Asianet News TeluguAsianet News Telugu

Salaar :‘సలార్’లో అలాంటి ట్రాక్ లు అవసరమా అధ్యక్ష్యా?

ప్రభాస్ .. శ్రుతి హాసన్ తదితరులపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై అంచనాలు పెరిగిపోయాయి. 

Noted comedian joins Prabhas Salaar sets
Author
Bangalore, First Published Jun 29, 2022, 11:43 AM IST


ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హోంబలే సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు మొదలైనా మధ్యలో గ్యాప్ లు వచ్చి రీసెంట్ గా మళ్లీ మొదలైంది.   ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం .. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' పనుల్లో ఉండటం వలన 'సలార్' షెడ్యూల్స్ మధ్య గ్యాప్ వచ్చింది.  తాజా షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ మొదలైంది. 

ప్రభాస్ .. శ్రుతి హాసన్ తదితరులపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవటం కోసం తెలుగు నేటివిటిని అద్దటం కోసం ఓ ప్రముఖ కమిడియన్ ని ఈ సినిమాలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అతను మరెవరో కాదు సప్తగిరి.
 
 కమెడియన్ సప్తిగిరి ఇందులో దాదుపు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారని, అలానే ఈ మూవీ కోసం ఆయన 30 రోజుల కాల్షీట్స్ కేటాయించారని అంటున్నారు. సినిమాలో భారీ మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కామెడీ సీన్స్ కూడా ఆడియన్స్ ని అలరిస్తాయని చెప్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన వారు...కామెడి, రొమాన్స్ లేకుండా ఉంటేనే ఆయన సినిమాలు బాగుంటాయని, తెలుగు నేటివిటి పేరుతో అలాంటివి ఇరికించవద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.  అయితే సప్తగిరి విషయమై  సలార్ యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే లేదు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్  , ఈశ్వరీరావు  కీలక పాత్రలు పోషిస్తుండగా రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios