MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Protein Dosa: నార్మల్ కాదు.. ఈ ప్రోటీన్ దోశ ట్రై చేయండి.. అదిరిపోయే టేస్ట్, హెల్దీ కూడా..!

Protein Dosa: నార్మల్ కాదు.. ఈ ప్రోటీన్ దోశ ట్రై చేయండి.. అదిరిపోయే టేస్ట్, హెల్దీ కూడా..!

Protein Dosa: రెగ్యులర్ దోశలు తిని బోర్ అనిపించిందా? బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే.. టేస్టీ అండ్ హెల్దీ దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 21 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Dosa
Image Credit : Asianet News

Dosa

దోశ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎప్పుడూ ఒకేలాంటి దోశలు కాకుండా, ఈసారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 'హై-ప్రోటీన్ క్వినోవా-పన్నీర్ దోశ'ను ట్రై చేయండి. రుచితో పాటు శరీరానికి మంచి పోషకాలను అందించే ఈ దోశ, ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, టమోటా లేదా కొబ్బరి చట్నీతో తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ దోశను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం...

రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే నార్మల్ దోశలు వేయడం పెద్దగా కష్టం అనిపించదు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ, ఈ ప్రోటీన్ దోశ మాత్రం అంత ఈజీగా రాదు. అలా అని మరీ కష్టం అని అనుకోకండి. పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవడం, పెనం ఉష్ణోగ్రతను సరిగ్గా నిర్వహించడం ద్వారా క్రిస్పీగా వేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రోటీన్ దోశ తయారీ విధానం..
Image Credit : Asianet News

ప్రోటీన్ దోశ తయారీ విధానం..

దోశ పిండి కోసం:

క్వినోవా - 1/2 కప్పు

మిశ్రమ పప్పులు (పెసరపప్పు, మినపప్పు, పొట్టు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు) - 1 కప్పు

మెంతులు - 1 టేబుల్ స్పూన్

చట్నీ కోసం:

వెల్లుల్లి రెబ్బలు - 10-12

ఉల్లిపాయలు (పెద్దవి) - 3

టమోటాలు (పెద్దవి) - 4

ఎండుమిర్చి - 3-4

వేరుశనగలు (పల్లీలు) - 1/2 కప్పు

అల్లం - 2 అంగుళాల ముక్క

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - 2 టేబుల్ స్పూన్లు

తాలింపు గింజలు (పోపు దినుసులు)

దోశ తయారీకి:

నెయ్యి

తురిమిన పన్నీర్

మునగాకు పొడి

34
తయారీ విధానం:
Image Credit : Gemini

తయారీ విధానం:

1. పిండి తయారీ:

క్వినోవా, పప్పులు, మెంతులను ఒక గిన్నెలో వేసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.

బాగా నానిన తర్వాత నీటిని వంపేసి, అన్నీ కలిపి మెత్తని దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పిండిని రాత్రి అంతా లేదా 6 నుండి 7 గంటల పాటు పులియబెట్టాలి.

2. చట్నీ తయారీ:

పాన్‌ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పల్లీలను 2-4 నిమిషాలు వేయించాలి.

అందులో అల్లం, వెల్లుల్లి వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఆపై టమోటాలు వేసి కలిపి, మూత పెట్టి టమోటాలు మెత్తబడే వరకు 5-6 నిమిషాలు ఉడికించాలి.

స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లో వేసి తగినంత ఉప్పుతో పాటు మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. చివరగా పోపు (తాలింపు) పెట్టి చట్నీలో కలుపుకోవాలి.

3. దోశ తయారీ:

పులిసిన దోశ పిండిలో తగినంత ఉప్పు కలపాలి.

స్టవ్ వెలిగించి పెనం పెట్టి, కొద్దిగా నెయ్యి రాయాలి.

ఒక గరిటెడు పిండిని వేసి దోశలా పలుచగా రుద్దాలి.

దానిపై కొద్దిగా తురిమిన పన్నీర్, మునగాకు పొడి చల్లాలి. దోశ క్రిస్పీగా కాలిన తర్వాత మడతపెట్టి వేడి వేడిగా చట్నీతో వడ్డించాలి. ఈ దోశలో వాడే మునగాకు పొడి ప్రత్యేకమైన రుచిని ఇవ్వడంతో పాటు, అదనపు పోషకాలను అందిస్తుంది.

44
ఈ దోశతో ప్రయోజనాలు..
Image Credit : Shyam Rasoi

ఈ దోశతో ప్రయోజనాలు..

ఈ హై-ప్రోటీన్ క్వినోవా-పన్నీర్ దోశ తినడం ద్వారా శరీరానికి సరిపడా ప్రొటీన్లు, విటమిన్లు , శక్తి అన్నీ పుష్కలంగా లభిస్తాయి . ఇందులో ఉండే క్వినోవా, ఇతర పప్పులు రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే, పన్నీర్ ద్వారా కండరాల బలానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. చివరగా చల్లుకునే మునగాకు పొడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Fish vs Dry Mutton: ఎండు చేపలు, ఎండు మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఎవరు తినకూడదు?
Recommended image2
Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం
Recommended image3
Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?
Related Stories
Recommended image1
Hair Oil: కొబ్బరి నూనె Vs రోజ్ మేరీ ఆయిల్.. ఈ రెండింటిలో ఏ నూనె వాడితే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!
Recommended image2
Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved