితం, ఆఫీసు లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫిక్స్ అయిన టైమింగ్ లేకపోవడం, ప్రొఫెషనల్ అనుభవం తక్కువగా ఉండడం వంటి అంశాలతో ఎదురుదెబ్బలు తప్పలేదు. వద్దని పోయిన వారిని తనవద్దకు వచ్చేలా కొత్తగా నేర్చుకుంటూ ఎదిగారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Mamaearth's co-founder Ghazal Alagh, inspiring story
Mamaearth's co-founder Ghazal Alagh: గజల్ అలాఘ్, మామా ఎర్త్ (Mamaearth) బ్రాండ్ సహ వ్యవస్థాపకురాలు. ప్రస్తుతం షార్క్ ట్యాంక్ ఇండియాలో పరిచయమక్కరలేని పేరు. కానీ, తన ప్రారంభ కెరీర్ లో ఆమె జీవితం ఇప్పుడు కనిపిస్తున్నంత ఈజీగా సాగలేదు. ఆమె కంపెనీ ప్రారంభంలో అంత అనుభవం లేదన్న కారణంతో చాలామంది ఉద్యోగులు ఆమెను నమ్మలేదు. నమ్మకపోవడమే కాదు 20 ఏళ్ళ వయసులోనే బాస్ అయినప్పుడు చాలా మంది ఉద్యోగులు తనకు అనుభవం లేదని వదిలేసి వెళ్లిపోయారు.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఎమోషనల్ పోస్టులో గజల్ అలాఘ్ ఈ సంఘటనలను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. "చాలామంది నన్ను గౌరవించలేదు. చాలా చిన్నది. అనుభవం లేదు. లీడ్ చేయగలదన నమ్మకం లేదు. ప్రేరణ కలిగించలేదు" అని అన్నారని పేర్కొన్నారు.

అప్పటికే తల్లి అయిన గజల్ అలాఘ్ కు తన వ్యక్తిగత జీవితం, ఆఫీసు జీవితం రెండూ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫిక్స్ అయిన టైమింగ్ లేకపోవడం, ప్రొఫెషనల్ అనుభవం తక్కువగా ఉండడం వంటి అంశాలతో ఎదురుదెబ్బలు తప్పలేదు.
ఆ నెగిటివ్ కామెంట్ల మధ్యలోనూ గజల్ అలాఘ్ ఒక విషయం మాత్రం మరిచిపోలేదు.. అదే తనపై తనకు నమ్మకం. "నాకు భయం వేసినప్పటికీ, నమ్మకంగా ముందుకు సాగాను. ఎంత తక్కువ తెలిసినా, నేర్చుకుంటూ ముందుకు వెళ్లాను. అంతే కాదు… ప్రతి రోజు పడిపోతున్న మళ్ళీ లేచి ప్రయత్నించాను" అని ఆమె వెల్లడించింది.

Mamaearth
అందుకు తగ్గట్టుగానే గజల్ అలాఘ్ తల్లి అని, మహిళ అని వేరే గుర్తింపుగా కాకుండా, తన నాయకత్వంలోనూ మెరుపు మెరిపించగలదని నిరూపించారు. పనిలో ఆమె ప్రామాణికత, పట్టుదల, మనస్ఫూర్తి… ఇవే ఆమెను ఎదుగుదల దిశగా నడిపించాయి.
అందుకే మళ్లీ ఆమెను చిన్నచూపు చూసిన కొంతమంది ఉద్యోగులు కూడా మళ్లీ గజల్ దగ్గరకు వచ్చారు. సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె కంపెనీలో చేరారు. గతంలో లాగా ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా వచ్చారు! ఇది కేవలం ఆమెపై వారి నమ్మకం కాదు… ఆమెలో వచ్చిన నాయకత్వం ఫలితంగా వచ్చిందని చెప్పొచ్చు.

Image: Ghazal Alagh/Instagram
తన పోస్టులో "నాకిది ప్రతీకారం కాదు… ఇది ఎదుగుదల. ప్రతి మహిళను ఇది గుర్తుచేస్తుంది.. మీరు ప్రారంభంలో స్థానం గురించి సందేహిం వద్దు.. మీరు మారిపోవడం కాదు.. మీరు నేర్చుకోవాలి, నమ్మాలి, పట్టుదలతో ముందుకెళ్లాలి. అప్పుడే విజయంతో పాటు అన్ని వస్తాయని" గజల్ అలాఘ్ పేర్కొన్నారు. అలాగే, "నేను పర్ఫెక్ట్ కాదు, కానీ ఎంతకష్టమైనా వదలిపెట్టని ప్రయత్నం మాత్రం నా దగ్గర ఉంది. అదే నన్ను మరో స్థాయికి తీసుకెళ్లింది" అని అన్నారు.
ఇది కేవలం గజల్ విజయగాధ మాత్రమే కాదు.. ఇది ప్రతి యువతి, తల్లి, నాయకురాలకు సంబంధించిన ఒక రిమైండర్.. అమెలా మీ వాయిస్ వినిపించండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎదగడం కోసం నేర్చుకోండి.. !