MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: కూతురు ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే!

Parenting: కూతురు ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే!

Parenting: సాధారణంగా ఆడపిల్లలు తల్లితో అన్ని విషయాలు చెప్పుకుంటారు. కాస్త పెద్దయ్యే కొద్దీ కొందరు అమ్మాయిలు పేరెంట్స్ దగ్గర కొన్ని విషయాలు దాయడం మొదలుపెడతారు. మరి కూతురు ప్రతీ విషయం పేరెంట్స్ తో పంచుకోవాలంటే, పేరెంట్స్ చేయాల్సిన 5 పనులేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 21 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పేరెంటింగ్ టిప్స్
Image Credit : AI

పేరెంటింగ్ టిప్స్

సాధారణంగా కూతురు చిన్నగా ఉన్నప్పుడు తన రోజువారీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అమ్మతో చెప్తుంది. స్కూల్లో టీచర్ ఏమన్నారు, ఫ్రెండ్స్ ఏం చేశారు, తనకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు.. ఇలా చిన్న చిన్న విషయాలన్నీ తల్లితో పంచుకుంటుంది. కానీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలను తల్లిదండ్రులతో చెప్పడానికి పిల్లలు సంకోచిస్తారు. అయితే కూతురు పెద్దదవుతున్న కొద్దీ తల్లిదండ్రులకు దూరం కావాల్సిన అవసరం లేదు. ఆమె జీవితంలో ఏ విషయం జరిగినా ముందుగా మీతోనే చెప్పాలంటే, పేరెంట్స్ తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కూతురు చెప్పే విషయాన్ని పూర్తిగా వినడం
Image Credit : AI

కూతురు చెప్పే విషయాన్ని పూర్తిగా వినడం

పిల్లలు తమ సమస్యను చెప్పడం ప్రారంభించిన వెంటనే తల్లిదండ్రులు సలహాలు ఇవ్వడం, ప్రశ్నలు అడగడం లేదా తప్పు ఎవరిదో నిర్ణయించడం మొదలుపెడితే వారు మళ్లీ మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. కూతురు “ఈ రోజు నా ఫ్రెండ్‌తో గొడవైంది” అని చెప్పినప్పుడు, వెంటనే “నువ్వే ఏదో చేసి ఉంటావు” అని అనడం కంటే, ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడం మంచిది. పిల్లలు తమ మాటకు విలువ ఉందని భావించినప్పుడే తమ మనసులోని పెద్ద విషయాలను కూడా తల్లిదండ్రులతో పంచుకోవడం మొదలుపెడతారు.

36
వెంటనే తీర్పు ఇవ్వకపోవడం
Image Credit : AI

వెంటనే తీర్పు ఇవ్వకపోవడం

కూతురు తనకు జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు తల్లిదండ్రుల మొదటి స్పందన చాలా కీలకం. “అలా ఎందుకు చేశావు?”, “నీకు బుద్ధి లేదా?”, “నేను ముందే చెప్పాను కదా” వంటి మాటలు తరచుగా వినిపిస్తే, తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె ముందుగా తల్లిదండ్రుల దగ్గరకు రావడానికి భయపడవచ్చు. పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాళ్ల తప్పు ఉంటే ఎందుకు తప్పో వివరించాలి. ఒక తప్పును సరిదిద్దడం కంటే, ఆ తప్పు గురించి పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడే ధైర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

46
వ్యక్తిగత విషయాలను అందరి ముందు చెప్పకూడదు
Image Credit : Getty

వ్యక్తిగత విషయాలను అందరి ముందు చెప్పకూడదు

పిల్లలు తల్లిదండ్రులతో ఒక విషయం పంచుకున్నప్పుడు, అది తమ మధ్యే ఉంటుందని నమ్మకం ఉండాలి. కూతురు తన స్నేహితురాలి గురించి, స్కూల్లో జరిగిన విషయం గురించి లేదా తనకు ఎదురైన వ్యక్తిగత సమస్య గురించి చెప్పినప్పుడు, దాన్ని బంధువుల ముందు లేదా ఇతరుల దగ్గర సరదాగా చెప్పడం కూడా ఆమె నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. “మా అమ్మ అందరికీ చెప్పేస్తుంది” అనే భావన ఒక్కసారి ఏర్పడితే, ఆమె తర్వాత చాలా విషయాలను దాచే అవకాశం ఉంది.

56
టైం కేటాయించి మాట్లాడటం
Image Credit : stockPhoto

టైం కేటాయించి మాట్లాడటం

పిల్లలతో మాట్లాడటానికి ఎప్పుడూ పెద్ద సమయం అవసరం లేదు. రోజులో కొన్ని నిమిషాలు కూడా సరిపోతాయి. కలిసి భోజనం చేయడం, వాకింగ్‌కు వెళ్లడం, ఇంటి పనులు చేస్తూ మాట్లాడటం లేదా రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాలు మాట్లాడటం వంటి చిన్న సందర్భాలు మంచి అవకాశాలుగా మారవచ్చు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల ఫోన్ పక్కన పెట్టి, పిల్లవైపు పూర్తిగా దృష్టి పెట్టడం ముఖ్యం. ఈ రోజు ఏం జరిగింది అని ప్రతిరోజూ ప్రేమగా అడిగే అలవాటు ఉంటే పిల్లలు క్రమంగా తమ విషయాలను పంచుకోవడం మొదలుపెడతారు.

66
సమస్యల్లో అండగా నిలవడం
Image Credit : Getty

సమస్యల్లో అండగా నిలవడం

కూతురు ఏదైనా సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆమెకు మొదట కావాల్సింది మీరు తన పక్కన ఉన్నారనే నమ్మకం. సమస్యను పరిష్కరించేటప్పుడు తప్పు ఎవరిదో తెలుసుకోవడం కంటే, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా స్పందించాలో ఆమెతో కలిసి ఆలోచించడం మంచిది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులతో పిల్లలు ప్రతి విషయాన్ని పేరెంట్స్ తో పంచుకునేలా చేసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం
Recommended image2
Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?
Recommended image3
Mangalsutras: రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు
Related Stories
Recommended image1
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image2
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved