Vastu: ఎప్పుడుపడితే అప్పుడు దుస్తులు ఉతికితే కష్టాలు మీ వెంటే.. ఈ తప్పులు చేయకండి
Vastu: వాస్తు నిపుణుల ప్రకారం దుస్తులు ఎప్పుడు పడితే అప్పుడు ఉతికితే కష్టాలు వస్తాయి. ఏ సమయంలో దుస్తులు ఉతకాలి? ఏ సమయంలో ఉతకకూడదో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.

ఎప్పుడు ఉతకాలి?
ఇప్పుడు అందరూ జీవితంలో బిజీ అయిపోయారు. చాలామంది సమయం దొరికినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దుస్తులు ఉతికేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేసే పనులు మన ఇంటి శక్తిని, వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు దుస్తులు ఉతకకూడదు. సూర్యోదయం తర్వాత ఉదయం సమయం అంతా సానుకూల శక్తితో (పాజిటివ్ ఎనర్జీ) నిండి ఉంటుంది. అందువల్ల ఉదయం పూట బట్టలు ఉతకడం ఎంతో మంచిది. దీనివల్ల వాస్తు పరంగా శుభం కలగడమే కాకుండా, ఉదయం ఉతికిన బట్టలకు రోజంతా మంచి ఎండ, స్వచ్ఛమైన గాలి తగులుతాయి. ఫలితంగా బట్టలు త్వరగా ఆరిపోవడంతో పాటు వాటిలోని క్రిములు నశిస్తాయి. ఉదయం సమయం కుదరని ఉద్యోగులు కనీసం ఎండ తీవ్రత ఉండే మధ్యాహ్న సమయాన్ని ఎంచుకోవడం మంచిది.
ఎప్పుడు ఉతకకూడదు?
వాస్తు నిబంధనల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం ఏమాత్రం మంచిది కాదు. సాయంత్రం దాటిన తర్వాత ప్రకృతిలో సహజసిద్ధమైన సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తుల (నెగెటివ్ ఎనర్జీ) ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. ఆ సమయంలో ఉతికి ఆరబెట్టే దుస్తులు నెగెటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రహిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రిపూట ఎండ లేకపోవడం వల్ల బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. తడి బట్టల్లో తేమ ఎక్కువసేపు ఉండటం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తుంది. వాస్తు శాస్త్రంలో తేమ, మురికి, దుర్వాసనను దరిద్రానికి, ప్రతికూల ఫలితాలకు కారణాలుగా భావిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రాత్రిపూట బట్టలు ఆరకపోవడంతో చాలామంది వాటిని ఇంటి గదుల్లోనో లేదా ఫ్యాన్ కిందో ఆరబెడుతుంటారు. తడి బట్టలను చీకటి ప్రదేశాల్లో లేదా ఎక్కువ సమయం ఇంటి లోపల ఉంచడం వల్ల ఇళ్లంతా తేమ పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లోని పరిశుభ్రతే సానుకూల వాతావరణానికి మూలస్తంభం. కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు నిలవాలంటే వీలైనంత వరకు సూర్యోదయం తర్వాత మాత్రమే బట్టలు ఉతకాలి. సూర్యకాంతి సమృద్ధిగా ఉన్నప్పుడే వాటిని ఆరుబయట ఆరబెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ దూరమై, లక్ష్మీదేవి కటాక్షం నిలుస్తుంది.

