MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?

Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?

Ranabaali: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మూవీ `రణబాలి`. దీన్నుంచి మొదటి పాట ఏందయ్య సామీ విడుదలైంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 22 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రణబాలి నుంచి ఏందయ్య సామీ సాంగ్‌ ఔట్‌
Image Credit : Asianet News

రణబాలి నుంచి ఏందయ్య సామీ సాంగ్‌ ఔట్‌

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి`. `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై `రణబాలి` సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు(మంగళవారం) ఈ చిత్రం నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ..ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆకట్టుకుంటున్న ఏందయ్య సామీ లిరికల్‌ సాంగ్‌
Image Credit : Asianet News

ఆకట్టుకుంటున్న ఏందయ్య సామీ లిరికల్‌ సాంగ్‌

`రణబాలి`లో విజయ్, రష్మిక పెళ్లి వేడుక సందర్భంగా 'ఏందయ్య సామీ..' పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో 'ఏందయ్య సామీ..' పాటలో అందంగా రూపొందించారు. ఈ పాటను అజయ్ అతుల్ మెలొడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. 'ఏందయ్య సామీ..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే జాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా...' అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.

34
రొమాన్స్ లో రెచ్చిపోయిన విజయ్‌ దేవరకొండ, రష్మిక
Image Credit : Asianet News

రొమాన్స్ లో రెచ్చిపోయిన విజయ్‌ దేవరకొండ, రష్మిక

ఈ పాటలో రియల్‌ లైఫ్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య రొమాన్స్ అదిరిపోయేలా ఉంది. ఇంటెన్సిటి, కెమిస్ట్రీ బాగా పండింది. ఇద్దరూ లీనమై ఒదిగిపోయి చేశారు. అదే సమయంలో పీరియడ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. అయితే విజయ్‌ దేవరకొండ లుక్‌ అప్పటి కాలానికి తగ్గట్టుగానే ఉండగా, రష్మిక లుక్‌ మాత్రం అలా కనిపించడం లేదు. అదే సమయంలో పాట స్లోగా సాగుతుంది. కానీ అందులోని పదాలు మాత్రం బాగున్నాయి. పదాల్లోని డెప్త్ అదిరిపోయింది. చాలా మీనింగ్‌తో కూడిన పాట కావడం విశేషం. రామజోగయ్య శాస్త్రి పాటకి ప్రాణంపెట్టి రాశారనిపిస్తుంది. అలాగే రాయలసీమ యాసలోనూ శ్వేతా మోహన్‌, అజయ్‌ గోగవలే అంతే బాగా పాడారు.

44
రణబాలి సినిమా బ్యాక్‌ డ్రాప్‌ ఇదే
Image Credit : Asianet News

రణబాలి సినిమా బ్యాక్‌ డ్రాప్‌ ఇదే

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా `రణబాలి` సినిమా రూపొందుతోంది. అప్పట్లో బ్రిటీష్‌ వారు మన సంపదని దోచుకుపోయారు. దీంతో ఆకలితో అలమటించి మన భారతీయులు లక్షల్లో చనిపోయారు. ఈ క్రమంలో బ్రిటీష్‌ వారిపై మన రణబాలి చేసిన తిరుగుబాటే ఈ సినిమా. ఇది పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
వినోదం
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
Rajiv Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Recommended image3
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Related Stories
Recommended image1
Srikanth Daughter: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved