MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో మురళి శ్రీశంకర్ సంచలనం.. లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ తో సరికొత్త చరిత్ర

CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో మురళి శ్రీశంకర్ సంచలనం.. లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ తో సరికొత్త చరిత్ర

Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లాంగ్ జంప్‌లో భారత్ అథ్లెట్ మురళి శ్రీశంకర్ 8.09 మీటర్లు దూకి రజత పతకం సాధించాడు. బ్యాక్ టు బ్యాక్ సిల్వర్ నెగ్గిన తొలి భారతీయుడిగా రికార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుసగా రెండోసారి కామన్వెల్త్ మెడల్.. హిస్టరీ క్రియేట్ చేసిన కేరళ స్టార్
Image Credit : X/kishanreddybjp

వరుసగా రెండోసారి కామన్వెల్త్ మెడల్.. హిస్టరీ క్రియేట్ చేసిన కేరళ స్టార్

గ్లాస్గో లో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ మురళి శ్రీశంకర్ అద్భుత ప్రదర్శనతో మెరిసాడు. మెన్స్ లాంగ్ జంప్ ఈవెంట్‌లో 8.09 మీటర్ల దూరం దూకి సిల్వర్ మెడల్ ముద్దాడాడు. గ్లాస్గో పోటీల్లో భారత్‌కు ఇది మరో ప్రౌడ్ మూమెంట్.

ఈ అద్భుత విజయం సాధించిన శ్రీశంకర్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. "భారత అథ్లెటిక్స్‌కు ఇదొక గర్వకారణమైన క్షణం.. కామన్వెల్త్ గేమ్స్ మెన్స్ లాంగ్ జంప్‌లో 8.09 మీటర్ల అద్భుతమైన జంప్‌తో సిల్వర్ మెడల్ సాధించిన టాప్స్ కోర్ అథ్లెట్ శ్రీశంకర్‌కు అభినందనలు" అని సోషల్ మీడియాలో కొనియాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చివరి వరకు బిగ్ ఫైట్
Image Credit : X/RamMNK

చివరి వరకు బిగ్ ఫైట్

గ్లాస్గో అరేనాలో లాంగ్ జంప్ ఫైనల్ పోరు చాలా ఉత్కంఠగా సాగింది. శ్రీశంకర్ తన అత్యుత్తమ ప్రయత్నంలో 8.09 మీటర్లు దూకి రెండో స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన తేజే గేల్ 8.15 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్ మెకెన్జీ 8.08 మీటర్లతో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

చివరి జంప్ వరకు శ్రీశంకర్ గోల్డ్ మెడల్ రేసులో నే ఉన్నాడు. తన ఆరో ప్రయత్నంలో అతను 7.97 మీటర్లు మాత్రమే దూకగలిగాడు. కేవలం 6 సెంటీమీటర్ల స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ, దేశానికి విలువైన రజతాన్ని అందించాడు.

35
గాయం నుంచి కమ్‌బ్యాక్.. చరిత్రాత్మక రికార్డ్
Image Credit : ANI

గాయం నుంచి కమ్‌బ్యాక్.. చరిత్రాత్మక రికార్డ్

ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మెన్స్ లాంగ్ జంపర్‌గా 27 ఏళ్ల శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. గతంలో బర్మింగ్‌హామ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా అతను రజత పతకమే సాధించాడు.

ఈ విజయం శ్రీశంకర్ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. తీవ్రమైన పటెల్లార్ టెండన్ గాయం కారణంగా అతను ప్యారిస్ 2024 ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఆ పెద్ద గాయం నుంచి కోలుకుని, మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టి పతకం గెలవడం అతని పట్టుదలకు నిదర్శనం.

45
క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం
Image Credit : PTI

క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్రీశంకర్ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి, కోచ్ అయిన ఎస్ మురళి 1989 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో ట్రిపుల్ జంప్‌లో సిల్వర్ మెడల్ గెలిచారు. అలాగే తల్లి కేఎస్ బీజిమోల్ 1992 ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో రజతం సాధించింది.

శ్రీశంకర్ వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు 8.41 మీటర్లు. 2023 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, హ్యాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో కూడా అతను సిల్వర్ మెడల్స్ సాధించాడు.

55
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు
Image Credit : PTI

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు

ఇదే లాంగ్ జంప్ ఫైనల్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ లోకేష్ తన తొలి కామన్వెల్త్ గేమ్స్‌లోనే 7.97 మీటర్లు దూకి ఐదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ 7వ రోజున భారత్ గెలుచుకున్న మూడు పతకాల్లో శ్రీశంకర్ సిల్వర్ ఒకటి. దీంతో గ్లాస్గో గేమ్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 15కు చేరింది. ఇందులో 3 గోల్డ్, 9 సిల్వర్, 3 బ్రోంజ్ మెడల్స్ ఉన్నాయి.

ఇప్పటివరకు భారత్ తరఫున మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), షర్మిలా ధంకార్ (ఉమెన్స్ షాట్‌పుట్ F57), దిలీప్ మహాదు గావిట్ (మెన్స్ T47 100m) గోల్డ్ మెడల్స్ సాధించారు.

మొహమ్మద్ బాసిల్ మోర్సింగనక్త్ (రన్నింగ్), మురళి శ్రీశంకర్ (లాంగ్ జంప్), రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్), సర్వేష్ కుషారే (హై జంప్), గుల్వీర్ సింగ్ (10,000m పరుగు) రజత పతకాలు సాధించారు. అలాగే బింద్యారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్), శిల్ప కె. శైల (ఉమెన్స్ షాట్‌పుట్ F57), ఝండు కుమార్ (పారా పవర్‌లిఫ్టింగ్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved