MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్

బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్

అన్నం, పులావ్ లేదా బిర్యానీ వండాక ఉప్పు తగ్గితే చాలా కంగారుగా అనిపిస్తుంది. ఉప్పు చల్లి కలిపితే అన్నమంతా ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఒక్క నిమిషంలో ఉప్పును సరిచేసే ఈ సింపుల్ కిచెన్ ట్రిక్ ట్రై చేయండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 21 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వండేసిన బిర్యానీ, పులావులలో ఉప్పు తగ్గితే..
Image Credit : AI Image

వండేసిన బిర్యానీ, పులావులలో ఉప్పు తగ్గితే..

వండేశాక బిర్యానీ, పులావులలో అప్పుడప్పుడు ఉప్పు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. తిరిగి అందులో వేసి ఉప్పు కలిపితే అన్నమంతా ముద్దవుతుందేమోనని చాలా మంది భయం. అన్నం ముద్ద కాకుండా కేవలం ఒక్క నిమిషంలో ఉప్పును సరిచేసే సూపర్ కిచెన్ మ్యాజిక్ ట్రిక్ ఇదిగో మీ కోసం.

వండిన అన్నంలో ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే వేడి అన్నం మీద పొడి ఉప్పును ఎప్పుడూ నేరుగా చల్లకండి. అలా చేస్తే ఉప్పు కరగకుండా గడ్డలుగా ఉండిపోతుంది. తినేటప్పుడు పంటి కింద పడి అన్నం రుచి మొత్తం పాడవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గోరువెచ్చని నీటి మ్యాజిక్
Image Credit : AI Image

గోరువెచ్చని నీటి మ్యాజిక్

ఒక చిన్న గిన్నెలో రెండు లేదా మూడు చెంచాల గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో మీకు సరిపడా ఉప్పు వేసి, చెంచాతో బాగా కలిపి పూర్తిగా కరిగేలా చేయండి. కరిగించిన ఈ ఉప్పు నీటిని అన్నం మీద అన్ని వైపులా సమానంగా చల్లండి. ఆ తర్వాత గరిటె వెనుక భాగంతో అన్నం మెతుకులు విరగకుండా చాలా నెమ్మదిగా, సున్నితంగా కలపండి. ఇలా చేయడం వల్ల ఉప్పు ఒకేచోట ఎక్కువ పడదు. మెల్లగా కలిపితే అన్నం కూడా ముద్దవ్వదు.

33
రుచి కూడా
Image Credit : AI Image

రుచి కూడా

ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే బిర్యానీలో ఉప్పు తగ్గినా వెంటనే ఫిక్స్ చేయచ్చు. పొడి ఉప్పు కన్నా కూడా నీటిలో కరిగిన ఉప్పు అన్నంలో చక్కగా ఇముడుతుంది. ప్రతి మెతుకుకూ ఉప్పు సమానంగా పట్టి, హోటల్ స్టైల్‌లో పర్ఫెక్ట్ రుచి మీ సొంతం అవుతుంది!

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!
Recommended image2
Rice: వైట్ రైస్ కాదు.. రెడ్ రైస్ , బ్లాక్ రైస్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది?
Recommended image3
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Related Stories
Recommended image1
HandBag: రోడ్డు పక్కన దొరికే రూ.500 హ్యాండ్ బ్యాగ్‌ను 8 లక్షల రూాపాయలకు అమ్మేశారు
Recommended image2
Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved