Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. 13యేళ్ల బాలికపై క్లాస్ రూంలో తోటి విద్యార్థుల అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్...

ఇద్దరు పదమూడేళ్ల బాలురు తమ తోటి విద్యార్థినిపై క్లాస్ రూంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ముంబైలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. 

13-year-old girl raped by fellow students in classroom in mumbai
Author
First Published Dec 2, 2022, 9:13 AM IST

మహారాష్ట్ర : క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థినులపై విద్యార్థులు జరుపుతున్న   లైంగిక దాడులు, అత్యాచారాల ఘటనలు  కలవరపెడుతున్నాయి. హైదరాబాదులో పదో తరగతి విద్యార్థినిపై తోటి  విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన  ఘటన మరువకముందే..  ఇలాంటి ఘటనలే దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో  ఓ స్కూల్లో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి  వచ్చింది.  సెంట్రల్ ముంబైలోని హార్బర్ లైన్ లో ఉన్న మరాఠీ మీడియం సివిక్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.  చోటుచేసుకుంది ఆ స్కూల్ లోని  ఒక తరగతి గదిలో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఆమెతో చదువుకునే ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు.

 ఆ సమయంలో డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం మిగతా విద్యార్థులు అందరూ గ్రౌండ్ ఫ్లోర్ కు  వెళ్లారు. ఇదే అదనుగా భావించిన  విద్యార్థులు ఆమె మీద దాడి చేశారు.  విషయం తెలుసుకున్న బాలిక బంధువులు ముంబై పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఘటన పూర్వాపరాలను విచారించిన పోలీసులు ఇద్దరు మైనర్ బాలికల పై కేసు నమోదు చేశారు. బాధితురాలు, నిందితులు  సెంటర్ ముంబై లోని సివిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.  క్లాసులో ఎవరూ లేని సమయంలో ఇద్దరు మైనర్ బాలురు.. తన తోటి క్లాస్మేట్ పై  అత్యాచారానికి పాల్పడ్డారు ఘటన జరిగిన తర్వాత బాలిక భయపడిపోయింది.  

వ్యక్తిని, అటకాయించి దాడి చేసిన పోలీసులు... దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశాలు...

జరిగిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా  తమబంధువులకు తెలిపింది. ‘దీంతో బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించారు.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.  వైద్యపరీక్షల కోసం బాధిత బాలికను ఆస్పత్రికి పంపించాం. ఇద్దరు మైనర్ బాలురిని జువైనల్ జస్టిస్ బోర్డు  ముందు హాజరు పరిచాం.  ఆ తర్వాత వారిని డోంగ్రీ లోని  చిల్డ్రన్స్ హోమ్ కి పంపించాం’ అని ముంబై పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన  వెలుగులోకి రావడంతో  స్కూల్లోని అందరూ షాక్ కు గురయ్యారు. స్కూల్లో ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios