ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా కలెక్షన్లు చూసి అక్కడే డిసైడ్ అయ్యారు..అలాంటి సినిమా వద్దని రిక్వస్ట్ చేయడంతో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కెరీర్ లో తొలి బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతోనే. కానీ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగేందుకు పునాది వేసిన చిత్రం మాత్రం ఆది. ఆది చిత్రం వెనుక చాలా పెద్ద కథ ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కెరీర్ లో తొలి బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతోనే. కానీ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగేందుకు పునాది వేసిన చిత్రం మాత్రం ఆది. ఆది చిత్రం వెనుక చాలా పెద్ద కథ ఉంది. స్టూడెంట్ నంబర్ 1 చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే ఆది మూవీ ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ తెలిపారు.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. వివి వినాయక్ దర్శకుడిగా ఇద్దరు హీరోల కథతో ఒక చిత్రం చేయాలనుకున్నాం. అప్పటికి వివి వినాయక్ కో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
Bellamkonda Suresh
ఒకసారి నేను బాపినీడు గారిని కలవడానికి ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. అప్పటికి ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని చిత్రం రిలీజై ఉంది. ఆ సినిమా ఫ్లాప్. అనుకోకుండా అక్కడ నిన్ను చూడాలని కలెక్షన్స్ గురించి చదివా. ఆ చిత్రం 80 లక్షలు వసూలు చేసినట్లు రాశారు. మనం 30 లక్షలు, 40 లక్షలు కలెక్షన్స్ రాబట్టడానికి చాలా తంటాలు పడుతున్నాం. ఇదేంటి ఈ చిత్రానికి 80 లక్షలు వచ్చాయి అని ఆశ్చర్యపోయా. వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు బెల్లంకొండ సురేష్ తెలిపారు.
వెంటనే వినాయక్ ని ఎన్టీఆర్ దగ్గరకి పంపించి కథ చెప్పించా. ఎన్టీఆర్ మా ఆఫీస్ కి వచ్చాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీతో సినిమా చేయాలని ఉంది. కానీ ఇద్దరు హీరోల కథ వద్దు. ఏదైనా యాక్షన్ స్టోరీ చేయాలని ఉందని ఎన్టీఆర్.. బెల్లంకొండ సురేష్ కి తెలిపారు. వెంటనే వివి వినాయక్ తో మాట్లాడి యాక్షన్ కథ రెడీ చేయించా. ఆ విధంగా ఆది చిత్రం మొదలైంది అని బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఆది చిత్రం ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది.