MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Garlic Naan Recipe: మెత్తగా, బటర్ ఫ్లేవర్‌తో గార్లిక్ నాన్..నోట్లో వేసుకోగానే దూదిలా కరిగిపోతుంది

Garlic Naan Recipe: మెత్తగా, బటర్ ఫ్లేవర్‌తో గార్లిక్ నాన్..నోట్లో వేసుకోగానే దూదిలా కరిగిపోతుంది

Garlic Naan Recipe: రెస్టారెంట్‌లో వెజ్ లో బాగా ఇష్టపడే ఫుడ్..గార్లిక్ నాన్‌. బయట దొరికే నాన్ మెత్తగా, లోపల సాఫ్ట్‌గా ఉండి పైన గార్లిక్, బటర్ ఫ్లేవర్ అదిరిపోతుంది. అయితే ఇంట్లోనూ అదే రుచితో మెత్తగా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 17 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిండిని మెత్తగా కలపాలి
Image Credit : instagram

పిండిని మెత్తగా కలపాలి

ముందుగా మైదా, పెరుగు, ఉప్పు, కొద్దిగా నూనెతో పిండిని సిద్ధం చేసుకోవాలి. కావాలనుకుంటే ఈస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు. పిండిని బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలపాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. కొద్దిగా సాఫ్ట్‌గా, స్వల్పంగా స్టిక్కీగా ఉంటే నాన్ మెత్తగా వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గార్లిక్ బటర్ ముందే సిద్ధం చేసుకోవాలి
Image Credit : Pixabay

గార్లిక్ బటర్ ముందే సిద్ధం చేసుకోవాలి

ఇక గార్లిక్ బటర్ కోసం కొద్దిగా బటర్‌ను కరిగించి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర కలపాలి. తాజా వెల్లుల్లిని ఉపయోగిస్తే నాన్‌కు మంచి సువాసన, రుచి వస్తుంది. ఈ గార్లిక్ బటర్‌ను నాన్ కాల్చిన వెంటనే పైన రాయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.

36
పిండికి రెస్ట్ ఇవ్వాలి
Image Credit : gemini

పిండికి రెస్ట్ ఇవ్వాలి

పిండి కలిపిన వెంటనే నాన్ చేయకూడదు. కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు పిండిని మూతపెట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి తేలికగా, సాఫ్ట్‌గా మారుతుంది. నాన్‌ను రోల్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాదు.. నాన్ లోపల మెత్తగా, బయట మంచి టెక్స్చర్‌తో రావడానికి ఈ రెస్టింగ్ టైమ్ చాలా ఉపయోగపడుతుంది.

46
నాన్‌ను సరైన ఆకారంలో రోల్ చేయాలి
Image Credit : instagram

నాన్‌ను సరైన ఆకారంలో రోల్ చేయాలి

రెస్టింగ్ పూర్తయిన పిండిని చిన్న భాగాలుగా తీసుకుని ఓవల్ ఆకారంలో రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వైపు సన్నగా తరిగిన లేదా మెత్తగా చేసిన వెల్లుల్లిని చల్లి, చేతితో కొద్దిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి నాన్‌కు బాగా అతుక్కుంటుంది. మరీ పలుచగా రోల్ చేయకుండా కొద్దిగా మందంగా ఉంచితే నాన్ సాఫ్ట్‌గా ఉంటుంది.

56
వేడిగా ఉన్న తవాపై కాల్చాలి
Image Credit : AI Image

వేడిగా ఉన్న తవాపై కాల్చాలి

తవాను ముందుగానే బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత నాన్‌ను తవాపై వేసి ఒక వైపు ఉడికించాలి. తర్వాత తిప్పి మరోవైపు కూడా కాల్చాలి. నాన్‌పై బంగారు రంగులో మచ్చలు కనిపిస్తూ, కొద్దిగా చారింగ్ వస్తే మంచి రుచి వస్తుంది. తందూర్‌లో కాల్చినట్లుగా కాలిన మచ్చలు రావడం వల్ల నాన్‌కు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది.

66
చివర్లో గార్లిక్ బటర్ రాయాలి
Image Credit : gemini ai

చివర్లో గార్లిక్ బటర్ రాయాలి

నాన్ తవా నుంచి తీసిన వెంటనే పైన సిద్ధం చేసుకున్న గార్లిక్ బటర్‌ను బాగా రాయాలి. నాన్ వేడిగా ఉన్నప్పుడే బటర్ రాస్తే అది లోపలికి బాగా ఇంకి మరింత రుచిగా మారుతుంది. వెల్లుల్లి, బటర్ సువాసనతో గార్లిక్ నాన్ మరింత టేస్టీగా ఉంటుంది.

ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే తవాపై మెత్తగా, రుచిగా ఉండే గార్లిక్ నాన్ తయారు చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ వంటి వాటితో వేడి వేడిగా సర్వ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్‌ను ఇంట్లోనే ఆస్వాదించొచ్చు

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image2
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Recommended image3
Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!
Related Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Switch Board Cleaning: స్విచ్ బోర్డ్ తళతళా మెరవాలంటే..ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved