MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టకూడదంటే..!

ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టకూడదంటే..!

శరీర వేడి, పొడి, తేమ వాతావరణం, విపరీతమైన ఎండల వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. కానీ దీనివల్ల శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2023, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
summer sweat

summer sweat

సమ్మర్ సీజన్ లో రుచికరమైన ఐస్ క్రీం, కుల్ఫీ, చల్లని సమ్మర్ ఫ్రూట్స్ ను  బాగా తినొచ్చు. కానీ ఈ సీజన్ లో చెమట ఎక్కువగా పడుతుంది. చెమటతో చొక్కాలు తడిసిపోయే వారు కూడా ఉన్నారు. కానీ చెమట ఎక్కువగా  పడితే శరీరం నుంచి చెడు వాసన వస్తుంది. అంతేకాదు చెమట మరకలు కూడా బట్టలపై స్పష్టంగా కనిపిస్తాయి. చెమట ఎక్కువగా పట్టేవారు రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. అలాగే తరచుగా యాంటిపెర్స్పిరెంట్ ను వాడాలి. అయితే మనం తినే కొన్ని ఆహారాలు కూడా చెమట ఎక్కువగా పట్టేలా చేస్తాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో అధిక చెమటను నివారించొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమ్మర్ డ్రింక్స్

మీ శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేయడానికి ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడూ నీళ్లే కాకుండా.. సత్తు, మజ్జిగ, జల్జీరా వంటి సమ్మర్ దేశీ కూల్ డ్రింక్స్ ను తాగండి. ఇవి మీ  శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచుతాయి. డీహైడ్రేషన్ ను నివారిస్తాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

36

కెఫిన్ మానుకోండి

చాలా మంది ఉదయం లేవగానే బెడ్ కాఫీని తాగుతుంటారు. కానీ కాఫీని ఎక్కువగా తాగడం మంచిది కాదు. దీనివల్ల బాడీ టెంపరేచర్ బాగా పెరుగుతుంది. కెఫిన్ అడ్రినల్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో మన అరచేతులు, పాదాలు, అండర్ ఆర్మ్స్ లో ఎక్కువ చెమట పడుతుంది. అందుకే కాఫీని మోతాదులోనే తాగండి. 

46
spicy food

spicy food

స్పైసీ ఫుడ్ మానేయండి

స్పైసీ ఫుడ్ కూడా చెమట ఎక్కువ పట్టేలా చేస్తుంది. చాలా మంది కూరల్లో ఎక్కువ కారం, పచ్చిమిరపకాయలను వేస్తుంటారు. మీరు గమనించారో లేదో.. కారంగా ఉన్న ఆహారాన్ని తిన్న తర్వాత చెమట పక్కాగా పడుతుంది. ఎందుకంటే మీ శరీరం వేడికి స్పందిస్తుంది.

56

యాంటిపెర్స్పిరెంట్స్ స్ప్రే ఉపయోగించండి

యాంటీపెర్స్పిరెంట్స్ చెమటను తగ్గించడానికి తయారుచేయబడ్డాయి. అందుకే చెడు చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటే వీటిని ఖచ్చితంగా ఉపయోగించండి. ఇవి మీ నుంచి చెడు వాసన రాకుండా చూస్తాయి. 
 

66

ప్రశాంతంగా ఉండండి

మీరు భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరంలోని చెమట గ్రంథులు సక్రియం అవుతాయి. దీనివల్ల మీకు చెమట ఎక్కువగా పడుతుంది. అధిక చెమటను నివారించడానికి మీరు ప్రశాంతంగా ఉండండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved