MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Ahmedabad Serial Blasts: 18 ఏళ్ల నిరీక్షణ..38 మందికి ఒకేసారి ఉరిశిక్ష..అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

Ahmedabad Serial Blasts: 18 ఏళ్ల నిరీక్షణ..38 మందికి ఒకేసారి ఉరిశిక్ష..అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

Ahmedabad Serial Blasts: 2008లో దేశాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బాధితులకు న్యాయం జరిగింది. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 07 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అసలు 2008లో అహ్మదాబాద్‌లో ఏం జరిగింది?
Image Credit : our own

అసలు 2008లో అహ్మదాబాద్‌లో ఏం జరిగింది?

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఏకంగా 38 మందికి కోర్టు మరణశిక్షవిధించింది. అసలు 2008లో అహ్మదాబాద్‌లో ఏం జరిగింది? గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తాజా సంచలన తీర్పు ఏంటి?

2008న ఘోరం జరిగింది. జులై 26న అహ్మదాబాద్ నగరంలో రక్తం ఏరులైపారింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో నగరవ్యాప్తంగా 21 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తరలిస్తున్న సివిల్ హాస్పిటల్, ఎల్‌జీ హాస్పిటల్స్ ప్రాంగణాల్లోనే బాంబులు పేల్చడం ఉగ్రవాదుల క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. బాంబుల సౌండ్‍కు సమీపంలో ఉన్న చాలామంది కొంతకాలం పాటు వినికిడి శక్తిని కూడా కోల్పోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా
Image Credit : twitter

గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా

ఈ దాడులు జరిగిన రెండు రోజుల తర్వాత సూరత్ నగరంలోనూ బాంబులను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేయడంతో ముప్పు తప్పింది. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఈ పేలుళ్లకు వ్యూహం పన్నినట్లు దర్యాప్తులో తేలింది. 

34
సుదీర్ఘ విచారణ
Image Credit : twitter

సుదీర్ఘ విచారణ

అహ్మదాబాద్ నగర క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా మొత్తం 100 మందిని నిందితులుగా చేర్చారు. అందులో 78 మందిపై పూర్తిస్థాయి విచారణ సాగింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించింది. తగిన ఆధారాలు లేని కారణంగా 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. కేసులో అప్రూవర్‌గా మారిన ఒక నిందితుడికి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించగా.. తొలుత అప్రూవర్లుగా మారి, ఆ తర్వాత తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకున్న మరో నలుగురికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

44
బాధితులకు పరిహారం
Image Credit : twitter

బాధితులకు పరిహారం

2022లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన గుజరాత్ హైకోర్టు... కింది కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే కేసులో 38 మందికి మరణశిక్ష, మరో 11 మందికి జీవితఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పునరుద్ఘాటించింది. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిహార చెల్లింపుల ప్రక్రియను మార్చి 31, 2027 లోగా పూర్తి చేయాలని గడువు కూడా పెట్టింది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image2
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Related Stories
Recommended image1
Inspiring Story: ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే
Recommended image2
Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved