MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?

PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?

PopCorn: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ పాప్ కార్న్ నచ్చుతుంది. ఈ పాప్ కార్న్ ఎలా తయారౌతుందో తెలుసా? మొక్క జొన్న గింజ వేడి చేయగానే నిమిషాల్లో పాప్ కార్న్ ఎలా తయారౌతుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 22 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పాప్ కార్న్ ఎలా తయారౌతుంది?
Image Credit : Getty

పాప్ కార్న్ ఎలా తయారౌతుంది?

సినిమా థియేటర్ లోకి అడుగుపెట్టగానే గుమగుమలాడే, కరకరలాడే పాప్ కార్న్ వాసన అందరికీ నచ్చుతుంది. సినిమా చూడాలన్నా, ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకోవాలన్నా పాప్ కార్న్ ఉండాల్సిందే. అయితే, మనం కాలక్షేపానికి తినే ఈ చిరు తిండి వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. అసలు పాప్ కార్న్ ఎలా పుట్టింది? ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది?

మొక్కజొన్న గింజ వేడి చేయగానే అంత పెద్ద తెల్లటి, దూది లాంటి పాప్ కార్న్ లా మారడం వెనక ఒక అద్భుతమైన పెద్ద కెమిస్ట్రీ దాగి ఉంది. సాధారణ మొక్క జొన్న గింజలతో పాప్ కార్న్ తయారు కాదు. దీనికి స్పెషల్ గా పాప్ కార్న్ జొన్నలు అనే ప్రత్యేక రకం గింజలను ఉపయోగిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాప్ కార్న్ తయారీ వెనక సీక్రెట్...
Image Credit : Getty

పాప్ కార్న్ తయారీ వెనక సీక్రెట్...

పాప్‌కార్న్ గింజలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి:

పెరికార్ప్: ఇది గింజ పైన ఉండే చాలా గట్టి రక్షణ పొర. ఇది లోపల ఉన్న గాలి, తేమ బయటకు పోకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది.

ఎండోస్పెర్మ్: గింజ లోపలి భాగం. ఇందులో గట్టిగా ఉండే పిండి పదార్థం ఉంటుంది.

తేమ/నీటి చుక్క: ప్రతి పాప్‌కార్న్ గింజ లోపల దాదాపు 14% నీరు దాగి ఉంటుంది.

33
వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది?
Image Credit : Getty

వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది?

గింజలను నూనెలో లేదా హాట్ ఎయిర్ లో పెట్టి వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు కాస్తా ఆవిరిగా మారడం ప్రారంభిస్తుంది. సాధారణంగా నీరు ఆవిరి అయి బయటకు వెళ్ళిపోవాలి, కానీ గింజ పైపొర చాలా గట్టిగా ఉండటం వల్ల ఆవిరి బయటకు రాలేకపోతుంది. దాంతో లోపల ఉష్ణోగ్రత, ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయి. ఈ తీవ్రమైన వేడికి లోపల ఉన్న గట్టి పిండి పదార్థం వేడి నీటి ఆవిరిలో కరిగి ఒక జెల్ లాగా మారుతుంది. లోపల ఉష్ణోగ్రత దాదాపు 180°Cకి చేరుకున్నప్పుడు, లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక.. గింజ పై పొర తట్టుకోలేక ఫట్ మని పగలిపోతుంది. గింజ పగిలిన మరుక్షణమే లోపల ఉన్న వేడి ఆవిరి ఒక్కసారిగా బయటకు వస్తుంది. దాంతోపాటే జెల్ లాగా మారిన పిండి పదార్థం బయటకు ఉబికి వస్తుంది. బయటి గాలి తగలగానే ఆ వేడి పిండి పదార్థం తక్షణమే గట్టిపడి మనకి కనిపించే తెల్లటి, మెత్తటి పాప్‌కార్న్ రూపంలోకి మారుతుంది.

పాప్ కార్న్ తయారౌతున్నప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది?

గింజ పగిలినప్పుడు లోపలి నీటి ఆవిరి ఒక్కసారిగా విడుదల కావడం వల్లనే ఆ 'పాప్' అనే శబ్దం వస్తుంది. ఒక్కోసారి కొన్ని గింజలు పేలవు. దీని వెనక కూడా కారణం ఉంది. కొన్ని గింజల పైపొరలో చిన్న రంధ్రాలు లేదా పగుళ్లు ఉంటే... వేడి చేసినప్పుడు నీటి ఆవిరి ముందుగానే బయటకు వెళ్లిపోతుంది. దాంతో లోపల ఒత్తిడి పెరగక అవి పేలకుండా అడుగున మిగిలిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Saree Store: ఈ షాప్ లో చీర కొనాలంటే..6గంటలు క్యూలో ఉండాల్సిందే, 10 నిమిషాల్లోనే చీర కొనాలి, ఎందుకు ఇన్ని రూల్స్?
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved