MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే

Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే

Telangana Police Recruitment: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 05 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
Image Credit : X/Telangana Police

పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ క్లియరెన్స్ ఇచ్చేసింది. మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఆదివారం ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

మూడు రోజుల క్రితమే 5,000 పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఓకే చెప్పగా, ఇప్పుడు అదనంగా మరో 2,437 పోస్టులను యాడ్ చేస్తూ మొత్తం ఖాళీల సంఖ్యను 7,437కు పెంచింది. ఖాకీ యూనిఫామ్ వేసుకోవడమే లైఫ్ అంబిషన్ అనుకునే వారికి ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఖాళీలు? పూర్తి వివరాలు ఇవే
Image Credit : X/TelanganaDGP

ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఖాళీలు? పూర్తి వివరాలు ఇవే

ఈ మెగా రిక్రూట్‌మెంట్‌లో కేవలం పోలీస్ శాఖ మాత్రమే కాకుండా ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లాంటి నాలుగు డిఫరెంట్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగానికి ఎన్ని పోస్టులు అనే వివరాలు గమనిస్తే..

• పోలీస్ శాఖ (జీవో నంబర్ 78): అత్యధికంగా 5,000 పోస్టులు.

• స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - SPF (జీవో నంబర్ 84): సెక్యూరిటీ విభాగంలో 1,424 పోస్టులు.

• ఫైర్ డిపార్ట్‌మెంట్ (జీవో నంబర్ 80): డిజాస్టర్ మేనేజ్‌మెంట్ & అగ్నిమాపక శాఖలో 790 పోస్టులు.

• జైళ్ల శాఖ (జీవో నంబర్ 83): ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్‌లో 223 ఖాళీలు ఉన్నాయి.

35
సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల కంప్లీట్ బ్రేకప్
Image Credit : X/TelanganaDGP

సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల కంప్లీట్ బ్రేకప్

అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏయే విభాగంలో ఏయే పోస్టులు ఉన్నాయో బోర్డు క్లియర్‌గా అనౌన్స్ చేసింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ కానిస్టేబుల్స్ అత్యధికంగా 3,697 పోస్టులు ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్స్ 1,052 ఉన్నాయి. అలాగే మోస్ట్ పవర్‌ఫుల్ సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు 148 ఉన్నాయి. వీటికి తోడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB) 23, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP) 12 ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ (PTO) 20, మెకానిక్ (PTO) 7, కానిస్టేబుల్ (SARCPL) 24, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL) 3 పోస్టులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

ఇక మిగిలిన శాఖల విషయానికి వస్తే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లో కానిస్టేబుల్స్ 1,380, సబ్ ఇన్‌స్పెక్టర్స్ 44 ఉన్నాయి. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ ఫైటర్స్ 751, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 39 పోస్టులు భర్తీ కానున్నాయి. అటు జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ (మెన్) 14, డిప్యూటీ జైలర్ (వుమెన్) 1, వార్డర్ (మెన్) 196, వార్డర్ (వుమెన్) 12 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

45
అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు? TSLPRB చైర్మన్ ఏమన్నారంటే..
Image Credit : X/TelanganaDGP

అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు? TSLPRB చైర్మన్ ఏమన్నారంటే..

ప్రస్తుతానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రెడీగా ఉందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపై బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆయా డిపార్ట్‌మెంట్ల హెడ్స్ నుంచి లోకల్ కేడర్ల వారీగా పోస్టుల డివిజన్, రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ లాంటి టెక్నికల్ డిటెయిల్స్ బోర్డుకు అందాల్సి ఉందన్నారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే, కేవలం మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలతో అఫీషియల్ నోటిఫికేషన్లను వెబ్‌సైట్‌లో లైవ్ పెడతామని తెలిపారు.

55
ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.. గ్రౌండ్ ప్రాక్టీస్ అస్సలు మిస్ అవ్వద్దు
Image Credit : Gemini AI

ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.. గ్రౌండ్ ప్రాక్టీస్ అస్సలు మిస్ అవ్వద్దు

చాలా కాలంగా పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు ఇది ఒక అల్టిమేట్ ఆపర్చునిటీ. నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం అనుకుంటే టైమ్ అస్సలు సరిపోదు. అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్‌తో ప్రిపరేషన్ స్పీడప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు రిటన్ ఎగ్జామ్ కోసం సిలబస్, కరెంట్ అఫైర్స్‌పై గ్రిప్ తెచ్చుకుంటూనే.. ఇటు ఫిజికల్ ఈవెంట్స్ కోసం రన్నింగ్, లాంగ్ జంప్ లాంటి శారీరక దారుఢ్య పరీక్షల సాధనను కూడా డైలీ ట్రాక్‌లోకి తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ వార్‌ను ఇప్పుడే స్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పోలీసు భద్రత
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway Jobs : డిగ్రీ పాసయితే చాలు రైల్వేలో జాబ్... వెంటనే అప్లై చేసుకొండి
Recommended image2
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image3
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Related Stories
Recommended image1
SS Rajamouli: రాజమౌళి - కీరవాణి కాంబోలో వచ్చిన ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ ఇవే
Recommended image2
Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మరో రెండు భారీ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved