- Home
- Jobs
- Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఎవరు అర్హులు? జీతం ఎంత? ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

NCRTC లో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు కలిసి నిర్వహిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో సూపర్‌వైజర్-I పోస్టులు 62, జూనియర్ మెయింటెనర్ పోస్టులు 28 ఉన్నాయి.
NCRTC అనేది దేశ రాజధాని డిల్లీ పరిధిలో పనిచేస్తే ప్రజారవాణా రైల్వే సంస్థ. ఇది హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ తో కలిపి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నా జాయింట్ వెంచర్. అంటే ఎన్సిఆర్టిసి అనేది ప్రభుత్వరంగ సంస్థే అన్నమాట.
NCRTC ఉద్యోగాలకు విద్యార్హతలు
సూపర్‌వైజర్-I (ఆపరేషన్స్) పోస్టుకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఇతర సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ మెయింటెయినర్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.
NCRTC ఉద్యోగాల వయోపరిమితి
NCRTC లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 10.09.2026 నాటికి ఈ వయసును లెక్కిస్తారు.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు (PwBD) వారి కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
NCRTC ఉద్యోగానికి ఎంపికైతే జీతం ఎంత వస్తుంది?
సూపర్‌వైజర్-I పోస్టులకు S1 పే స్కేల్ కింద రూ.37,000 నుంచి రూ.1,15,000 వరకు జీతం ఉంటుంది.
జూనియర్ మెయింటెయినర్ పోస్టులకు NS3 పే స్కేల్ ప్రకారం రూ.18,250 నుంచి రూ.59,200 వరకు జీతం ఇస్తారు.
వీటితో పాటు NCRTC నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా ఉంటాయి.
NCRTC ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి?
అర్హులైన అభ్యర్థులు NCRTC అధికారిక వెబ్‌సైట్ www.ncrtc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 10న ప్రారంభమై అక్టోబర్ 9, 2026న ముగుస్తుంది.
SC/ST, మాజీ సైనికులు, దివ్యాంగులకు ఫీజు లేదు. మిగతా కేటగిరీల వారు రూ.500 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
NCRTC ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ముఖ్యంగా ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు. CBTలో అర్హత సాధించిన వారికి మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది జాబితాను ప్రకటిస్తారు.

