MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Baby Food: 6 నెలల నుంచి ఏడాది పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి? ఏవి పెట్టకూడుదు

Baby Food: 6 నెలల నుంచి ఏడాది పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి? ఏవి పెట్టకూడుదు

Baby Food: ఆరు నెలల తర్వాత పిల్లలకు తల్లిపాలతో పాటు సాలిడ్ ఆహారం మొదలుపెడతారు. అయితే చాలా మంది తల్లులకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఏవి పెట్టకూడదు? అనే విషయాలపై అవగాహన ఉండదు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 04 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆరు నెలల వయసు దాటాక ఫుడ్స్
Image Credit : Pixabay

ఆరు నెలల వయసు దాటాక ఫుడ్స్

చంటి పిల్లలకు ఆరు నెలలు వచ్చాక తల్లిపాలు లేదా ఫార్ములా పాలు ఒక్కటే సరిపోటు. వాటితో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. వారి ఎదుగుదలకు మరిన్ని పోషకాలు అవసరం పడతాయి. ఈ వయసులో వాళ్ల పోషకావసరాలు బయటి ఆహారం మొదలుపెట్టమని చెబుతారు వైద్యులు.

తల్లిపాలు లేదా ఫార్ములా పాలను వెంటనే ఆపేసి, వేరే ఆహారానికి పిల్లల్ని మార్చకూడదు. మొదట్లో కొద్దికొద్దిగా పెడుతూ, కొత్త రుచులకు, పదార్థాలకు అలవాటు పడేలా పిల్లలకు సమయం ఇవ్వాలి. ముఖ్యంగా, పెద్దలు తినే ఆహారాన్ని నేరుగా పిల్లలకు పెట్టకూడదు. ఆహారం మెత్తగా, వాళ్లకు తగినట్టుగా వండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిల్లలకు ఏమేం ఆహారం పెట్టొచ్చు?
Image Credit : Asianet News

పిల్లలకు ఏమేం ఆహారం పెట్టొచ్చు?

ఆరు నెలల నిండిన బిడ్డకు తినే సామర్థ్యాన్ని బట్టి రకరకాల ఆహారాలను నెమ్మదిగా పరిచయం చేయొచ్చు.అన్నం వండిన గంజి, బాగా ఉడికించిన పప్పులు, బాగా ఉడికించిన కూరగాయలు, మెత్తటి పండ్లు, గుడ్లు, బాగా ఉడికించిన మాంసం లేదా చేపలు, చక్కెర లేని పెరుగు వంటివి సరైన రూపంలో ఇవ్వొచ్చు.

'ఏం పెడుతున్నాం?' అనే దానితో పాటు 'ఎలా పెడుతున్నాం?' అన్నది కూడా ముఖ్యం. మొదట్లో మెత్తగా గుజ్జులా చేసి, తర్వాత వాళ్ల వయసును బట్టి కొంచెం గట్టి పదార్థాలకు మార్చాలి. ఉదాహరణకు, గట్టిగా ఉండే యాపిల్ ముక్కను నేరుగా ఇవ్వకుండా, దాన్ని మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి ఇవ్వాలి. పిల్లలు తినేటప్పుడు కూర్చోబెట్టాలి. పెద్దవాళ్లు పక్కనే ఉండి గమనిస్తూ ఉండాలి. వాళ్ల నోట్లో ఆహారాన్ని కుక్కకూడదు.

33
తేనె, ఉప్పు, చక్కెర... వద్దు
Image Credit : Chatgpt

తేనె, ఉప్పు, చక్కెర... వద్దు

ఏడాది నిండేవరకు పిల్లలకు తేనె పెట్టకూడదు. తేనెలో ఉండే 'క్లోస్ట్రిడియం బోటులినమ్' (Clostridium botulinum) అనే బ్యాక్టీరియా వల్ల 'ఇన్‌ఫాంట్ బోటులిజం' అనే తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, పిల్లల ఆహారంలో అనవసరంగా ఉప్పు, చక్కెర కలపొద్దు. పెద్దలకు అవసరమైనంత ఉప్పు, తీపి పిల్లలకు అవసరం లేదు.

పండ్లలో ఉండే సహజమైన చక్కెర వేరు, మనం అదనంగా కలిపే చక్కెర వేరు. కాబట్టి పండ్లు మానక్కర్లేదు, కానీ అదనపు చక్కెర కలపడం మానాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎక్కువ ఉప్పు, చక్కెర లేకుండా చూసుకోవాలి.

గుడ్లు, పల్లీలు, పాల ఉత్పత్తులు, చేపలు వంటివి అలర్జీ కలిగిస్తాయనే భయంతో పెట్టరు. గుడ్డును బాగా ఉడికించి లోపలి పచ్చసొనను తినిపించాలి. పచ్చసొనలో కొంచెం పాలు కలిపితే అది పలుచగా అవుతుంది. సులువుగా గొంతుదిగుతుంది. ఎగ్ వైట్ మాత్రం ఏడాది నిండే వరకు పెట్టకూడదు. ఇక చేపలను ఉడికించి, ముళ్లు తీసేయాలి. పల్లీలను పీనట్ బటర్‌ రూపంలో ఇవ్వచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Recommended image2
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image3
Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!
Related Stories
Recommended image1
సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?
Recommended image2
టాబ్లెట్లను ముక్కలు చేసి వేసుకోవచ్చా? అలా వేసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved