MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beard: ఈ నూనెలు రాస్తే...అబ్బాయిలకు గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.!

Beard: ఈ నూనెలు రాస్తే...అబ్బాయిలకు గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.!

Beard: ఒత్తుగా, నల్లగా గడ్డం ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అయితే.. ఇలా ఒత్తుగా పెరగాలని మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడే బదులు.. కొన్ని నూనెలు రాస్తే చాలు. ఆ నూనెలు రాస్తే గడ్డం ఒత్తుగా పెరగడం పక్కా.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 31 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Beard Growth
Image Credit : Getty

Beard Growth

అబ్బాయిలు అందరికీ.. ఒత్తుగా, అందంగా, రాయల్ లుక్ ఇచ్చే గడ్డం పెంచుకోవాలని ఉంటుంది. అయితే, చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. గడ్డం సరిగ్గా పెరగకపోవడం లేదా పలచగా ఉండటం. దీనికోసం మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఖరీదైన కేర్ ప్రోడక్ట్స్ వాడి నిరాశచెందుతుంటారు. కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీ ఇంట్లోనే లభించే కొన్ని అద్భుతమైన సహజ నూనెల సహాయంతో గడ్డం ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఇవి చర్మానికి మంచి పోషణను అందిస్తూ, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. గడ్డాన్ని వేగంగా, ఒత్తుగా పెంచడంలో అద్భుతంగా పనిచేసే ఆ నూనెలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆముదం (Castor Oil)
Image Credit : Getty

ఆముదం (Castor Oil)

ఆముదంలో 'రిసినోలిక్ యాసిడ్', ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలో రక్తప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. గడ్డం పలచగా ఉన్న చోట కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా దోహదపడుతుంది. రోజూ ఆముదాన్ని గడ్డానికి అప్లై చేయడం వల్ల.. గడ్డం ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

2. కొబ్బరి నూనె (Coconut Oil)

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, కావలసినంత తేమ ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం లోపలి పొరల్లోకి త్వరగా ఇంకిపోయి, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది గడ్డం కింద చర్మం పొడిబారకుండా చూస్తుంది, చుండ్రును నివారిస్తుంది. మంచిగా గడ్డం పెరగడానికి సహాయం చేస్తుంది.

34
జోజోబా నూనె (Jojoba Oil)
Image Credit : Generated by google gemini AI

జోజోబా నూనె (Jojoba Oil)

జోజోబా నూనెలో సెబమ్ ఉంటుంది. ఇది చర్మంపై అదనపు జిడ్డు లేకుండా తగినంత తేమను ఇస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తూ, గడ్డం వెంట్రుకలు మెత్తగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

4. బాదం నూనె..

ఇందులో విటమిన్ E, విటమిన్ A , సహజ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గడ్డం వెంట్రుకలకు మంచి పోషణను అందిస్తుంది. జుట్టు చిట్లిపోకుండా నివారించి, గడ్డానికి మంచి మెరుపును ఇస్తుంది.

44
రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్
Image Credit : Generated by google gemini AI

రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్

జుట్టు పెరుగుదలను ప్రేరేపించే సహజ సిద్ధమైన ఎసెన్షియల్ ఆయిల్ రోజ్ మేరీ. ఇది... కేవలం తలలో జుట్టు ఒత్తుగా పెరగడానికి మాత్రమే కాదు.. గడ్డం పెరగడానికి కూడా సహాయపడుతుంది.ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్తాన్ని బాగా సరఫరా చేసి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అయితే... ఈ రోజ్ మేరీ ఆయిల్ ని డైరెక్ట్ గా రాయకూడదు. కొబ్బరి నూనె లేదా జోజోబా నూనె వంటి ఆయిల్స్ లో కలిపి రాయాలి. అప్పుడు బాగా పని చేస్తుంది.

ఈ నూనెలను ఎలా వాడాలి అంటే...

మీకు నచ్చిన నూనెను కొద్దిగా చేతిలోకి తీసుకుని, గడ్డం కింద ఉన్న చర్మానికి , వెంట్రుకలకు బాగా పట్టించి 5-10 నిమిషాలు మెల్లగా మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!
Recommended image2
కొంతమంది అమ్మాయిలకు మీసాలు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా ఎలా తొలగించుకోవాలి?
Recommended image3
Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి
Related Stories
Recommended image1
Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు
Recommended image2
Idli Batter: ఇడ్లీ పిండి తొందరగా పులిసిపోతోందా? ఈ ఒక్క చిట్కాతో వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved