MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి

Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి

Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు చెడిపోవని చెప్పి…రోజుల తరబడి తింటుంటారు. కొందరైతే పెరుగును ఫ్రిడ్జ్ లో పెట్టి అదే పనిగా వాడుతూ ఉంటారు. పెరుగు పాడైనా తెలియదు. కానీ ఆ పెరుగును ఎన్ని రోజుల వరకు తినొచ్చో తెలుసా? పెరుగు పాడైందని ఎలా గుర్తించాలి?

2 Min read
Author : Nandini Arava
Published : Sep 17 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా?
Image Credit : Gemini AI

ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా?

ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు చెడిపోవని చెప్పి…రోజుల తరబడి తింటుంటారు. కొందరైతే పెరుగును ఫ్రిడ్జ్ లో పెట్టి అదే పనిగా వాడుతూ ఉంటారు. పెరుగు పాడైనా తెలియదు. కానీ ఆ పెరుగును ఎన్ని రోజుల వరకు తినొచ్చో తెలుసా? పెరుగు పాడైందని ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం. ముందుగా

ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు?
ఎండాకాలమైనా, చలికాలమైనా మన ఇళ్లలో ఫ్రిజ్‌లో పెరుగు కచ్చితంగా ఉంటుంది. అన్నంలోకి, మజ్జిగ కోసం అని పెట్టిన పెరుగు కొన్నిసార్లు రోజుల తరబడి ఫ్రిజ్‌లోనే ఉండిపోతుంది. ఫ్రిజ్‌లో పెట్టాం కదా పాడవదులే అని చాలామంది ఎన్ని రోజులైనా దాన్ని తింటుంటారు. కానీ పెరుగును ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన ఎప్పటికీ తాజాగా ఉండదు. మరి పెరుగును ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు? పాడైన పెరుగును ఎలా గుర్తించాలి? ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?
Image Credit : stockPhoto

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?

ఇంట్లో తోడుపెట్టిన పెరుగును 2-4 రోజుల్లోపు వాడేయడం మంచిది. రోజులు గడిచేకొద్దీ పెరుగు బాగా పుల్లగా మారిపోయి, దాని రుచి, టెక్స్చర్ మారిపోతుంది. ఒకవేళ బయట కొన్న పెరుగు అయితే ప్యాకెట్ మీద ఉన్న 'Best Before'ను కచ్చితంగా చూడాలి. ప్యాకెట్ ఓపెన్ చేశాక దాన్ని ఎక్కువ రోజులు ఉంచకుండా వీలైనంత త్వరగా వాడేయాలి.

36
ఫ్రిజ్ డోర్‌లో పెరుగును అస్సలు పెట్టకండి
Image Credit : stockPhoto

ఫ్రిజ్ డోర్‌లో పెరుగును అస్సలు పెట్టకండి

చాలామంది పెరుగు గిన్నెను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పెడుతుంటారు. మనం ఫ్రిజ్ డోర్ పదే పదే తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. అందుకే పెరుగును ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లలో మాత్రమే పెట్టాలి. అక్కడ ఉష్ణోగ్రత 4°C లేదా అంతకంటే తక్కువగా స్థిరంగా ఉంటుంది. పెరుగును బయటకు తీసి ఎక్కువసేపు రూమ్ టెంపరేచర్‌లో ఉంచి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టే తప్పు అస్సలు చేయకండి.

46
స్పూన్ వాడేటప్పుడు చేసే ఈ తప్పుతో పెరుగు మొత్తం పాడవుతుంది!
Image Credit : stockPhoto

స్పూన్ వాడేటప్పుడు చేసే ఈ తప్పుతో పెరుగు మొత్తం పాడవుతుంది!

పెరుగు తీయడానికి ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉన్న స్పూన్‌ మాత్రమే వాడాలి. వేరే పదార్థాలు తిన్న లేదా తడిగా ఉన్న స్పూన్‌ను పెరుగులో అస్సలు పెట్టకండి. గిన్నెలోకి తీసుకున్న పెరుగు మిగిలిపోతే, దాన్ని తిరిగి మళ్లీ పెరుగు గిన్నెలోనే వేయడం వల్ల బయటి బ్యాక్టీరియా మొత్తం పెరుగు గిన్నెలోకి చేరి, కొద్ది గంటల్లోనే పెరుగు మొత్తం పాడవుతుంది.

56
పెరుగు మీద నీరు తేలితే అది పాడైనట్లా?
Image Credit : stockPhoto

పెరుగు మీద నీరు తేలితే అది పాడైనట్లా?

కాదు, పెరుగు మీద తేట నీరు (Whey water) నిలవడం చాలా సహజం. పెరుగు రంగు, వాసన బాగుంటే, ఆ నీటిని పెరుగుతో బాగా కలిపి వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు.

66
పెరుగును ఎప్పుడు పడేయాలి?
Image Credit : stockPhoto

పెరుగును ఎప్పుడు పడేయాలి?

పెరుగు మీద తెలుపు, ఆకుపచ్చ లేదా నలుపు రంగులో బూజు వస్తే వెంటనే పడేయండి. పసుపు రంగులోకి మారినా లేదా విపరీతమైన పులుపు, చెడు వాసన వస్తున్నా వాడకండి.పెరుగు జిగటగా లేదా అంటుకునేలా ఉంటే అది విషపూరితంగా మారిందని అర్థం. పాడైన పెరుగును టేస్ట్ చూసి చెక్ చేయకండి, దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Kitchen Hack: వంట చేసేటప్పుడు ఈ 10 తప్పులు చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి
Recommended image2
Kitchen Switch Board Cleaning: స్విచ్ బోర్డ్ తళతళా మెరవాలంటే..ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved