MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi : మే తర్వాత మోదీ రాజీనామా? తర్వాతి పీఎం ఎవరు? ప్రముఖ జ్యోతిష్కుని సంచలన జోస్యం !

PM Modi : మే తర్వాత మోదీ రాజీనామా? తర్వాతి పీఎం ఎవరు? ప్రముఖ జ్యోతిష్కుని సంచలన జోస్యం !

2026 Prediction :  ప్రధాని మోదీ రాజీనామా, తదుపరి పీఎం ఎవరనే అంశంతో పాటు అమితాబ్, ఐశ్వర్య రాయ్ వంటి సెలబ్రిటీల భవిష్యత్తుపై ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 01 2026, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోదీ రాజీనామా నుంచి 6జీ ఎఫెక్ట్ వరకు.. ఆ జ్యోతిష్కుడు చెప్పిన సంచలనాలు ఇవే
Image Credit : ANI

మోదీ రాజీనామా నుంచి 6జీ ఎఫెక్ట్ వరకు.. ఆ జ్యోతిష్కుడు చెప్పిన సంచలనాలు ఇవే

దేశ రాజకీయాల్లో, సినీ రంగంలో రాబోయే మార్పుల గురించి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పదవీ విరమణ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల వరకు ఆయన పది కీలక అంచనాలను వెల్లడించారు. gyaansutraofficial అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వివరాలను పంచుకున్నారు.

25
ప్రధాని మోదీ రాజీనామా.. వారసుడు ఎవరు?
Image Credit : Asianet News

ప్రధాని మోదీ రాజీనామా.. వారసుడు ఎవరు?

నరేంద్ర మోదీ వరుసగా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 1950లో జన్మించిన మోదీకి ప్రస్తుతం 75 ఏళ్లు నిండాయి. ఈ వయస్సులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా పని చేస్తూ, కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రపోతూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి చేర్చారు.

అయితే, జ్యోతిష్కుని అంచనా ప్రకారం, వచ్చే మే నెల తర్వాత మోదీ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారని చర్చ జరుగుతున్నప్పటికీ, జ్యోతిష్కుడు మాత్రం యోగీ ప్రధాని కాబోరని చెప్పారు. అయితే, ఉత్తరప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gyaan Sutra (@gyaansutraofficial)

Related Articles

Related image1
IND vs PAK : భారత్‌తో నో మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్‌లో పాక్ మైండ్ గేమ్? అసలు కారణం ఇదే
Related image2
Mobile Price Drops : మొబైల్ కొనేవారికి, ఈవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. కేంద్రం ఏం ప్రకటించిందంటే?
35
అమిత్ షా చేతికి పగ్గాలు?
Image Credit : X

అమిత్ షా చేతికి పగ్గాలు?

మోదీ తదుపరి వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని పదవిని చేపడతారని ఈ జ్యోతిష్యవాణి వెల్లడించింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపించినప్పటికీ, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. మార్చి నెల తర్వాత ఒక పెద్ద కుంభకోణం లేదా మోసం బయటపడటం వల్ల ప్రభుత్వం తీవ్రంగా ప్రభావితమవుతుందని, ఆ సమయంలోనే పార్టీలో, ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవిస్తాయని అంచనా వేశారు.

45
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన
Image Credit : our own

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన

రాజకీయాలే కాకుండా సినీ సెలబ్రిటీల గురించి కూడా జ్యోతిష్కుడు షాకింగ్ విషయాలు చెప్పారు. 2026వ సంవత్సరంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మృత్యువు అంచుల దాకా వెళ్లి వస్తారని ఆయన అంచనా వేశారు. ఆయన ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లుతారని జోస్యం చెప్పారు.

ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బంధంపై క్లారిటీ

గత కొంతకాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా 2026లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం, అన్యోన్యత మరింత పెరుగుతుందని జ్యోతిష్కుడు తెలిపారు. వారి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మళ్ళీ ఒక్కటవుతారని ఆయన అంచనా వేశారు.

55
విరాట్ - అనుష్క జీవితంలో మార్పులు
Image Credit : X@RadhaKeliKunj

విరాట్ - అనుష్క జీవితంలో మార్పులు

క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జోస్యం చెప్పారు. అయితే, వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శర్మ మళ్ళీ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తారని, దీనివల్ల వారిద్దరూ ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం కష్టమవుతుందని తెలిపారు. వారు విడిపోకపోయినప్పటికీ, గతంలో ఉన్నంత బలమైన బంధం ఇప్పుడు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే 6జీ టెక్నాలజీ రాకతో ప్రజలకు సౌకర్యాలు పెరిగినా, పర్యావరణంపై దాని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
నరేంద్ర మోదీ
అమిత్ షా

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Related Stories
Recommended image1
IND vs PAK : భారత్‌తో నో మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్‌లో పాక్ మైండ్ గేమ్? అసలు కారణం ఇదే
Recommended image2
Mobile Price Drops : మొబైల్ కొనేవారికి, ఈవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. కేంద్రం ఏం ప్రకటించిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved