MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే

iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే

Apple iPhone 18 Pro: ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదలైంది. వేరియబుల్ ఎపర్చర్ కెమెరా, A20 ప్రో చిప్, సిరి ఏఐ, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త ఫీచర్లను ఇందులో తీసుకొచ్చింది. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లో ఉన్న స్పెక్స్, ఫీచర్లు సహా ధర వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్కెట్‌లోకి ఐఫోన్ 18 ప్రో సిరీస్: కొత్త కలర్స్, నెక్స్ట్ లెవెల్ కెమెరా కంట్రోల్స్ ఇవే
Image Credit : Apple.com

మార్కెట్‌లోకి ఐఫోన్ 18 ప్రో సిరీస్: కొత్త కలర్స్, నెక్స్ట్ లెవెల్ కెమెరా కంట్రోల్స్ ఇవే

ఆపిల్ తన మోస్ట్ అవేటెడ్ స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max) మోడళ్లను కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోకెల్లా అత్యంత అడ్వాన్స్డ్ ప్రో కెమెరా సిస్టమ్, మునుపెన్నడూ లేనంత భారీ బ్యాటరీ లైఫ్, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌ను ఈ కొత్త ప్రో లైనప్‌లో తీసుకొచ్చారు.

ఈ రెండు ఫోన్లు సరికొత్త A20 ప్రో (A20 Pro) చిప్‌సెట్, అప్‌గ్రేడెడ్ వేపర్ ఛాంబర్‌తో పనిచేస్తాయి. iOS 27, ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ కాంబినేషన్‌తో ఈ ఫోన్లు పర్సనల్ ఏఐ హబ్‌లా మారనున్నాయి. బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, సరికొత్త బర్గండి కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేరియబుల్ ఎపర్చర్‌తో తిరుగులేని 48MP ఫ్యూజన్ కెమెరా
Image Credit : apple.com

వేరియబుల్ ఎపర్చర్‌తో తిరుగులేని 48MP ఫ్యూజన్ కెమెరా

ఐఫోన్ హిస్టరీలోనే మొదటిసారిగా ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో వేరియబుల్ ఎపర్చర్ సపోర్ట్ ఇచ్చారు. ఇందులో ఉండే 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా సిస్టమ్ లైటింగ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌కు అనుగుణంగా ఎపర్చర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల లో లైట్ ఫోటోగ్రఫీ చాలా క్లియర్‌గా వస్తుంది. ప్రో యూజర్లు తమకు కావాల్సిన విధంగా నాలుగు ఎపర్చర్ సెట్టింగ్స్‌ను మ్యాన్యువల్‌గా మార్చుకోవచ్చు.

కెమెరా యాప్‌లో ప్రో కంట్రోల్స్ ద్వారా లెన్స్ ఎపర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్‌లను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు, 4K డోల్బీ విజన్ HDRలో టైమ్-ల్యాప్స్ వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఆడియో మిక్స్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఐసోలేట్ చేసి వాయిస్ క్లారిటీని పెంచుకోవచ్చు.

Related Articles

Related image1
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Related image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
35
ఆపిల్ రిఫరెన్స్ ఇమేజ్, అప్‌గ్రేడెడ్ డైనమిక్ ఐలాండ్
Image Credit : Apple Website

ఆపిల్ రిఫరెన్స్ ఇమేజ్, అప్‌గ్రేడెడ్ డైనమిక్ ఐలాండ్

ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో ఆపిల్ రిఫరెన్స్ ఇమేజ్ అనే కొత్త ఫీచర్ పరిచయం చేశారు. కెమెరా క్యాప్చర్ చేసే ప్రతి పిక్సెల్‌ను సైన్ చేయడం ద్వారా ఫోటో ఒరిజినాలిటీని నిరూపించవచ్చు. ఏఐ ద్వారా ఎడిట్ చేసిన లేదా క్రియేట్ చేసిన ఫోటోలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

మరోవైపు, డైనమిక్ ఐలాండ్ డిజైన్‌ను మరింత పర్ఫెక్ట్‌గా మార్చారు. పరిమాణం తగ్గడమే కాకుండా, ఇప్పుడు ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీలను స్క్రీన్ పై చూపిస్తుంది. ఫేస్ ఐడీ, యాప్ అథెంటికేషన్, పేమెంట్స్ వంటి సెక్యూర్ ఫీచర్లు యథావిధిగా పనిచేస్తాయి.

45
పవర్‌ఫుల్ 2-నానోమీటర్ A20 ప్రో చిప్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ
Image Credit : Apple Hub | X

పవర్‌ఫుల్ 2-నానోమీటర్ A20 ప్రో చిప్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ

మొబైల్ ప్రాసెసింగ్ రంగాన్నే మార్చేసేలా లేటెస్ట్ 2-నానోమీటర్ టెక్నాలజీతో A20 ప్రో చిప్‌ను తయారు చేశారు. ఇందులో 6-కోర్ సిపియు, 7-కోర్ జిపియు, 32-కోర్ ఏఐ ప్రాసెసింగ్ పవర్ ఉన్న డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. కొత్త వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఫోన్ హీట్ అవ్వకుండా 40 శాతం మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. N1 వైర్‌లెస్ చిప్ ద్వారా వై-ఫై 7, బ్లూటూత్ 6 సపోర్ట్ లభిస్తుంది.

ఈసారి బ్యాటరీ విషయంలో ఆపిల్ పెద్ద జంప్ తీసేసుకుంది. ఈసిమ్ మాత్రమే ఉన్న ఐఫోన్ 18 ప్రో మోడల్‌లో 36 గంటలు, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఏకంగా 45 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. కేవలం 15 నిమిషాల వైర్డ్ ఛార్జింగ్‌తో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌ను 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 7 గంటల వీడియో ప్లేబ్యాక్ వస్తుంది.

55
iOS 27 తో సిరి ఏఐ, సేల్స్, ధరల వివరాలు ఇవే
Image Credit : Apple Screengrab

iOS 27 తో సిరి ఏఐ, సేల్స్, ధరల వివరాలు ఇవే

iOS 27 లో భాగమైన సిరి ఏఐ మీ మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఫోటోలను అర్థం చేసుకుని సరైన సమాచారం అందిస్తుంది. కెమెరా ముందు ఉన్న వస్తువులను చూపిస్తే వాటి వివరాలు చెప్తుంది. అలవాటైన టైపింగ్ లేదా వాయిస్ కమాండ్స్‌తో పనులు సులువుగా పూర్తవుతాయి.

ధరలు, లభ్యత:

• ఐఫోన్ 18 ప్రో: ప్రారంభ ధర ₹1,64,900

• ఐఫోన్ 18 ప్రో మాక్స్: ప్రారంభ ధర ₹1,79,900

• స్టోరేజ్ ఆప్షన్లు: 256GB, 512GB, 1TB, 2TB

ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతాయి. ఇండియా సహా 65 కి పైగా దేశాల్లో సెప్టెంబర్ 18 నుండి సేల్ మొదలవుతుంది. ఇతర 20 దేశాల్లో సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి వస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 18 Pro vs 17 Pro: ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. మైండ్ బ్లోయింగ్ అప్‌గ్రేడ్స్ ఇవే
Recommended image2
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Recommended image3
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved