MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో

ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో

NMACC: ముంబైలోని నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రపంచంలోని ప్రముఖ సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలను భారత ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 05 2026, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ కళలను భారత్‌కు చేరువ చేసిన NMACC
Image Credit : Asianet News

ప్రపంచ కళలను భారత్‌కు చేరువ చేసిన NMACC

ఒకప్పుడు వెస్ట్ ఎండ్‌ థియేటర్‌ ప్రదర్శనలు, బ్రాడ్‌వే మ్యూజికల్స్‌ లేదా అంతర్జాతీయ స్థాయి కళా ప్రదర్శనలు చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి ప్రపంచ స్థాయి కళా అనుభవాలను భారతదేశంలోనే అందించాలనే ఆలోచనతో NMACC ప్రారంభమైంది. 2023 మార్చిలో ముంబైలో ప్రారంభమైన NMACC.. ప్రదర్శన కళలు, దృశ్యకళలకు ప్రత్యేక ప్లాప్ ఫామ్ గా ఎదిగింది. గత మూడు సంవత్సరాల్లో ఇక్కడ 3,500కు పైగా ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వచ్చారు. సంగీతం, థియేటర్‌, నృత్యం, దృశ్యకళలకు చెందిన 10,500 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు 15కు పైగా భాషల్లో జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అంతర్జాతీయ ప్రదర్శనలతో గ్రాండ్ థియేటర్‌ ప్రత్యేకత
Image Credit : Asianet News

అంతర్జాతీయ ప్రదర్శనలతో గ్రాండ్ థియేటర్‌ ప్రత్యేకత

NMACCలోని గ్రాండ్ థియేటర్‌ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు ప్రధాన ప్లాట్ ఫామ్ గా నిలిచింది. ఇక్కడ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌, వెస్ట్ సైడ్ స్టోరీ, MAMMA MIA, ది పాంథ‌మ్ ఆఫ్ ది ఓపెరా, విక్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. దీనిపై భారతీయ కథలకు కూడా పెద్దపీట వేశారు. ముగల్-ఎ-ఆజమ్: ది మ్యూజికల్, రాజాధిరాజ్: లవ్. లైఫ్. లీలా, NMACC సొంత నిర్మాణం ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్ వంటి ప్రదర్శనలు భారతీయ కథలను భారీ స్థాయిలో చెప్పగల సామర్థ్యాన్ని చాటాయి.

NMACCలోని స్టూడియో థియేటర్‌, ది క్యూబ్‌ కూడా ముంబై సాంస్కృతిక కార్యక్రమాలకు కొత్త ఊపునిచ్చాయి. చిన్న స్థాయి, ప్రయోగాత్మక ప్రదర్శనలకు ఇవి అడ్డాగా నిలుస్తున్నాయి. థియేటర్‌, సంగీతం, కామెడీ, నృత్యం వంటి విభిన్న కళారూపాలను హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఇక్కడ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

35
ప్రపంచ కళా ప్రదర్శనలకు ఆర్ట్ హౌస్‌
Image Credit : Asianet News

ప్రపంచ కళా ప్రదర్శనలకు ఆర్ట్ హౌస్‌

NMACCలోని ఆర్ట్ హౌస్‌ ద్వారా అంతర్జాతీయ కళా ప్రదర్శనలు కూడా ముంబైకి చేరువయ్యాయి. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌, డియా ఆర్ట్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో లైట్ ఇన్‌టూ స్పేస్, భ‌క్తి, వంటి ప్రదర్శనలు ఇక్కడ జరిగాయి. ప్రస్తుతం సెకండ్ నేచ‌ర్‌ పేరుతో ప్రత్యేక ప్రదర్శన కొనసాగుతోంది. ఇది 2027 జనవరి వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో teamLab, A.A. Murakami, Es Devlin, Random International వంటి కళాకారులు, స్టూడియోలు రూపొందించిన తొమ్మిది భారీ స్థాయి కళా ఇన్‌స్టాలేషన్లు ఉన్నాయి.

45
భారతీయ కళకు అంతర్జాతీయ ప్లాట్ ఫామ్
Image Credit : Asianet News

భారతీయ కళకు అంతర్జాతీయ ప్లాట్ ఫామ్

NMACC కార్యకలాపాలు ముంబైకే పరిమితం కాలేదు. ప్రపంచ కళా సమాజంతోనూ సంబంధాలను విస్తరించింది. వెనిస్ బియెన్నాలే 61వ ఎడిషన్‌లో ఇండియా పెవిలియన్‌ను ప్రదర్శించేందుకు NMACC భాగస్వామ్యం చేసింది. దీంతో ప్రపంచంలోని అత్యంత ప్రముఖ అంతర్జాతీయ కళా కార్యక్రమాల్లో ఒకటైన వెనిస్ బియెన్నాలేలో భారత్ తిరిగి తన ఉనికిని చాటుకుంది. ఐదుగురు సమకాలీన భారతీయ కళాకారులను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం లభించింది. భారతీయ కళ, ఆలోచనలు ప్రపంచ ప్రేక్షకులకు చేరువ కావడానికి ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలిచింది.

55
నాలుగో ఏడాదిలో మరిన్ని భారీ కార్యక్రమాలు
Image Credit : Asianet News

నాలుగో ఏడాదిలో మరిన్ని భారీ కార్యక్రమాలు

NMACC ఇప్పుడు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. రాబోయే రోజుల్లో భారతీయ, అంతర్జాతీయ కళారూపాల మధ్య ఈ సాంస్కృతిక మార్పిడి మరింత విస్తరించనుంది. త్వరలో ది గ్రేట్ ఇండియ‌న్ మ్యూజిక‌ల్ సివిలైజేష‌న్ టూ నేష‌న్ తిరిగి ప్రదర్శించనున్నారు. అలాగే చికాగో మ్యూజికల్‌ NMACC పైకి రానుంది. ఆస్కార్‌ నామినీ, ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాక్స్ రిక్టర్‌ తొలిసారి భారత్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు. భిన్న దేశాలు, కళారూపాలు, భాషలు, కళాకారులు, ప్రేక్షకులను ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావడం ద్వారా NMACC భారతదేశంలో సాంస్కృతిక అనుభవాల పరిధిని విస్తరిస్తోంది. అదే సమయంలో భారతీయ కళలు, కథలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ఒక ముఖ్యమైన ప్లాట్ ఫామ్ గా ఎదుగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image2
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Recommended image3
West Bengal Byelection : వెస్ట్ బెంగాల్ లో అసలేం జరుగుతోంది? మాజీ సీఎం మమతకు ఏమిటీ పరిస్థితి?
Related Stories
Recommended image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved