MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు.. అందులో 16 రోజులు సెలవులే

School Holidays : అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు.. అందులో 16 రోజులు సెలవులే

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే విద్యార్థులకు అక్టోబర్ నెల శుభవార్త తీసుకురానుంది. సెప్టెంబర్‌లోనే బాగా సెలవులు వచ్చాయనుకుంటే అక్టోబర్‌లో అంతకంటే ఎక్కువగా సెలవులు ఉండనున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 18 2026, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్టోబర్ లో సెలవులే సెలవులు
Image Credit : Getty

అక్టోబర్ లో సెలవులే సెలవులు

సెప్టెంబర్ లో కృష్ణాష్టమి, వినాయక చవితి పండగలకు వరుస సెలవులు వచ్చాయి... వినాయక నిమజ్జనానికి కూడా సెలవులు రానున్నాయి. ఈ పండగల సెలవులు వీకెండ్ తో కలిసి రావడంతో వరుస సెలవులు కలిసివస్తున్నాయి. ఇక ఆదివారాలు ఎలాగూ సాధారణ సెలవులే.

అయితే సెప్టెంబర్ లోనే అత్యధిక సెలవులు వచ్చాయనుకుంటే వీటిని తలదన్నేలా అక్టోబర్ లో సెలవులు రాబోతున్నాయి. ఒకటి రెండ్రోజులు కాదు అక్టోబర్ లో ఏకంగా 16 రోజులు సెలవులు రానున్నాయి... కేవలం 15 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. ఈ అక్టోబర్ లో ఎందుకిన్ని సెలవులు వస్తున్నాయి? ఏరోజు ఎందుకు సెలవుంది? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు
Image Credit : Getty

అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు

అక్టోబర్ నెల ప్రారంభంలోనే విద్యార్థులకు సెలవు రానుంది. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి... ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీలసులకు సెలవు ఉంటుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కూడా సెలవు రానుంది.

అయితే ఈ ఏడాది అక్టోబర్ 2 శుక్రవారం రావడంతో వీకెండ్ సెలవులు కూడా కలిసి రానున్నాయి. కొన్ని విద్యాసంస్థలకు ప్రతి శని, ఆదివారం కూడా సెలవు ఉంటుంది... అలాంటి వారికి ఈ శుక్రవారం సెలవుతో కలిపి మూడ్రోజులు హాలిడేస్ రానున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థలకు శనివారం వర్కింగ్ డేనే... కాబట్టి అందరికి మూడ్రోజుల సెలవులు వర్తించవు.

35
అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు
Image Credit : AI / ChatGPT Image

అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు

అక్టోబర్‌లో ఎక్కువ రోజులు సెలవులు రావడానికి ప్రధాన కారణం దసరా పండుగ. తెలంగాణలో ఇది చాలా పెద్ద పండగ... ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఘనంగానే జరుపుకుంటారు కానీ తెలంగాణ స్థాయిలో విద్యాసంస్థలకు సెలవులుండవు. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు రానున్నాయి... అంటే వరుసగా 13 రోజుల సెలవులన్నమాట.

అయితే దసరా సెలవులకు అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11,18 ఆదివారం సెలవులు కలిసి వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే దసరా సెలవులు 10 రోజులే... మూడు సాధారణ సెలవులతో కలిసి 13 రోజుల సెలవులు వస్తున్నాయి. ఇలా విద్యార్థులకు వరుస సెలవులు లభించనున్నాయి.

దసరా సెలవుల్లో చాలామంది విద్యార్థులు కుటుంబంతో కలిసి సొంతూళ్లకు వెళుతుంటారు... ఇందుకోసం ఇప్పటినుండే ట్రైన్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో అప్పుడే దసరా హడావిడి మొదలయ్యింది.

45
అక్టోబర్‌లో వచ్చే ఆదివారాలు ఇవే
Image Credit : Getty

అక్టోబర్‌లో వచ్చే ఆదివారాలు ఇవే

అక్టోబర్ నెలలో వచ్చే ఆదివారాలు కూడా సెలవుల సంఖ్యను పెంచనున్నాయి. అక్టోబర్ 4, అక్టోబర్ 11, అక్టోబర్ 18, అక్టోబర్ 25 తేదీలు ఆదివారాలు. వీటిలో అక్టోబర్ 11, 18 తేదీలు దసరా సెలవుల కాలంలోనే వస్తున్నాయి. ఇక అక్టోబర్ 4, 25 తేదీల్లో సాధారణ ఆదివారం సెలవులు ఉంటాయి. అలాగే అక్టోబర్ 10 రెండో శనివారం కావడంతో ఆ రోజూ సెలవు జాబితాలోకి వస్తుంది.

55
అక్టోబర్ నెలలో సగం సెలవులే
Image Credit : Pinterest

అక్టోబర్ నెలలో సగం సెలవులే

అక్టోబర్ నెలను మొత్తం పరిశీలిస్తే 31 రోజుల్లో సుమారు 16 రోజులు సెలవులు వస్తున్నాయి. మిగిలిన 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సాధారణ పని దినాలుగా ఉంటాయి. పండుగ సెలవులు, శనివారం, ఆదివారం వంటి వారాంతపు సెలవులు ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా చూస్తే సెప్టెంబర్‌లో వచ్చిన పండుగ సెలవుల తర్వాత అక్టోబర్‌లో కూడా విద్యార్థులకు భారీగా సెలవులు లభించనున్నాయి. ముఖ్యంగా దసరా సెలవులతో వరుసగా ఎక్కువ రోజులు స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు అక్టోబర్ నెల ప్రత్యేకంగా మారనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image2
Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved