MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ

OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ

ఈ వారం ఓటీటీలోకి పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రాబోతున్నాయి. బందర్‌, ఐ నోబడీ, మైఖేల్‌, చుంబక్‌, ది విస్పర్ మ్యాన్‌ సహా ఆసక్తికరమైన కంటెంట్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

4 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఆగస్టు చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు భారీ కంటెంట్‌తో సిద్ధమైంది. ఈ వారం పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్‌తో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ కొత్త కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. సినిమాల విషయానికి వస్తే బాబీ డియోల్ నటించిన బందర్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఐ నోబడీ, హాలీవుడ్ చిత్రం ది విస్పర్ మ్యాన్‌, మైఖేల్‌, అన్బే డయానా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెట్‌ఫ్లిక్స్‌
Image Credit : Asianet News

నెట్‌ఫ్లిక్స్‌

చుంబక్‌

సుమీత్ వ్యాస్‌, నీనా గుప్తా, దేవెన్ భోజానీ, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ సిరీస్‌ చుంబక్‌. ఆధునిక పట్టణ హౌసింగ్‌ సొసైటీలోని వివిధ తరాల వ్యక్తుల జీవితాలను వినోదాత్మకంగా చూపించనుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

గ్రేవ్‌యార్డ్‌ సీజన్‌ 3

టర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ గ్రేవ్‌యార్డ్‌ మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది. కొత్త మిస్టరీలు, పోలీసు దర్యాప్తులు, ఉత్కంఠభరితమైన పరిణామాలతో ఈ సీజన్‌ సాగనుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

లీన్‌ సీజన్‌ 2

కామెడీ సిరీస్‌ లీన్‌ రెండో సీజన్‌ కూడా ఈ వారం స్ట్రీమింగ్‌కు రానుంది. 33 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత భర్త మరో మహిళ కోసం వెళ్లిపోవడంతో తన జీవితాన్ని తిరిగి నిర్మించుకునే మహిళ కథగా ఇది సాగుతుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 27

బ్యూటీ ఇన్ బ్లాక్‌ సీజన్‌ 3

అంబర్ రీన్ స్మిత్‌, జేవియర్ స్మాల్స్‌, టేలర్ పొలిడోర్ నటించిన ఈ సిరీస్‌ మూడో సీజన్‌లో అందాల పరిశ్రమతో పాటు పిల్లల అక్రమ రవాణా చుట్టూ సాగే కథ మరింత ఆసక్తికరంగా మారనుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 27

ది విస్పర్ మ్యాన్‌

రాబర్ట్ డి నీరో, మిచెల్ మోనఘన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ది విస్పర్ మ్యాన్‌ ఈ వారం డిజిటల్‌ ప్రీమియర్‌ కానుంది. జేమ్స్ యాష్‌క్రాఫ్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన కుమారుడు కిడ్నాప్‌ కావడంతో ఓ తండ్రి ఎదుర్కొనే పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తించనున్నాయి.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్‌

ఎలిసాబెట్ బెనవెంట్ నవల ఆధారంగా తెరకెక్కిన స్పానిష్ డ్రామా సిరీస్‌ ఇది. ఇద్దరు రూమ్‌మేట్స్‌ ఓ బ్యాచిలరెట్ రోడ్‌ ట్రిప్‌కు వెళ్లడంతో వారి మధ్య దాగి ఉన్న భావాలు బయటకు వచ్చి మొత్తం స్నేహబృందంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

36
జియోహాట్‌స్టార్‌
Image Credit : Asianet News

జియోహాట్‌స్టార్‌

ఐ నోబడీ

పృథ్వీరాజ్ సుకుమారన్‌, పార్వతి తిరువోతు నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఐ నోబడీ థియేటర్లలో మోస్తరు స్పందన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. బ్యాంకు దోపిడీ వ్యవహారంలో చిక్కుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 25

మైఖేల్‌

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మైఖేల్‌ బయోపిక్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 29

జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మోగ్లీ పాత్రను కేంద్రంగా చేసుకుని రూపొందించిన యానిమేషన్ సిరీస్‌ జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ కూడా ఈ వారం స్ట్రీమింగ్‌కు వస్తోంది. అడవిలో మోగ్లీ చేసే సాహసాలు, ఎదుర్కొనే ఆసక్తికరమైన సంఘటనలను ఇందులో చూడొచ్చు.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

అడల్ట్స్‌ సీజన్‌ 2

మాలిక్ ఎలాసల్‌, లూసీ ఫ్రేయర్‌, జాక్ ఇన్నానెన్‌, అమితా రావ్‌, ఓవెన్ థీల్ నటిస్తున్న అడల్ట్స్‌ రెండో సీజన్‌ కొత్త సంబంధాలు, స్నేహాలు, రోజువారీ జీవితంలోని సరదా సంఘటనలతో అలరించనుంది.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

పార్ట్ టైమర్స్‌

జ్ఞానేశ్వరి కండ్రేగుల, తనూజ పుట్టస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్‌ పార్ట్ టైమర్స్‌. వ్యాపార ప్రపంచంలో ఎదగాలని కలలు కనే ఇద్దరు సహోద్యోగుల కథను ఇది చూపించనుంది.

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

46
ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

ప్రైమ్ వీడియో

ది లాస్ట్ సన్‌రైజ్‌

ఈవా లాంగోరియా, మైయా రెఫికో, ఫెర్నాండో లిండెజ్ నటించిన ఇంగ్లిష్ సిరీస్‌ ది లాస్ట్ సన్‌రైజ్‌ ఓ కాలేజీ విద్యార్థి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సాగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే అతడు అనుకోని పరిణామాల తర్వాత జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

రిలీజ్ డేట్ : ఆగస్టు 26

బబితా సింగ్ రిపోర్టింగ్‌

నిమిషా సజయన్‌, బరుణ్ సోబ్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బబితా సింగ్ రిపోర్టింగ్‌. సస్పెన్షన్‌కు గురైన పోలీసు అధికారి బబితా సింగ్ తన చిన్ననాటి స్నేహితురాలి హత్య కేసును దర్యాప్తు చేయడంతో కథ మొదలవుతుంది. ఈ దర్యాప్తు ఆమె గత జీవితంలోని అనేక విషయాలను కూడా బయటకు తీసుకువస్తుంది.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

బెట్టీ లా ఫియా ది స్టోరీ కంటిన్యూస్‌ సీజన్‌ 3

ప్రముఖ కొలంబియన్ సిరీస్‌ బెట్టీ లా ఫియా ది స్టోరీ కంటిన్యూస్‌ మూడో సీజన్‌ కూడా ఈ వారమే వస్తోంది. హ్యూగో లొంబార్డీ ఫేర్‌వెల్ ఫ్యాషన్ షో కోసం బెట్టీ బొగోటాకు తిరిగి రావడంతో కొత్త ప్రేమ త్రికోణం కథలోకి వస్తుంది.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

56
సోనీలివ్‌
Image Credit : Asianet News

సోనీలివ్‌

జియోపర్డీ! మాస్టర్స్‌ సీజన్‌ 4

ప్రముఖ క్విజ్ రియాలిటీ షో జియోపర్డీ! మాస్టర్స్‌ నాలుగో సీజన్‌తో తిరిగి వస్తోంది. కొత్త పోటీదారులు, మరింత కఠినమైన ప్రశ్నలు, భారీ బహుమతి కోసం జరిగే పోటీ ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది.

ఎక్కడ చూడాలి : సోనీలివ్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 25

అన్బే డయానా

పరి ఎలవళగన్‌, రమ్య రంగనాథన్ నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ అన్బే డయానా థియేట్రికల్ రన్‌ తర్వాత ఓటీటీలోకి వస్తోంది. భిన్నమైన నేపథ్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ, వారి కుటుంబాల మధ్య ఏర్పడే పరిస్థితుల చుట్టూ కథ సాగుతుంది.

ఎక్కడ చూడాలి : సోనీలివ్‌

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

66
జీ5
Image Credit : Asianet News

జీ5

బందర్‌

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్‌, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ బందర్‌. ఓ మహిళ చేసిన ఆరోపణతో ఓ వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతుంది, మీడియా తీర్పులు, సామాజిక ఒత్తిడి అతడిని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలను ఈ సినిమా ప్రస్తావిస్తుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరుకునేందుకు సిద్ధమైంది.

ఎక్కడ చూడాలి : జీ5

రిలీజ్ డేట్ : ఆగస్టు 28

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Recommended image3
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Related Stories
Recommended image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved