Adequate Sleep: తరచుగా ఇలా జరుగుతుందా? అయితే మీకు నిద్ర సరిపోవడం లేదన్నమాట
Adequate Sleep: కంటినిండా నిద్రలేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తెల్లవార్లూ నిద్రపోకపోతే.. అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు చిరాకు, కోపం, నీరసం, హై బీపీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మారుతున్న మన జీవన శైలే నిద్రలేమి సమస్యకు అసలు కారణం. ఇలాంటి సమయంలో మీకు నిద్ర సరిపోతుందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసా..

Adequate Sleep: ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికంతటికి అసలు కారణం మారుతున్న మన జీవనశైలీనే. కానీ ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా శరీరానికి సరిపడా నిద్ర ఎంతో అవసరం. మన జీవగడియారం సక్రమంగా పనిచేయడానికి కూడా కంటినిండా నిద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రలేకపోతే High blood pressure బారిన పడే ప్రమాదముంది. అంతేకాదు బీపీ పెరగడం, చిరాకు, నీరసం, కోపం వంటి సమస్యలు వస్తాయి.
రోజుకు మనిషికి ఖచ్చితంగా ఇన్ని గంటల నిద్ర అవసరం అనే విషయం ఖచ్చితంగా తెలియదు. కానీ ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి ఎంత నిద్ర అవసరం అనేది ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందులో పెద్దలకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మీకు రాత్రుళ్లు నిద్ర సరిపోతోందా? లేదా ? అనే విషయం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇతరులతో మాట్లాడుతూనే కునికి పాట్లు పడుతుంటారు. మరికొంతమంది టీవీ చూస్తుంటే కూడా కుర్పట్లు పడుతుంటారు. మరికొందరికేమో కారు నడుపుతుంటే కూడా నిద్ర మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయా.. అయితే డౌటే లేదు. మీకు రాత్రుళ్లు నిద్రసరిపోవడం లేదని అర్థం. ఎందుకంటే హుషారుగా, చురుకుగా ఉండాల్సిన డే టైం లో నిద్ర వస్తుంటే మీకు నిద్రసరిపోవడం లేదని అర్థం చేసుకోవాలి.
చాలా మంది సెలవు రోజు వచ్చిందంటే చాలు గంటలకు గంటలకు నిద్రపోతుంటారు. అది కూడా పగడి పూట. దీన్ని బట్టి మీకు ఇతర రోజుల్లో నిద్ర సరిపోవడం లేదని అర్థం. అందుకే ఆ ఇతర రోజుల్లో సరిపోని నిద్రను భర్తీ చేసుకోవడానికి సెలవు రోజు పగటిపూట పడుకోవడానికి మీ బాడీ ఇష్టపడుతుంటుంది.
చాలా మందికి అలారం సెట్ చేసుకుని పడుకోవడం అలవాటుంటుంది. దాని ప్రకారమే నిద్ర లేస్తుంటారు. అయితే కొన్ని సార్లు అలారం మోగినా మేల్కోరు. అందుకు కారణం మీకు నిద్రసరిపోకపోవడమే. కంటినిండా నిద్ర ఉంటే రోజూ లేచే టైం కే మెలుకువ వస్తుంది. ప్రతిరోజూ మేల్కోవాల్సిన సమయం దాటిపోయినా.. మెలుకువ రాలేదంటే మీరు రాత్రుళ్లు సరిగ్గా పడుకోవడం లేనట్టే.