MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది

రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది

శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్తోంది. ఆరోజు ప్రత్యేకంగా కృష్ణుడిని పూజించడమే కాదు.. అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యం ప్రేమజంట రాధా కృష్ణుల అనుబంధం నుంచి ఇప్పటి జంటలు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 02 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాధా కృష్ణుల బంధం మధురం
Image Credit : Chat Gpt

రాధా-కృష్ణుల బంధం మధురం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా-కృష్ణుల బంధం ఎప్పుడూ చర్చలోకి వస్తుంది. రాధా-కృష్ణుల ప్రేమను కేవలం ప్రేమకథగా మాత్రమే చూడరు. నమ్మకం, గౌరవం, అవగాహన, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం వంటి విషయాలకు వీరి అనుబంధాన్నే ఉదాహరణగా చెబుతారు. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, అపార్థాలు పెరగడం, ఒకరిపై ఒకరికి అనుమానం రావడం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాధా-కృష్ణుల బంధం నుంచి కొన్ని మంచి విషయాలను నేటి జంటలు నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బంధం ఒకేలా ఉండదు. కానీ ప్రేమతో పాటు నమ్మకం, గౌరవం ఉంటే ఏ బంధమైనా మరింత బలపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నమ్మకం ఉంటే బంధానికి బలం
Image Credit : Dolls of India

నమ్మకం ఉంటే బంధానికి బలం

ఏ ప్రేమ బంధానికైనా నమ్మకమే చాలా ముఖ్యం. భాగస్వామిపై పదే పదే అనుమానం పెట్టడం, ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. ఏదైనా విషయం అనుమానంగా అనిపిస్తే మనసులో పెట్టుకుని బాధపడకుండా నేరుగా మాట్లాడటం మంచిది. అలాగే భాగస్వామి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ముందుగా వారి మాటను పూర్తిగా వినాలి. వెంటనే మనదే సరైన మాట అని చెప్పకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమలో గౌరవం కూడా చాలా అవసరం. భాగస్వామి అభిప్రాయాలు, ఇష్టాలు, నిర్ణయాలను గౌరవించాలి. కోపంలో మాట్లాడే మాటలు ఎదుటివారిని చాలా బాధపెట్టవచ్చు. అందుకే గొడవ వచ్చినప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది.

33
కష్టాల్లో తోడు.. ప్రేమలోస్వేచ్ఛ
Image Credit : goldgiftideas

కష్టాల్లో తోడు.. ప్రేమలోస్వేచ్ఛ

బంధం బలంగా ఉందో లేదో సంతోష సమయంలో కంటే కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. భాగస్వామి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎగతాళి చేయకుండా, ఒంటరిగా వదిలేయకుండా అండగా నిలవాలి. కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం చెప్పడం కంటే ఎదుటివారి మాటను ప్రశాంతంగా వినడమే వారికి ఎంతో ధైర్యం ఇస్తుంది. అదే సమయంలో ప్రేమ పేరుతో భాగస్వామిపై ఎక్కువ ఆంక్షలు పెట్టకూడదు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఇష్టాలు, స్నేహితులు, వ్యక్తిగత సమయం ఉంటాయి. కాబట్టి ఒకరికి ఒకరు కొంత స్పేస్ ఇవ్వాలి. ఎప్పుడూ ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించడం బంధంలో ఒత్తిడిని పెంచుతుంది. నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ, కష్టాల్లో తోడు ఉంటే బంధం మరింత అందంగా మారుతుంది. ఇదే రాధా-కృష్ణుల బంధం నుంచి నేటి జంటలు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా చెప్పవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Recommended image2
Egg Gravy: ఎగ్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్‌లో చిక్కగా రావాలంటే ఇలా వండండి.. రెసిపీ అదిరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved