MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Temple: ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని లోపలికి వెళతారు... ఎందుకు అనుమతి ఇస్తారో తెలుసా..?

Temple: ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని లోపలికి వెళతారు... ఎందుకు అనుమతి ఇస్తారో తెలుసా..?

Temple: గుడిని మనం చాలా పవిత్రమైన స్థలంగా పరిగణిస్తాం. అందుకే.. చెప్పులు బయటే వదిలేసి.. కాళ్లు శుభ్రం చేసుకొని మరీ.. గుడిలోకి వెళతాం. కానీ, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్లే ఆలయాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చెప్పులు అనుమతించే ఆలయాలు..
Image Credit : Geminiai

చెప్పులు అనుమతించే ఆలయాలు..

సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా.. కాళ్లకు ఉన్న చెప్పులను బయటే విడిచి పెట్టి, భక్తి శ్రద్ధలతో లోపలికి వెళతాం. ఇది మన ఆచారం. కానీ, మన దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో చెప్పులు వేసుకొని లోపలికి వెళతారని మీకు తెలుసా? వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజంగానే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. వేరే ఏ ఇతర ఆలయాల్లో లేని ఈ రూల్... ఈ టెంపుల్స్ లో మాత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కారణం ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దేవ్జీ మహారాజ్ ఆలయం..
Image Credit : Geminiai

దేవ్జీ మహారాజ్ ఆలయం..

ఈ దేవ్జీ మహారాజ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా, మాలాజ్ పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు చెప్పులు ధరించే.. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్లే భక్తులు.. పాదరక్షలను ధరించే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అయితే.. రోజువారీ సాధారణ పూజల సమయంలో చెప్పులు ధరించరు. కానీ, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరకు వెళ్లే వారు మాత్రం.. చెప్పులు ధరిస్తారు.

అసలు కారణం: స్థానిక నమ్మకాల ప్రకారం, దుష్టశక్తులు, చేతబడులు లేదా శారీరక/మానసిక సమస్యలతో బాధపడేవారు దేవ్జీ మహారాజ్‌ను దర్శించుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ పాదరక్షలతో నడవడం వల్ల తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం.

2. కాళీ మాత ఆలయం.. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ జిల్లా, భోపాల్‌పూర్ ప్రాంతంలో ఉన్న కాళీమాత దేవాలయం.భక్తులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీయకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు.

అసలు కారణం: ఈ ప్రాంతంలో అమ్మవారిని చాలా ఉగ్రరూపిణిగా, అలాగే భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా భావిస్తారు. భక్తులు ముళ్ల బాటలు, కఠినమైన దారుల్లో నడిచి వస్తారు కాబట్టి వాళ్లకు పాదరక్షల వల్ల ఎలాంటి హాని కలగకుండా, అమ్మవారే స్వయంగా చెప్పులతో రావడానికి అనుమతి ఇచ్చిందని ఇక్కడి స్థానిక జానపద కథనం చెబుతుంది.

33
జగన్నాథ స్వామి ఆలయం
Image Credit : Geminiai

జగన్నాథ స్వామి ఆలయం

ఒడిశాలోని పూరీ జగన్నాథుని ప్రధాన ఆలయంలోకి చెప్పులను అస్సలు అనుమతించరు. కానీ, ఆలయ వంటశాల (మహాప్రసాదం తయారీ ప్రాంతం), కొన్ని నిర్దిష్ట పూజా ప్రాంగణాల్లో సేవకులు/పూజారులు చెక్కతో చేసిన పాదరక్షలను ధరించడానికి అనుమతి ఉంటుంది.

సాధారణంగా ఆలయాల్లోకి చెప్పులు ఎందుకు అనుమతించరు..?

పరిశుభ్రత : బయట తిరిగిన మురికి, క్రిములు ఆలయ పవిత్ర ప్రాంగణంలోకి రాకుండా ఉండేందుకు.

ఎనర్జీ, వైబ్రేషన్స్: ఆలయాల్లో ఉండే రాతి నేలలు, మంత్రోచ్ఛారణల ద్వారా ఉత్పత్తయ్యే పాజిటివ్ ఎనర్జీ కాళ్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే చెప్పులు వేసుకోవద్దని చెబుతుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Half Sarees: పండగకి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే లంగావోణిలు.. చూస్తే ఫిదా!
Recommended image2
10 కి 3 కలిపితే పదమూడు, 10 కి 4 కలిపితే పద్నాలుగు.. మరి పదికి ఐదు కలిపితే పదిహేను ఎలా అయ్యింది?
Recommended image3
Fresh Mutton Vs Dry Mutton : తాజా మటన్, డ్రై మటన్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మంచిది?
Related Stories
Recommended image1
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Recommended image2
Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved