MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Fashion Tips: ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణానికి ఏ బట్టలు వేసుకోవాలి? ఉక్కపోత తగ్గించే బెస్ట్ ఫ్యాబ్రిక్స్

Fashion Tips: ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణానికి ఏ బట్టలు వేసుకోవాలి? ఉక్కపోత తగ్గించే బెస్ట్ ఫ్యాబ్రిక్స్

Fashion Tips: ఇది వర్షాకాలమో, ఎండాకాలమో అర్థం కావడం లేదు. అటు వర్షాలు, ఇటు ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, తేమ కూడా పెరిగిపోతుంది. అందుకే ఈ సీజన్‌లో ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్‌ ముఖ్యం. తేలికైన, గాలి ఆడే ఫ్యాబ్రిక్స్‌ బెటర్.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 14 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాటన్ బెటర్
Image Credit : gemini ai

కాటన్ బెటర్

వర్షాకాలంలో కాటన్ దుస్తులు బెటర్. మెత్తగా ఉండే కాటన్ చర్మానికి ఇబ్బంది కలిగించకుండా గాలి ప్రసరణకు సహాయపడుతుంది. చెమట పీల్చుకోవడంతో పాటు తేమగా ఉండే వాతావరణంలో సౌకర్యంగా ఉంటుంది. రోజువారీ వినియోగానికి లైట్ వెయిట్ కాటన్ షర్ట్స్, కుర్తాలు, డ్రెస్‌లు, కో-ఆర్డ్ సెట్స్‌ వంటివి ఎంచుకోవచ్చు. మరీ మందంగా ఉండే కాటన్ వద్దు. అవి తేమను ఎక్కువగా పీల్చుకుని త్వరగా ఆరకపోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చాంబ్రే
Image Credit : gemini ai

చాంబ్రే

డెనిమ్ లుక్ నచ్చేవారికి చాంబ్రే కూడా ఉపయోగకరమైన ఆప్షన్. ఇది చూడటానికి డెనిమ్‌లా కనిపించినప్పటికీ దానికంటే చాలా తేలికగా, గాలి ఆడేలా ఉంటుంది. చాంబ్రే షర్ట్స్, డ్రెస్‌లు క్యాజువల్ లుక్‌కు బాగా సరిపోతాయి. ముఖ్యంగా వర్షంలో తడిసినప్పుడు సాధారణ డెనిమ్‌లా బరువుగా మారే సమస్య ఇందులో తక్కువగా ఉంటుంది.

ఎథ్నిక్ వేర్ ఇష్టపడేవారికి కాటన్-రేయాన్ బ్లెండ్ దుస్తులు మంచి ఎంపిక. రేయాన్ వల్ల దుస్తులకు మంచి ఫ్లో, డ్రేప్ వస్తే.. కాటన్ వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. లైట్ వెయిట్ కుర్తీలు, పాలాజోలు, చీరలు వంటి వాటిని ఈ సీజన్‌లో ధరించవచ్చు.ఇవి ఇతర హెవీ ఫ్యాబ్రిక్స్‌తో పోలిస్తే అంత బరువుగా అనిపించవు.

34
ముల్ముల్
Image Credit : gemini ai

ముల్ముల్

ఇక వర్షాకాలంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన మరో ఫ్యాబ్రిక్ ముల్ముల్. ఇది చాలా సన్నగా, మెత్తగా ఉండే ఒక రకం కాటన్. చర్మానికి చాలా సాఫ్ట్‌గా అనిపించడంతో పాటు గాలి బాగా ప్రసరించేందుకు వీలు కల్పిస్తుంది. అందుకే ఉక్కపోత, తేమ ఎక్కువగా ఉండే రోజుల్లో ముల్ముల్ దుస్తులు సౌకర్యంగా ఉంటాయి. ముల్ముల్‌ కుర్తాలు, చీరలు, దుపట్టాలు వేసుకుంటే తేలికైన ఫీల్‌తో పాటు ఎథ్నిక్ లుక్ కూడా వస్తుంది.

44
లినెన్
Image Credit : gemini ai

లినెన్

వర్షాకాలంలో లినెన్ కూడా మరో మంచి ఆప్షన్. తేలికగా ఉంటుంది. గాలి పాస్ అవుతుంది. లినెన్ షర్ట్స్, ట్రౌజర్స్, డ్రెస్‌లు వంటివి ఆఫీస్‌కు వెళ్లేవారికి, ఎక్కువసేపు బయట ఉండేవారికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా లినెన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్స్ ముడతలు తక్కువగా పడటంతో పాటు త్వరగా ఆరే అవకాశం ఉండటంతో వర్షాకాలంలో మరింత ప్రాక్టికల్‌గా ఉంటాయి. వీటితో ఫార్మల్, కార్పొరేట్ లుక్ కూడా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు.

మొత్తంగా వర్షాకాలంలో ఫ్యాషన్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే వర్షం, ఉక్కపోత మధ్య కూడా స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ముఖ్యంగా త్వరగా ఆరే, గాలి ప్రసరణకు సహాయపడే, శరీరానికి అతుక్కుపోని లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఈ సీజన్‌లో మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!
Recommended image2
Diya Hacks: కొత్త ప్రమిదల్లో వెంటనే దీపం వెలిగించొద్దు..ఎందుకో తెలుసా?
Recommended image3
Sleeping With Light: రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved