MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!

Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!

Vaibhav Sooryavanshi vs Chris Gayle: క్రిస్ గేల్ కంటే వైభవ్ సూర్యవంశీనే గ్రేటా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే మొదటి 40 T20 ఇన్నింగ్స్‌ల తర్వాత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కంటే వైభవ్ సూర్యవంశీ రన్స్, యావరేజ్, స్ట్రైక్ రేట్‌లో చాలా ముందున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 29 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 లలో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ
Image Credit : ANI

టీ20 లలో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ

యంగ్ క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల వేట మొదలుపెట్టాడు. 2025, 2026 సంవత్సరాల్లో T20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ సాధించి క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శనతోనే అతని ఆట తీరును క్రికెట్ దిగ్గజాలతో పోల్చడం ప్రారంభమైంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో క్రిస్ గేల్ నెలకొల్పిన రికార్డులను వైభవ్ అధిగమించేలా కనిపిస్తున్నాడు. తొలి 40 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత వైభవ్ సాధించిన గణాంకాలు గేల్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదటి 40 ఇన్నింగ్స్ లో గేల్ వర్సెస్ వైభవ్
Image Credit : X/BCCI

మొదటి 40 ఇన్నింగ్స్ లో గేల్ వర్సెస్ వైభవ్

తొలి 40 టీ20 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాక లెక్కలు చూస్తే వైభవ్ సూర్యవంశీ ప్రతీ విషయంలోనూ క్రిస్ గేల్ కంటే చాలా ముందున్నాడు. వైభవ్ 40 ఇన్నింగ్స్‌లలో 1,670 రన్స్ చేయగా, గేల్ కేవలం 1,189 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా 50 ప్లస్ స్కోర్లు, జట్టు గెలిచిన మ్యాచ్‌లు, రన్ చేజ్ లో కూడా వైభవ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్ 42.82 సగటుతో, 216.32 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు, 132 ఫోర్లు, 148 సిక్సర్లు ఉన్నాయి. అతని హయ్యెస్ట్ స్కోరు 144 పరుగులు.

Related Articles

Related image1
Most Expensive Snake: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాము.. ధర కోట్లలో.. ఎందుకంత స్పెషల్?
Related image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
35
గేల్ తొలి 40 ఇన్నింగ్స్ రికార్డులు ఇవే
Image Credit : Getty

గేల్ తొలి 40 ఇన్నింగ్స్ రికార్డులు ఇవే

మరోవైపు క్రిస్ గేల్ తన మొదటి 40 టీ20 ఇన్నింగ్స్‌లలో 33.97 సగటుతో, 137.29 స్ట్రైక్ రేట్‌తో 1,189 రన్స్ చేశాడు. ఇందులో విండీస్ జట్టు తరఫున 15 ఇన్నింగ్స్‌లలో 475 రన్స్, కేకేఆర్ జట్టు కోసం 15 ఇన్నింగ్స్‌లలో 463 రన్స్, జమైకా తరఫున 5 ఇన్నింగ్స్‌లలో 114 రన్స్ సాధించాడు. గేల్ ఖాతాలో 40 ఇన్నింగ్స్ తర్వాత 8 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు (1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు) మాత్రమే ఉండగా, వైభవ్ సూర్యవంశీ ఏకంగా 12 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు (4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు) నమోదు చేసి గేల్ కంటే 481 రన్స్ ఎక్కువ కొట్టాడు.

45
విజేతగా నిలిచిన మ్యాచ్‌లు, రన్ చేజ్ లెక్కలు
Image Credit : X

విజేతగా నిలిచిన మ్యాచ్‌లు, రన్ చేజ్ లెక్కలు

జట్టు గెలిచిన మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌లలో 56.87 సగటు, 240.74 స్ట్రైక్ రేట్‌తో 910 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే గేల్ గెలిచిన 13 మ్యాచ్‌ల ఇన్నింగ్స్‌లలో 41 సగటు, 129.02 స్ట్రైక్ రేట్‌తో 369 రన్స్ మాత్రమే చేసి రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు. రన్ చేజింగ్ విషయానికి వస్తే 20 ఇన్నింగ్స్‌లలో వైభవ్ 34.90 సగటు, 225.16 స్ట్రైక్ రేట్‌తో 698 రన్స్ (1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు) సాధించాడు. గేల్ రన్ చేజింగ్ 19 ఇన్నింగ్స్‌లలో 42.71 సగటు, 135.60 స్ట్రైక్ రేట్‌తో 598 రన్స్ (4 హాఫ్ సెంచరీలు) చేశాడు.

55
వైభవ్ సూర్యవంశీ రాకెట్ లాంటి ప్రయాణం
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ రాకెట్ లాంటి ప్రయాణం

వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత రాజస్థాన్ తరఫున గడిచిన రెండేళ్లలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు ఆడి 2026 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దాంతో 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 T20I ఇన్నింగ్స్‌లలో 32.16 సగటు, 189.21 స్ట్రైక్ రేట్‌తో 2 అర్ధసెంచరీలతో 193 రన్స్ చేశాడు. ఇటీవల జింబాబ్వే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలో 151 రన్స్ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు. వైభవ్ ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్, 13 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Most Expensive Snake: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాము.. ధర కోట్లలో.. ఎందుకంత స్పెషల్?
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved