MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ

Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ

Vinayaka Chavithi Prasadam Recipes: పూజలు, వ్రతాలు అంటే ప్రసాదాలు ఉండాల్సిందే. ఇక వినాయకచవితి గురించి చెప్పక్కర్లేదు. బొజ్జ గణపయ్యకు బోల్డెన్నీ ప్రసాదాలు పెడతాం. అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా, త్వరగా చేసుకునేలా 5 రకాల ప్రసాదాలు గురించి చూద్దాం.

3 Min read
Author : Nandini Arava
Published : Sep 12 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు
Image Credit : chatgpt

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు

వినాయక చవితి వచ్చిందంటే చాలు....ఏం ప్రసాదాలు చేయాలి అని రకరకాలు ఆలోచిస్తారు. వాటి కోసం ఓ హైరానా పడిపోతుంటారు. ఒక్కో ఏరియాలో ఒక్కోరకంగా ప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఒకరు పప్పుండ్రాళ్లు, మరొకరు పాలతాళికలు, ఇంకొకరు మోదకాలు...ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు ఉండాల్సిందే. అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా, త్వరగా చేసుకునేలా 5 రకాల ప్రసాదాలు గురించి చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాలతాళికలు
Image Credit : amma chethi vanta/youtube

పాలతాళికలు

2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి కప్పు నీళ్లు పోసి పావు టీస్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీన్ని కలిపాక ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో, అదే కప్పుతో పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఉండల్లేకుండా కలిపి చల్లార్చాలి.తర్వాత 5 నిమిషాల పాటు కలిపి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇక తాళికలు చేసుకోవాలి. కుదిరితే చేతితో చేసుకోవచ్చు. లేదంటే రౌండ్ హోల్స్ ఉండే జంతికల గొట్టంతో అయినా తాళికలు వేసుకోవచ్చు. అందులో చిన్న ముద్దను నీటిలో కలిపేసి వాటర్ లాగా చేసేయండి. ఇప్పుడు గిన్నెలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు. కిస్ మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడదే గిన్నెలో బియ్యం పిండి తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి మరగనివ్వాలి.

ఇప్పుడు స్టవ్ మీదే కడాయి పెట్టి చిక్కటి పాలు వేసి మరగించండి. పాలు మీగడ రాక ముందే నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసేయండి. అవి ఉడికాక...తాళికలు వేసుకోవాలి. వెంటనే కలిపేయకుండా కాసేపాగి కలపాలి. లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు వాటర్ లాగా పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుతూ దాంట్లో బెల్లం సిరప్ వేసేయాలి. ముందే వేసేస్తే పాలు విరిగిపోతాయి చివరలో వేసుకోవాలి. వేయించుకున్న కిస్ మిస్ వేసేయాలి. అంతే పాలతాళికలు రెడీ.

36
మోదకాలు
Image Credit : amma chethi vanta/youtube

మోదకాలు

ముందుగా కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి...అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇప్పుడు అందులోనే కప్పు సుజి రవ్వ వేసి దోరగా వేయించాలి. పక్కన మరో గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. రవ్వను లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించాలి. దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి. ఇప్పుడు మరిగిన నీళ్లను దీంట్లో పోసేయాలి. కుంకుమ పూవ్వు వేసి పెట్టుకున్న పావుకప్పు పాలు వేయాలి. దాంట్లోనే ముప్పావు కప్పు పంచదార, పావు కప్పు పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. చివరలో నెయ్యి వేసి పక్కన పెట్టేసుకోవాలి. మోదకాల బాక్స్ లో పెట్టి ఒత్తుకుంటే సరి. వేడి వేడి మోదకాలు రెడీ.

46
సేమ్యా కేసరి
Image Credit : amma chethi vanta/youtube

సేమ్యా కేసరి

పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకుని అందులోనే కాసింత నెయ్యి వేసి ఒక కప్పు సేమ్యా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఎంత వేయిస్తే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మరో పాన్ లో ముప్పావు కప్పు నీళ్లు పోసి కొంచెం కుంకుమ పూవు వేసి నీటిని మరగనివ్వాలి. దీంట్లో వేయించిన సేమ్యా వేసుకుని ఉడకపెట్టాలి. ఉడికాక ముప్పావు కప్పు పంచదార వేసుకుని పాకం వచ్చే వరకూ కలపాలి. దాంట్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిటికెడు ఇలాచీ వేసి కలిపి దించేస్తే సరి.

56
శెనగల తాళింపు
Image Credit : amma chethi vanta/youtube

శెనగల తాళింపు

కప్పు కాబూలీ శెనగలు రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ లో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. దాంట్లో నీళ్లు పడేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి. తాలింపుని దోరుగా వేగాక ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని చీల్చుకొని వేసుకోండి, కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు ఉడికించిన శెనగలు వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు శనగలు బాగా టాస్ చేయండి. ఆ తర్వాతపావు టీ స్పూన్ దాకా ఇంగువ అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మరొక నిమిషం పాటు వేయించేసి దించేయండి.

66
పెసరపప్పు ఉండ్రాళ్లు
Image Credit : amma chethi vanta/youtube

పెసరపప్పు ఉండ్రాళ్లు

ముందుగా పావు కప్పు పెసరపప్పుని 15- 20 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పెసరపప్పును ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోయాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసి వేయించాలి. అందులోనే వడకట్టి పక్కన పెట్టిన పెసరప్పులోనించి ఒక టేబుల్ స్పూన్ తీసి కొబ్బరితో కలిపి వేయించాలి. దీంట్లో పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు నీళ్లు పోయాలి.బాగా తెర్ల కాగాక ముప్పావు కప్పు పొడి బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేయాలని. చల్లారాక మెత్తగా కలుపుకుని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి 10 నిమిషాలు ఆవిరి పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టి దాంట్లో నెయ్యి గానీ, నూనె గానీ వేసి తాళింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నాలుగైదు పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు దీంట్లో ఉండ్రాళ్లు వేసి కలుపుకోవాలి. అంతే పెసరపప్పు ఉండ్రాళ్లు రెడీ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు
Recommended image2
Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Recommended image3
Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!
Related Stories
Recommended image1
Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది
Recommended image2
Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved