MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది

Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది

Motivational Story: మన మనసులో నెగిటివ్ ఆలోచనలే నిజమైన శత్రువు. చిన్న భయం కూడా మిమ్మల్ని అంధకారంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. మీ ఆలోచన మొత్తాన్ని మార్చే కథ ఇది, ఒక్కసారైన చదవాల్సిందే..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 15 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అద్దాల మేడలో అమాయకపు కుక్క..
Image Credit : gemini ai

అద్దాల మేడలో అమాయకపు కుక్క..

అదొక అద్భుతమైన అద్దాల మేడ. ఆ భవనం లోపలికి వెళ్తే చుట్టూ, పైనా, కిందా వందలాది అద్దాలు అమర్చి ఉంటాయి. ఆ భవనానికి ఒక కాపలావాడు ఉండేవాడు. ఒక రోజు రాత్రి అతను పొరపాటున వెనుక వైపు ఉన్న తలుపు మూయడం మర్చిపోయాడు.

అదే సమయంలో, బాగా ఆకలిగా ఉన్న ఒక కుక్క ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ అద్దాల మేడలోని గదిలోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్లగానే దానికి చుట్టూ వందలాది కుక్కలు కనిపిస్తాయి. అయితే, అద్దాల్లో కనిపిస్తున్నది తన సొంత ప్రతిబింబాలే అనే నిజం ఆ కుక్కకు తెలియదు. చుట్టూ ఉన్న కుక్కలన్నీ తనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని భావించి, భయంతో బిగ్గరగా అరిచింది!

చిత్రమేమిటంటే... అద్దాల్లోని ప్రతిబింబాలు కూడా నోరు తెరిచి దాన్ని చూసి అరిచినట్లే కనిపించాయి. దాంతో ఆ కుక్క మరింత భయపడి, కోపంతో, ఆవేశంతో వాటిపైకి దూకుతూ అరుస్తూనే ఉంది. రాత్రంతా విశ్రాంతి లేకుండా, అద్దాల్లోని తన ప్రతిబింబాలతోనే యుద్దం చేస్తూ... అరుస్తూనే ఉంది.

మరుసటి రోజు ఉదయం కాపలావాడు వచ్చి చూసి, " అయ్యో! తలుపు వేయడం మర్చిపోయానే" అనుకుంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం గుండెలను పిండేసింది. ఆ కుక్క అలిసిపోయి, భయంతో, గుండె ఆగి చనిపోయి పడి ఉంది.

కుక్కను చంపింది ఎవరు?

ఆ గదిలో కుక్కను కరిచేందుకు ఏ రెండో కుక్క లేదు. దానికి హాని తలపెట్టడానికి అక్కడ ఏ శత్రువు లేడు. కానీ ఆ కుక్క చనిపోయింది. ఆ కుక్కను చంపింది బయట ఉన్న కుక్కలు కావు... దాని సొంత థాట్ ప్రాసెస్. అనవసరమైన భయం. అద్దంలో ఉన్నది తన ప్రతిబింబమే అని గ్రహించలేక, దానికదే ఊహించుకుని, ప్రతికూలంగా ఆలోచించి, రాత్రంతా అనవసర పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు:
Image Credit : gemini ai

ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు:

మనుషులమైన మన జీవితాలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక పెద్ద 'అద్దాల మేడ' లాంటిది. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తే, ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే, వాటి గురించి మన మనస్సులో వేసుకునే ప్రతికూల అంచనాలు, భయాలే మనల్ని ఎక్కువ మానసిక వేదనకు గురిచేస్తాయి. ఒక చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ, రాత్రంతా నిద్రలేకుండా ఆలోచిస్తూ మన ప్రశాంతతను మనమే నాశనం చేసుకుంటాం.

మనం ఎదుటివారికి ప్రేమని ఇస్తే ప్రేమ, ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే తిరిగొస్తుంది. అద్దంలో ప్రతిబింబంలాగే... మన ప్రవర్తనే ఎదుటివారి నుంచి మనకు సమాధానంగా వస్తుంది. మనం భయపడి అరిస్తే, ఎదుటి ప్రపంచం కూడా మనల్ని బెదిరిస్తున్నట్లే అనిపిస్తుంది.

33
ఓవర్ థింకింగ్ అనే మాయ:
Image Credit : our own

ఓవర్ థింకింగ్ అనే మాయ:

చాలామంది లేని సమస్యలను ఊహించుకుని, "వారు నా గురించి ఏమనుకుంటున్నారో", "రేపు ఏమవుతుందో" అనే భయంతో రోజూ నరకం అనుభవిస్తారు. ఇది మనల్ని మానసికంగా, శారీరకంగా క్షీణింపజేసి క్రమంగా మనలోని జీవశక్తిని చంపేస్తుంది. ఒక్క క్షణం ఆగి, ప్రశాంతంగా ఆలోచిస్తే "ఇది నిజమైన సమస్యా? లేక నా మనస్సు ఆడుతున్న నాటకమా?" అనేది అర్థమవుతుంది. ఆ కుక్క ఒక్క క్షణం అరుపులాపి, ప్రశాంతంగా ఉండి ఉంటే అద్దంలోని కుక్కలు కూడా ప్రశాంతంగానే ఉండేవి. ప్రాణాలతో బతికి ఉండేది.

మీ మనస్సు ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మీకు అనుకూలమైన మిత్రుడిగా మార్చుకుంటారా, లేక మిమ్మల్ని నాశనం చేసే శత్రువుగా మార్చుకుంటారా అనేది మీ ఆలోచనా విధానం పైనే ఆధారపడి ఉంటుంది. బయటి ప్రపంచంతో పోరాడే ముందు, మీ మనస్సులోని భయాలతో, ప్రతికూల ఆలోచనలతో పోరాడటం ఆపండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Motivational Story: సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, కావాల్సింది ఇదే, ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది..!
Recommended image2
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved