MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ

Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ

`బేబీ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ తెలిసింది. ఎలా ఉందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 09 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బేబీ తర్వాత ఆనంద్‌, వైష్ణవి నటించిన `ఎపిక్‌`
Image Credit : Asianet News

బేబీ తర్వాత ఆనంద్‌, వైష్ణవి నటించిన `ఎపిక్‌`

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌`. `బేబీ` తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీకర మూవీస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` వెబ్‌ సిరీస్‌కి కొనసాగింపుగా చెప్పొచ్చు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్‌ టాక్‌ ఏంటి? చిత్ర బృందం ఏం చెబుతుందనేదాన్ని బట్టి చూస్తే, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. మరి సినిమాకి టాక్‌ ఎలా ఉందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎపిక్‌ మూవీ కథ ఇదేనా
Image Credit : Asianet News

ఎపిక్‌ మూవీ కథ ఇదేనా

వనపర్తికి చెందిన ఒక సాధారణ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు, హైదరాబాద్‌కి చెందిన కాస్త రిచ్‌ అయిన అమ్మాయి చదువుకోవడానికి యూకే వెళ్తారు. అక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. లివింగ్‌ రిలేషన్‌లో ఉంటారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ ఎలా ప్రారంభమైంది, ఆ ప్రేమ రొమాన్స్ వరకు ఎలా చేరింది. రొమాన్స్ తర్వాత ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఎలాంటి గొడవలు అయ్యాయి? వీరిద్దరి టెన్షన్‌ ఏంటి? ఇద్దరి ఏం మాట్లాడుకున్నారు? ఎలా ఉన్నారనేది ఈ సినిమా కథ.

Related Articles

Related image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Related image2
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
34
ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్
Image Credit : Asianet News

ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్

ఇదొక ఫన్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, జెంజీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. అయితే లవర్స్ మధ్య చర్చ మామూలుగా అయితే రహస్యంగా ఉంటుంది. అదే చర్చ ఓపెన్‌గా చెప్పుకుంటే అదే ఇందులో చూపించారు. ఒక లవర్స్ ఏమాట్లాడుకుంటారనేది ఇందులో ఓపెన్‌గా చెప్పారు. అదే ఇందులో కొత్తదనం. అదే ట్రెండ్‌ సెట్టింగ్‌గా ఉంటుందని హీరో ఆనంద్‌ దేవరకొండ చెప్పారు. జీవితం అంటేనే ఒక మెమొరి, ఆ మెమొరీస్‌, ఎమోషన్స్ మేళవింపుగా ఈ సినిమా ఉంటుందట. ఫ్యామిలీ చూసే అంశాలు కూడా ఉంటాయట. ట్రైలర్‌ లో చూపించిన అంశాలు కొంత వరకే అని, అంతకు మించిన ఎమోషన్స్, లవ్‌ ట్రాక్‌ ఉంటుందని ఫ్యామిలీ కూడా చూసేలా సినిమా ఉంటుందన్నారు.

44
ఎపిక్‌ సెన్సార్‌ రిపోర్ట్
Image Credit : Asianet News

ఎపిక్‌ సెన్సార్‌ రిపోర్ట్

సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్‌ పొందింది. లిప్‌ లాక్‌లు, రొమాంటిక్‌ సీన్లు, కొన్ని ఇంటిమసీకి సంబంధించిన సీన్లు, డైలాగ్‌లు ఉండటంతో ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి వచ్చిందట. దీంతో ఈ సినిమాని 18ఏళ్లకుపై బడ్డ వారు మాత్రమే చూడాలి. చిన్నపిల్లలు చూసే ఛాన్స్ లేదు. సినిమా నిడివి రెండు గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఇది ఆదిత్య అనే కుర్రాడు, కడలి అనే అమ్మాయి జర్నీని చూపిస్తుందట. అది కొంత ఎమోషనల్‌గా ఉంటుందట. అబ్బాయి భయంగా కనిపిస్తే, కడలి డేరింగ్‌గా బోల్డ్ గా ఉంటుందట. జాబ్, లవ్, కుటుంబ బాధ్యతల గురించి ఇలా ఎన్నో అంశాలను సహజంగా, అందంగా చూపించారట. ఇది ప్రతి ఒక్కరి కనెక్ట్ అయ్యే కథ అని, నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను మనం అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో ఎపిక్ సినిమా అలా ఉంటుందని టీమ్‌ చెబుతుంది. అంతర్లీనంగా పలు సామాజిక అంశాలను చర్చించేలా ఉంటుందట. మొత్తంగా మూవీ ఫన్‌, లవ్‌, రొమాన్స్, డ్రామా, ఎమోషన్స్ మేళవింపుగా ఉంటుందని టాక్‌. నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుందట. కొంత ల్యాగ్‌ ఉంటుందని, ఫన్‌ అన్ని చోట్ల వర్కౌట్ కాలేదని, బలవంతంగా పెట్టినట్టు ఉంటుందని టాక్‌. మరి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది? నిజంగానే సినిమా బాగుందా అనేది ఏసియా నెట్‌ ఒరిజినల్‌ రివ్యూ కోసం వేచి ఉండండి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image2
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
Recommended image3
Allu Arjun Home Tour: 100 కోట్ల అల్లు అర్జున్ 'బ్లెస్సింగ్' ఇల్లు చూశారా? లోపల ఎంత లగ్జరీగా ఉందో
Related Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved