Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. ప్రియుడితో వెళ్లిపోవాలని తన పోలికలతో ఉన్న మహిళను చంపి, బట్టలు వేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ..

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను నమ్మించడానికి వేరే మహిళను హత్య చేసింది. దీనికి తన స్నేహితుడి సహాయం తీసుకుంది. 

A woman who looks like her is killed, dressed and filmed as a suicide to leave with her boyfriend..
Author
First Published Dec 2, 2022, 9:59 AM IST

ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోవాలని భావించింది. అయితే దీనికి సమాజం, కుటుంబం ఒప్పుకోదని భావించిందే ఎమో తెలియదు గానీ.. తన పోలికలతో ఉన్న ఓ మహిళను చంపేసింది మరో మహిళ. అనంతరం డెడ్ బాడీకి తన బట్టలు వేసి కుటుంబ సభ్యులకు అది ఆత్మహత్య అని తెలిసేలా ప్లాన్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఈ ప్రయాణం మరుపురానిది.. ఆటో డ్రైవర్ పై ప్రశంసలు...!

గ్రేటర్ నోయిడాలో ఓ మహిళన చంపి, ఆ శవానికి తన బట్టలు వేసి తాను చనిపోయానని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలి పేరు పాయల్ భాటిగా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాయల్ భాటి తన స్నేహితుడైన అజయ్ ఠాకూర్ తో కలిసి నవంబర్ 12వ తేదీన హేమా చౌదరి అనే మహిళను కిడ్నాప్ చేశారు. అనంతరం దాద్రీలోని బాద్‌పురా గ్రామంలోని భాటి ఇంటికి తీసుకెళ్లారు. 

అక్కడ హేమా చౌదరి మణికట్టు కోసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలు, భాటిలు చూడాటానికి కొంచెం దగ్గరి పోలికలతో ఉంటారు. దీంతో ముఖాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా వేడి నూనే పోశారు. దీంతో ముఖం గుర్తుపట్టలేకుండా తయారైంది. అనంతరం నిందితులు ఇద్దరూ కలిసి శవానికి భాటి బట్టలను తొడిగారు. అనంతరం ఓ సూసైడ్ నోట్ సిద్ధం చేసి మృతదేహం పక్కన ఉంచారు. తరువాత శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలా ప్లాన్ చేశారు. దీంతో చనిపోయింది పాయల్ భాటి అని గుర్తించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. 

ఆర్కెస్ట్రాలో పాడుతూ.. అమ్మాయిల మనసు దోచాడు...నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి..

కానీ ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ‘‘ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య. మేము ఇప్పటికీ నేరాన్ని పరిశోధిస్తున్నాం. నిందితురాలైన మహిళ మరిన్ని హత్యలకు ప్లాన్ చేసి, తన ప్రేమికుడితో పారిపోయే ముందు తనను తాను చనిపోయినట్లు నమ్మించాలని అనుకుంది” అని సెంట్రల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సాద్ మియా ఖాన్ అన్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు, విధానం ఇతర వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. 

షాకింగ్.. 13యేళ్ల బాలికపై క్లాస్ రూంలో తోటి విద్యార్థుల అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్...

భాటి తల్లిదండ్రులు ఇద్దరూ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయారని, వారి మరణానికి ఆమె తన కజిన్ (అత్త కొడుకు), అతడి భార్య కారణమని ఆమె భావించిందని పోలీసులు తెలిపారు. అయితే వారిద్దరిని కూడా భాటి చంపాలని అనుకుందా అని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios