MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?

Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?

రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతూ నటించిన `మారెమ్మ` మూవీ గురువారం విడుదలైంది. కానీ ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందంటే?

5 Min read
Author : Aithagoni Raju
Published : Sep 10 2026, 06:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మారెమ్మ మూవీ రివ్యూ
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీ రివ్యూ

మాస్‌ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతూ `మారెమ్మ` చిత్రంలో నటించాడు. దీపా బాలు హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ మూవీకి మంచాల నాగరాజు దర్శకుడు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్‌ రెడ్డి బండారు నిర్మించారు. ఇందులో వికాస్‌ వశిష్ట, వినోద్‌ కుమార్‌, వీఎస్‌ రూపాలక్ష్మి, దయానంద్‌ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది నేడు గురువారం(సెప్టెంబర్‌ 10)న విడుదలయ్యింది. కానీ ముందుగానే బుధవారం రాత్రి పెయిడ్‌ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి వీటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మారెమ్మ మూవీ కథ
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీ కథ

వరంగల్‌లోని మహిషాపురం అనే గ్రామంలో గత్తర వచ్చి చాలా మంది జనం రోగాలబారినపడతారు. అదే సమయంలో వర్షాలు, వరదలతో ఊరంతా వల్లకాడు అవుతుంది. ఆ సమయంలోనే ఊరి ప్రజలకు మారెమ్మ విగ్రహం దొరుకుతుంది. ఆమెని గ్రామ దేవతగా భావించి పూజలు చేస్తారు. అమ్మవారికి దున్మపోతుని బలివ్వడంతో గత్తర పోతుంది. వరదలు తగ్గిపోతాయి. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలోనే ఒంటికన్ను పూజారి ఊర్లో దున్నపోతు జన్మిస్తుందని, దాన్ని బాగా చూసుకోవాలని వచ్చే పదేళ్లకి అమ్మవారికి బలి ఇవ్వాలని చెబుతాడు. ఆ దున్నపోతుని పెంచే బాధ్యత కర్ణి(మాధవ్‌) కి అప్పగిస్తారు. ఆ దున్నపోతుకి మారెమ్మ అనే పేరు పెడతారు. ఊర్లో ఏ చెడు జరిగినా, ఎవరైనా చెడుగా ప్రవర్తించినా మారెమ్మకి కోపం వస్తుంది. వారి అంతు చూస్తుంది. అయితే జలేంధర్‌(వికాస్‌ వశిష్ట) మాత్రం మారెమ్మపై పగపెంచుకుంటాడు. దాన్ని చంపేయాలనుకుంటాడు. ఈ క్రమంలో దాన్ని చంపేందుకు ఒక మాంత్రికురాలు వద్దకు వెళ్తాడు. దానికి తాయత్తు కడతాడు. మరోవైపు అమ్మవారి జాతరకి ఊరంత సన్నద్ధమవుతుంది. జాతరకు మరో నాలుగు రోజులే ఉంటుంది. జాతరకి దున్నపోతుని బలివ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉన్నట్నుంచి మారెమ్మ కనిపించదు. మరి అది ఎటుపోయింది. ఊర్లో జరిగే సంఘటనలకు కారణం ఎవరు? మారెమ్మని పెంచిన కర్ణి ఏం చేశాడు? ఈ ఏడాది జాతర సవ్యంగా జరిగిందా? లేదా? ఈ క్రమంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఊరి ప్రజల పరిస్థితేంటి? మారెమ్మ కోసం కర్ణి చేసిన పోరాటమేంటి? తన మరదలు(దీపా బాలు)తో ఆయన ప్రేమాయణం ఎలా సాగిందనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
37
మారెమ్మ మూవీ విశ్లేషణ
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీ విశ్లేషణ

గ్రామ దేవతలు, అమ్మోరుని బేస్‌ చేసుకొని ఆనాటిగా సినిమాలు అదపాదడపా వస్తూనే ఉన్నాయి. ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కూడా హర్రర్‌, డివోషనల్‌ ఎలిమెంట్లతో మూవీస్‌ వస్తున్నాయి. అందులో భాగంగా మారెమ్మ అనే గ్రామ దేవతకి సంబంధించిన కథతో ఈ `మారెమ్మ` మూవీని రూపొందించారు. ఊరికి గత్తర వస్తే.. మారెమ్మ అమ్మవారు ఎలా కాపాడుకున్నారు? ఆమెకి దున్నపోతు బలి ఇవ్వడం, ఆ దున్నపోతుని హీరో పెంచడం, దానితో మంచి అనుబంధం ఏర్పడటం వంటి అంశాలను బేస్‌ చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. ప్రారంభంలో బ్యాక్‌ స్టోరీ చెప్పి మూవీపై ఆసక్తిని పెంచారు. దున్నపోతు జన్మించడం వరకు కథ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత రెగ్యూలర్‌గా సాగుతుంది. దున్నపోతు ఊర్లో రచ్చ చేయడం, దాన్ని మాధవ్‌ పెంచడం, మరోవైపు తన మరదలితో ప్రేమాయణం నడిపించడం వంటి సీన్లతో రన్‌ అవుతుంది. విలేజ్‌లోనూ కొంత కమర్షియల్‌ యాంగిల్‌ పెట్టారు. అది ఏమాత్రం సెట్‌ కాలేదు. వెళ్లే కథకి, హీరో లవ్‌ ట్రాక్‌ బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంటుంది. మారెమ్మపై విలన్‌ కుట్ర చేయడం నుంచి కథ సీరియస్‌గా మారుతుంది. థ్రిల్లర్‌ జోన్‌లోకి వెళ్తుంది. కానీ మారెమ్మ శత్రువులను గుర్తించి వారిపై ఎటాక్‌ చేయడం వంటి సీన్లు కొంత వరకు బాగున్నాయి. కానీ ఆ తర్వాత కథ గాడి తప్పింది. ఇంటర్వెల్‌కి వచ్చే సీన్లు ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం మారెమ్మని వెతకడంతోనే సరిపోతుంది. మధ్యలో అమ్మవారి ఎఫెక్ట్ లు ఇచ్చారు. మాంత్రికురాలు చేసే మాయలతో రన్‌ అవుతుంది. ఆ తర్వాత మారెమ్మ ఎటుపోయిందనే సస్పెన్స్ నెలకొంటుంది. చూసే ఆడియెన్స్ కూడా అదే ఫీల్‌ అవుతారు. క్లైమాక్స్ కొంత ఇంట్రెస్టింగ్‌ మారి రెగ్యూలర్‌ చప్పగా కన్‌ క్లూజన్‌ తీసుకుంది.

47
మారెమ్మ మూవీలో ప్లస్‌, మైనస్‌లు
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీలో ప్లస్‌, మైనస్‌లు

సినిమాలో ప్లస్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ నేపథ్యంలో, మారెమ్మ కథని ఎంచుకోవడం. ఇక దర్శకుడు సినిమాని నడిపించిన తీరు, ఆర్టిస్ట్ లతోపాటు చాలా వరకు అన్నీ మైనస్‌గానే చెప్పాలి. కథలో బలమైన కాన్ల్ఫిక్ట్ ని బాగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. కట్టే కొట్టే తెచ్చే అనేలా మూవీని తీశారు. సినిమా మొత్తం అతుకుల బొంతలా ఉంది. ఒక సీన్‌కి, తర్వాత వచ్చే సీన్‌కి సంబంధం లేదు. సీన్లు కూడా ప్రాపర్‌గా కంప్లీట్‌ కాలేదు. సినిమా నత్తనడకనా సాగుతుంది. ఎంత సేపు అక్కడే తిరుగుతుంది. సినిమాలో మాధవ్‌ హీరో కాదు, దున్నపోతే హీరో. మాధవ్‌ది సెకండ్‌ లీడ్‌ రోల్‌ అనేలా ఉంటుంది. నటుడిగానూ ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఆయన పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉంది. సినిమాని నడిపించే ఒక త్రెడ్‌ ఉంటుంది. దాని చుట్టూనే ఎమోషన్స్ అల్లుకుంటాయి. కానీ ఇందులో అదే మిస్‌ అయ్యింది. ప్రేమ కథ ఏమాత్రం సెట్‌ కాలేదు, ఫన్‌ లేదు. ఎమోషన్స్ అంతకంటే లేవు. అమ్మవారి మహిమలు కూడా క్లారిటీగా చూపించలేదు. దున్నుపోతు కథ కూడా లాజిక్ లెస్‌గా ఉంది. సినిమాని నడిపించే భావోద్వేగాలు లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. వాటెంట్‌గా సీన్లు వస్తున్నట్టుగా ఉన్నాయి. సహజత్వం మిస్‌అయ్యింది. తెలంగాణ యాస ఏమాత్రం సెట్‌ కాలేదు. హీరోకి అస్సలు సెట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ స్లో అంటే, సెకండాఫ్‌ కథ లేక అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. ముగింపు కూడా ఏమాత్రం కిక్‌ ఇవ్వలేకపోయింది. ఏదో ముగించాలి కదా అన్నట్టుగా క్లోజ్‌ చేశారు.

57
మారెమ్మ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

కర్ణి పాత్రలో మాధవ్‌ భూపతిరాజు కొంత వరకు మెప్పించాడు. స్క్రీన్‌పై ప్రామిసింగ్‌గా ఉన్నాడు. కానీ నటుడిగా ఇంకా బెటర్ కావాల్సింది. డైలాగ్‌లు చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. నటుడిగా ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్స్ ప్రెషన్స్ పరంగా తేలిపోయాడు. యాక్టింగ్‌ పరంగా ఆయన్ని చాలా వరకు కెమెరాలతో మ్యానేజ్‌ చేశారు. అంతేకాదు పాత్రకి పెద్దగా ప్రయారిటీ కూడా ఇవ్వలేదు. దున్నపోతు పాత్రని హీరోని చేశారు. ఇక ఆయన మరదలి పాత్రలో హీరోయిన్‌గా దీపా బాలు ఫ్రెష్ గా ఉంది. ఉన్నంతలో మెప్పించింది. అందంగానూ ఉంది. ఊరి పెద్దగా వినోద్‌ కుమార్‌ పాత్రలో ఒదిగిపోయారు. హీరో ఫ్రెండ్స్ గా మైవిలేష్‌ షో అనిల్‌, యాదమ్మ రాజు ఓకే అనిపించారు. కానీ వీరి నుంచి కామెడీని రాబట్టుకోలేకపోయారు. అలాగే సదానందం ద్వారా కూడా కామెడీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. నెగటివ్‌ రోల్ లో వికాస్‌ రెడ్డి అదరగొట్టాడు. రూపాలక్ష్మి, దయానంద్‌ రెడ్డి వంటి వారు ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.

67
మారెమ్మ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@MokshaArtsoffl

మారెమ్మ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి ప్రశాంత్‌ విహారి మ్యూజిక్‌ ఏమాత్రం హెల్ప్ కాలేదు. కొన్ని చోట్ల ఫర్వాలేదనిపించింది. కానీ చాలా వరకు తేలిపోయింది. ప్రశాంత్‌ అంకిరెడ్డి కెమెరా వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ముప్పై ఏళ్ల నాటి లుక్‌ని తీసుకొచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. సాయి బాబు తలారి ఎడిటింగ్‌ పెద్ద మైనస్‌. సీన్‌ సీన్‌కి సంబంధం లేదు. సినిమా ముక్కలు ముక్కలుగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా పరిధి మేరకు ఓకే. కాకపోతే పెద్దగా ఖర్చు పెట్టినట్టుగా కూడా లేదు. చాలా వరకు దులిపేసినట్టు ఉంది. క్వాలిటీ మిస్‌ అయ్యింది. దర్శకుడు మంచాల నాగరాజు ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన డైలాగ్‌ల్లో పస లేదు. స్క్రీన్‌ ప్లే పెద్ద మైనస్‌. కట్‌ పేస్ట్ లా మూవీని తీసినట్టు ఉంది. సీన్‌ సీన్‌కి సంబంధం లేకుండా ఉంది. దీంతో ఆడియెన్ మూవీతో కనెక్ట్ కాలేకపోతారు. ఎమోషన్‌ మిస్‌ కావడంతో సీన్లు వచ్చి పోతున్నాయి తప్ప, ఆ సోల్‌ కనెక్ట్ కావడం లేదు. చాలా లాజిక్స్ కూడా మిస్‌ అయ్యాయి. ఇదే ఈ మూవీకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. కథకి మధ్యలో లవ్‌ ట్రాక్‌, ఇతర పాత్రలకు సంబంధించిన సీన్లు, సదానందం సీన్లు ఇలా చాలా వరకు సీన్లు ఇరికించినట్టుగా ఉన్నాయి. కథ ఫ్లోని దెబ్బతీశాయి. సినిమా రూపమే మారిపోయింది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు మరింత కేర్‌ తీసుకోవాల్సింది.

77
ఫైనల్‌గా..
Image Credit : X/@MokshaArtsoffl

ఫైనల్‌గా..

ఆకట్టుకోవడంలో విఫలమైన మారెమ్మ. సినిమాలో గత్తర రావడం కాదు, సినిమా చూస్తే గత్తర వచ్చేలా ఉంది. తెలంగాణ నేపథ్యంలో, అమ్మోరు నేపథ్యంలో కథలు కమర్షియల్‌గా వర్కౌట్‌ అవుతున్నాయని చేసిన ప్రయత్నంగానే ఉంది తప్ప, ఇందులో సిన్సియారిటీ, జెన్యూనిటీ ఏమాత్రం కనిపించడం లేదు.

రేటింగ్‌: 1.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Recommended image2
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image3
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Related Stories
Recommended image1
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Recommended image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved