MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్

Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్

Ayush Shetty: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2026 తొలిరోజే సంచలనం నమోదైంది. భారత 21 ఏళ్ల యువ షట్లర్ ఆయుష్ శెట్టి ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ కు ముచ్చెమటలు పట్టించి చిత్తు చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ayush Shetty: ప్రపంచ నంబర్ 1 కే చెక్.. భారత యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సంచలన విజయం
Image Credit : ANI

Ayush Shetty: ప్రపంచ నంబర్ 1 కే చెక్.. భారత యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సంచలన విజయం

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనా స్టార్ షి యుకీని ఆయుష్ శెట్టి చిత్తు చేశాడు. తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల ఆయుష్, 21-14, 13-21, 21-19 తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గత ఏప్రిల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్లో షి యుకీ చేతిలో ఆయుష్ ఓడిపోయాడు. ఇప్పటివరకు అతడిపై వరుసగా మూడు సార్లు ఓడిపోయిన ఆయుష్, ఈసారి మాత్రం దెబ్బకు దెబ్బ తీశాడు. సొంతగడ్డపై ప్రేక్షకుల సపోర్టుతో ఆయుష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఆయుష్ మాట్లాడుతూ.. అభిమానులు ఇచ్చిన ఎనర్జీతోనే తానూ ఈ విజయం సాధించానని, హోమ్ క్రౌడ్ నిరంతరం తనకు సపోర్ట్ చేసిందని చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంచలన విజయం వెనుక అసలు మ్యాచ్ రీజన్స్ ఇవే
Image Credit : X/bwfmedia

సంచలన విజయం వెనుక అసలు మ్యాచ్ రీజన్స్ ఇవే

మ్యాచ్ ప్రారంభం నుంచే ఆయుష్ చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. తన పవర్‌ఫుల్ అటాకింగ్ షాట్లు, నెట్ గేమ్‌తో షి యుకీపై ఒత్తిడి పెంచి తొలి గేమ్‌ను 21-14తో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో షి యుకీ పుంజుకున్నాడు. ఆయుష్ చేసిన కొన్ని క్రాస్ కోర్ట్ మిస్టేక్స్ వల్ల యుకీ 21-13తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు.

ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆయుష్ 11-5 తో మంచి ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత షి యుకీ వేగంగా పాయింట్లు సాధిస్తూ గట్టి పోటీ ఇచ్చాడు. చివరి నిమిషంలో మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్‌గా మారింది. "చివర్లో అతడు పాయింట్లు సాధిస్తున్నప్పుడు నిజంగా చాలా నర్వస్‌గా అనిపించింది. కానీ ఎలాగోలా మ్యాచ్‌ను ముగించి గెలిచాను. గెలిచాక పెద్ద ఉపశమనం లభించింది" అని ఆయుష్ వెల్లడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆయుష్ 21-19తో మూడో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు.

Related Articles

Related image1
KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే
Related image2
Snake Repellent Plants: పెరట్లో ఈ చిన్న మొక్కలు నాటితే చాలు... పాములు దరిదాపుల్లోకి కూడా రావు
34
మ్యాచ్ గెలిపించిన ఆ లాస్ట్ విన్నింగ్ షాట్
Image Credit : X/bwfmedia

మ్యాచ్ గెలిపించిన ఆ లాస్ట్ విన్నింగ్ షాట్

ఈ మ్యాచ్‌లో ఆయుష్ ఆడిన చివరి షాట్ గురించి అతని కోచ్ సాగర్ చోప్డా ప్రత్యేకంగా మాట్లాడారు. చైనా ప్లేయర్ షి యుకీ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న తర్వాత, ఆయుష్ ఒక అద్భుతమైన డిసెప్టివ్ నెట్ ఫ్లిక్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. షి యుకీ ఫోర్‌హ్యాండ్ వైపు షటిల్ వేస్తున్నట్లు నటించి, చివరి క్షణంలో దిశ మార్చి పాయింట్ కొట్టాడు.

ఆ క్షణంలో ఆయుష్ ఆడిన షాట్ అతని ప్రతిభకు నిదర్శనమని కోచ్ చోప్డా చెప్పారు. "ఆ సమయంలో ఆయుష్ ఆడిన షాట్ నాకు చాలా నచ్చింది. ఒకవేళ అతడు షటిల్‌ను నెట్ దగ్గరే వేసి ఉంటే షి యుకీ దానికి సిద్ధంగా ఉన్నాడు. యుకీ నెట్ దగ్గర ఆయుష్ కంటే చాలా అలర్ట్‌గా ఉన్నాడు. కానీ ఆయుష్ ఆ తిప్పిన షాట్ చూడగానే అదే విన్నింగ్ మోమెంట్ అని నాకు అర్థమైంది" అని కోచ్ వివరించారు. చిన్నతనంలో సొంతంగా నేర్చుకునే ఇలాంటి షాట్లను కోచ్‌లు కూడా నేర్పించలేరని చెప్పారు.

44
కెరీర్‌లోనే బిగ్గెస్ట్ విన్.. సంతోషంలో ఆయుష్
Image Credit : X/BAI_Media

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ విన్.. సంతోషంలో ఆయుష్

మొదటి రౌండ్‌లోనే ప్రపంచ నంబర్ 1 ప్లేయర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయమని ఆయుష్ అన్నాడు. తన డెబ్యూ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనే షి యుకీలాంటి ప్లేయర్‌తో ఆడటం టఫెస్ట్ డ్రా అని, ఇంకా తాను టోర్నీకి అలవాటు పడకముందే అంతటి దిగ్గజంతో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.

"నా కెరీర్‌లో ఇదే బెస్ట్ విన్. సొంతగడ్డపై, డెబ్యూ టోర్నీలోనే వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌ను ఓడించడం చాలా స్పెషల్. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆయుష్ ఆనందం వ్యక్తం చేశాడు. కోచ్ చోప్డా మాట్లాడుతూ.. ఆయుష్ ఏమాత్రం తొందరపడకుండా వెనుక నుంచి పేషెన్స్‌తో ఆడాడని, మాజీ జాతీయ కోచ్ విమల్ కుమార్ కూడా స్టాండ్స్ నుంచి చూస్తూ మ్యాచ్ సమయంలో మంచి సలహాలు అందించారని తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే
Recommended image2
Snake Repellent Plants: పెరట్లో ఈ చిన్న మొక్కలు నాటితే చాలు... పాములు దరిదాపుల్లోకి కూడా రావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved