MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?

Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?

సీనియర్‌ నటి షావుకారు జానకి ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పొచ్చు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 20 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐసీయూలో షావుకారు జానకి
Image Credit : our own

ఐసీయూలో షావుకారు జానకి

సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి ఐసీయూలో చేరారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను వారం రోజుల క్రితమే చెన్నైలో కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. 95 ఏళ్ల షావుకారు జానకి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నిన్న రాత్రి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
షావుకారు సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన జానకి
Image Credit : stockPhoto

షావుకారు సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన జానకి

షావుకారు జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో ఆమె కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్.టి.రామారావు హీరోగా నటించిన ఈ చిత్రం పెద్ద హిట్‌ కావడంతో జానకికి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా విజయంతో ఆమె ఇంటిపేరు `షావుకారు`గా మారిపోయింది. అంతా అలానే పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె షావుకారు జానకిగా అలరిస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వయసుపైబడటంతో ఇంటికే పరిమితమయ్యారు.

34
400లకుపైగా చిత్రాల్లో నటిగా అలరించిన జానకి
Image Credit : our own

400లకుపైగా చిత్రాల్లో నటిగా అలరించిన జానకి

నాటకాల నుంచి కెరీర్‌ని ప్రారంభించారు జానకి. ఆమె సినిమాల్లోకి రాకముందే 300లకుపైగా నాటకాలు ప్రదర్శించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె నటనలోని సహజత్వం, మాధుర్యం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె నటించిన పలు చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినీ రంగానికి షావుకారు జానకి అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె తన నటనా ప్రతిభతో పలు తరాల ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

44
నిలకడగానే షావుకారు జానకి ఆరోగ్యం
Image Credit : stockPhoto

నిలకడగానే షావుకారు జానకి ఆరోగ్యం

ప్రస్తుతం షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జానకి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, స్నేహితులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image2
Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా, నా వల్ల కావట్లేదు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకున్న డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved