MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..

Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..

Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ లో మటనో, చికెనో, చేపలో ఉండాల్సిందే. అయితే ఈసారి ఆదివారం లంచ్‌లోకి మటన్‌తో పులావ్ చేసేయండి. ఎప్పుడూ చేసే బాస్మతీ రైస్ తో కాకుండా చిట్టి ముత్యాలతో చేస్తే ఇంకా అదిరిపోద్ది. రెసిపీ చూసేద్దామా.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 12 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కావాల్సిన పదార్థాలు
Image Credit : vismai food/youtube

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు మటన్ ఉడికించడానికి చిట్టి ముత్యాలు బియ్యం – 2 కప్పులు (గంటసేపు నానబెట్టాలి), ఫ్రెష్ కొబ్బరి మసాలా పేస్ట్, తాజా గరం మసాలా పొడి.

ముందుగా మసాలాలు సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి – ⅓ కప్పు, గసగసాలు – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2–3 మిక్సర్ లో వేసి కొబ్బరి పేస్టు చేసుకోవాలి. మరో మిక్సర్ లో దాల్చిన చెక్క – 2½ అంగుళాలు, యాలకులు – 6–7, లవంగాలు – 7–8, మరాఠీ మొగ్గ – 1, స్టార్ అనీస్ – 1, మరాఠీ మొగ్గ – 1 వేసి మసాలా పొడి రెడీ చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మటన్ ఉడకబెట్టుకోవాలి
Image Credit : vismai food/youtube

మటన్ ఉడకబెట్టుకోవాలి

ఇప్పుడు అరకిలో మటన్‌ను శుభ్రంగా కడిగి దాంట్లో పచ్చిమిర్చి 2–3, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – 2 కప్పులు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకూ 80 శాతం ఉడికించాలి. ఉడికాక తీసుకుని మటన్ స్టాక్ సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

35
అడుగంటకుండా కలపాలి
Image Credit : vismai food/youtube

అడుగంటకుండా కలపాలి

ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి.దాంట్లోనే 2 టమాటాల ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి అల్రెడీ చేసి పెట్టుకున్న మసలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి మాడనివ్వకూడదు.కాస్త మగ్గాక...ఇప్పుడు కొబ్బరి పేస్టు వేసుకోవాలి. దీంట్లో నూనె పైకి తేలే వరకూ కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటి పోతుంది.

45
దీనికి మటన్ స్టాక్ అదనపు రుచి ఇస్తుంది
Image Credit : vismai food/youtube

దీనికి మటన్ స్టాక్ అదనపు రుచి ఇస్తుంది

ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసి కలపాలి. దాంట్లో చిట్టి ముత్యాల రైస్ వేసుకోవాలి. బియ్యంలో తడి ఆరే వరకు ఉంచి దాంట్లో మిగిలిన మటన్ స్టాక్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి...రెండు కప్పుల బియ్యానికి ఎప్పటిలానే 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మటన్ స్టాక్ కప్పు మిగిలితే..మూడు కప్పుల మామూలు నీళ్లు పోసుకోండి. అందులో కాస్త మళ్లీ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకుని ఉడుకు పడుతున్న టైంలో కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ వస్తే సరి. స్టీం పోయేంతవరకూ ఉంచి మూత తీయండి. నెమ్మదిగా కలిపి కరిగించిన నెయ్యి పోయండి. అంతే...వేడి వేడి చిట్టి ముత్యాల మటన్ పలావ్ రెడీ.

55
రెస్టారెంట్ స్టైల్ మటన్ పులావ్
Image Credit : vismai food/youtube

రెస్టారెంట్ స్టైల్ మటన్ పులావ్

ఆదివారం లంచ్, గెట్‌టుగెదర్, పార్టీలు ఏదైనా స్పెషల్ డేకి చిట్టి ముత్యాలు మటన్ పులావ్ మంచి ఆప్షన్. ఒకసారి ఈ విధంగా చేసి చూస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మటన్ పులావ్ రుచి టేస్ట్ చేయొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు
Related Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved