MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !

Amaravati to Hyderabad Bullet Train : సౌత్ ఇండియాలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్ కు రంగం సిద్ధమవుతోంది. దీని ద్వారా అమరావతి, హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ప్రయాణ సమయం కొన్ని గంటల నుంచి నిమిషాల్లోకి తగ్గనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 08 2026, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. అన్ని సిటీలు ఒకే గంటలో! బుల్లెట్ ట్రైన్ రూట్లివే!
Image Credit : Gemini

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. అన్ని సిటీలు ఒకే గంటలో! బుల్లెట్ ట్రైన్ రూట్లివే!

సౌత్ ఇండియా రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేలా 'హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్' నెట్‌వర్క్‌ను తీసుకురాబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా AI హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక ప్రణాళికను వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల ప్రయాణం
Image Credit : AI

అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల ప్రయాణం

కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్ అమరావతిని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై నగరాలతో అనుసంధానిస్తుంది. దీనివల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ప్రాజెక్టును దక్షిణ భారతదేశానికి ఒక 'హై-స్పీడ్ డైమండ్' లాంటిదని ఆయన అభివర్ణించారు.

36
ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గాలు.. అంచనా సమయం
Image Credit : linkedin/Happening Hyderabad

ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గాలు.. అంచనా సమయం

• అమరావతి – హైదరాబాద్: 70 నిమిషాలు

• అమరావతి – చెన్నై: 112 నిమిషాలు

• హైదరాబాద్ – పూణే: 1 గంట 55 నిమిషాలు

• పూణే – ముంబై: 48 నిమిషాలు

• చెన్నై – బెంగళూరు: 73 నిమిషాలు

• హైదరాబాద్ – బెంగళూరు: 2 గంటల 8 నిమిషాలు

46
ఎకనామిక్ కారిడార్‌గా బుల్లెట్ ట్రైన్
Image Credit : AI

ఎకనామిక్ కారిడార్‌గా బుల్లెట్ ట్రైన్

ఈ బుల్లెట్ రైలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసమే కాదు, ఒక ఆర్థిక మండలిని సృష్టించడం కోసం ఉద్దేశించినది. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ మోడల్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ముంబై, సూరత్, వడోదర వంటి నగరాలు ఎలాగైతే ఒకే ఆర్థిక జోన్‌గా మారుతున్నాయో, అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

56
జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్
Image Credit : Gemini AI

జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్

చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త జోన్ జూన్ 1న అధికారికంగా నోటిఫై చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగమైన ఈ జోన్ ఏర్పాటు ద్వారా రైల్వే అడ్మినిస్ట్రేషన్ మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అలాగే కోల్‌కతా-చెన్నై డబుల్ లైన్ నెట్‌వర్క్‌ను నాలుగు లైన్లుగా విస్తరిస్తామని, దీనివల్ల అదనంగా 500 రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని చెప్పారు.

66
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పెట్టుబడుల జోరు
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పెట్టుబడుల జోరు

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రూ. 10,134 కోట్లు కేటాయించామని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ. 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని 74 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
బెంగళూరు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image2
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image3
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 6 విషయాలు చెక్ చేయండి.. లేదంటే మోసపోతారు!
Recommended image2
World Longest Train : బాబోయ్.. 7 కిలోమీటర్ల పొడవున్న రైలా? ఒకసారి చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved