MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Inspiring Story: ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే

Inspiring Story: ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే

Inspiring Story: ఒక రేర్ స్కిన్ డిసీజ్ తో పుట్టిన ఒక అబ్బాయి.. చిన్న వయసులోనే ఎన్నో అవమానాలు ఎదుర్కున్నప్పటికీ ఇప్పుడు యువ వ్యాపారవేత్త, ఒక కంటెంట్ క్రియేటర్ గా నిలబడి ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 07 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా గుండె బరువెక్కాల్సిందే
Image Credit : Telugu-Talks With LK/youtube

ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా గుండె బరువెక్కాల్సిందే

సాధారణంగా మనలో ఏదైనా సమస్య ఉంటే...ఇంక ఏం చేయలేం, నా వల్ల కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. వెనుకడుగు వేసేస్తారు. అందులోనూ ఏమైనా డీసిజేస్ ఉంటే కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రావడానికి ఇష్టపడరు. ఒక ఆత్మన్యూనత భావానికి గురై సొసైటీలో తిరగలేరు. కానీ ఒక అబ్బాయి మాత్రం పుట్టడమే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్న వయసు నుంచే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కున్నాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడొక కంటెంట్ క్రియేటర్‍గా, యువ వ్యాపారవేత్తగా ఎలా మారాడన్నది, అతని జర్నీ ఎలా సాగిందో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిన్న వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదల
Image Credit : Telugu-Talks With LK/youtube

చిన్న వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదల

theabhicreator అభిషేక్‍ది విజయవాడ. తల్లిదండ్రులు ఇద్దరూ టైలర్లు. చిన్న వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉండేవారు. బయట అవమానాలు ఎదురైనా...తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేసేవారంట. 8 వ తరగతిలోనే కంటెంట్ క్రియేట్ చేయడానికి అతని తల్లి బాగా హెల్ప్ చేసేవారు. స్కూల్ లో ఫ్రెండ్స్ టచ్ చేయకోవడం, పక్కన కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదట. కానీ టీచర్లు మాత్రం కేరింగ్ తో చూసుకునేవారు. 10 వ తరగతి నుంచి క్లైంట్ లకు వీడియోలు చేసి ఇచ్చేవారు. 

Related Articles

Related image1
Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Related image2
Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
36
కంటెంట్ క్రియేషన్
Image Credit : Telugu-Talks With LK/youtube

కంటెంట్ క్రియేషన్

చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం వల్ల, ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఫోన్ కు ఎక్కువ అడిక్ట్ అయ్యారు అభిషేక్. అలా యూట్యూబ్ లో టెక్ వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తూ ఇన్ స్పెయిర్ అయి కంటెంట్ క్రియేషన్ మీద మరింత అవగాహన పెంచుకున్నాడు. 

46
స్ట్రాంగ్ గా నిలబడ్డ క్రియేషన్
Image Credit : Telugu-Talks With LK/youtube

స్ట్రాంగ్ గా నిలబడ్డ క్రియేషన్

కంటెంట్, మాటతీరు ఉంటే చాలు కెమెరా క్వాలిటీ, మైక్ సెట్టింగ్స్, పెద్ద పెద్ద ఎక్విప్ మెంట్లు అవసరంలేదని అభి చెబుతున్నారు. ఏమీ లేకుండానే కేవలం రూ.8 వేల సెల్ ఫోన్ తోనే వీడియోలు తీసేవాడిని అభి అంటున్నారు. 250 వీడియోలకు వీడియోలు చేసి ఇచ్చి కొంచెం కొంచెం డబ్బులు సంపాదించడం మొదలైంది. జీరో నుంచి ఇప్పుడు అతని యూట్యూబ్ 40 వేల మంది ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నాడు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకువెళ్తున్నాడు. కానీ ఒక వ్యక్తి నీ ముఖానికి వీడియోలు ఎందుకు అంటూ పదే పదే మేసేజ్ పెట్టడంతో...కాస్త డిమోటివేట్ అయిపోయారు. కానీ మళ్లీ కోలుకుని కంటెంట్ క్రియేషన్ ఫుల్ ఫోకస్ పెట్టారు.

56
అభిషేక్ మేసేజ్
Image Credit : youtube

అభిషేక్ మేసేజ్

కంటెంట్ క్రియేషన్ అంటే డబ్బులు సంపాదించుకోవడం, కొలాబరేషన్స్ కాదని అభిషేక్ అంటున్నారు. కరెక్ట్ గా వాడుకుంటే లైఫ్ సెట్ అవుతుందని, పర్శనాలిటీ బిల్డ్ అవుతుందని చెబుతున్నారు. ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా కష్టపడాలి అని, కానీ అవేవీ ఎదుటివారికి కనిపించవని అంటున్నాడు. 

66
స్టార్టప్..
Image Credit : youtube

స్టార్టప్..

ఇప్పుడు ఇంటర్ చదువుతున్న అభిషేక్...యూట్యూబ్ బిల్డ్ కావడంతో దాన్ని బేస్ చేసుకుని క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. తల్లిదండ్రులు ఇద్దరూ టైలర్ కావడంతో దానిపై ఉన్న అవగాహనతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎంతోమందికి మార్గదర్శి అవుతున్నాడు. తనలో ఉన్న మైనస్ లనే పాజిటివ్ గా మలుచుకున్నాడు. తల్లిదండ్రులకు అండగా నిలబడ్డాడు. నా దగ్గర ఏమీ లేదు అనుకోకుండా…ఉన్నదాంతో తృప్తి చెందితే ఎప్పటికైనా సక్సెస్ అవ్వొచ్చని నిరూపిస్తున్నాడు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఫీల్ గుడ్ న్యూస్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken facts: చికెన్ పేద‌ల ఆహారమా.? కోడి మాంసానికి అస‌లీ పేరు ఎలా వ‌చ్చిందంటే.?
Recommended image2
Snakes In Cars : వానాకాలంలో కార్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి?
Recommended image3
Top 5 Costliest Cities: లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ టాప్ 5 సిటీస్ ఇవే
Related Stories
Recommended image1
Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Recommended image2
Success Story: వంటల వీడియోలతో ఈ 'బాబాయ్' నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved