Telugu

ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!

Telugu

కలాడియం

కలాడియం మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ దీని ఆకుల్లో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి పొరపాటున కడుపులోకి వెళ్తే ఆరోగ్యానికి చాలా హానికరం.

Image credits: Getty
Telugu

కాక్టస్

కాక్టస్ మొక్క సులభంగా పెరుగుతుంది. కానీ దీనికున్న పదునైన ముళ్లు ప్రమాదాలకు కారణమవుతాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Getty
Telugu

ఇంగ్లీష్ ఐవీ

ఇంగ్లీష్ ఐవీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ దీన్ని ఇంట్లో పెంచకూడదు. ఇందులో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనుషులకు, పెంపుడు జంతువులకు హాని చేస్తుంది.

Image credits: Getty
Telugu

డంబ్ కేన్

ఈ మొక్క పెద్ద పెద్ద ఆకులతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని ఆకుల్లో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి కడుపులోకి వెళ్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Image credits: Getty
Telugu

వాడిపోయిన మొక్కలు

ఎండిపోయిన, పాడైపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లోకి పురుగులు చేరతాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Image credits: Getty
Telugu

లిల్లీ

లిల్లీ పువ్వులు మంచి సువాసనతో, అందంగా ఉంటాయి. కానీ వీటిని పొరపాటున తింటే మనుషులకు, జంతువులకు హాని కలుగుతుంది.

Image credits: Getty

Diya Hacks: కొత్త ప్రమిదల్లో వెంటనే దీపం వెలిగించొద్దు..ఎందుకో తెలుసా?

Gold Bangles: డైలీవేర్ కి అదిరిపోయే బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!

Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు

Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి