MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Coins in River: నదుల్లో నాణేలు వేయడం వెనుక అసలు నిజం ఇది.. ఇకనైనా వేయడం ఆపండి

Coins in River: నదుల్లో నాణేలు వేయడం వెనుక అసలు నిజం ఇది.. ఇకనైనా వేయడం ఆపండి

Coins in River: రైలులో లేదా బస్సులో వంతెనల మీద నుంచి వెళుతున్నప్పుడు జేబులోంచి ఓ కాయిన్ తీసి నీళ్లలో వేయడం చాలామందికి అలవాటు. అలా వేస్తే అదృష్టం వస్తుందనుకుంటారు. నిజానికి అలా నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 17 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారో తెలుసా?
Image Credit : Gemini AI

నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారో తెలుసా?

మన దేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. ఇవే మనకు జీవధారలు. గంగా, కృష్ణా, గోదావరి లాంటి నదులు మన నాగరికతకు పునాదులు వేశాయి. పూర్వం పూర్తిగా ఈ నదుల మీదే ఆధారపడేవారు. తాగు నీరు కూడా నేరుగా ఈ నదుల్లో కుండను ముంచి ఇంటికి తెచ్చుకుని తాగేవారు. అందుకే వీటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మన పెద్దలు ఎన్నో పద్ధతులు పాటించేవారు. అందులో ఒకటి నదుల్లో నాణాలు వేయడం కూడా. ఇప్పటివరకు కూడా ఆ ఆచారం పాటిస్తున్నారు.

ఇప్పటికీ ఏదైనా నది లేదా కాలువ కనిపిస్తే, వెంటనే జేబులోంచి రూపాయి బిళ్ల తీసి నీళ్లలో వేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. చిన్నప్పటి నుంచి పెద్దలను చూసి మనం కూడా ఇదే అలవాటు చేసుకున్నాం. చాలామందికి ఇలా ఎందుకు వేస్తున్నారో కూడా అవగాహన లేదు. కానీ మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారం వెనుకా ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. నదుల్లో నాణేలు వేయడం వెనుక ఉన్న సైన్సు గురించి తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ ఆచారానికి అసలు కారణం
Image Credit : Getty

ఈ ఆచారానికి అసలు కారణం

ఇప్పుడంటే మన నాశాలు ఇనుము, స్టీలు, ఇతర లోహాలను కలిపి చేస్తున్నారు. కానీ పాత కాలంలో నాణేలను పూర్తిగా 'రాగి' తో తయారు చేసేవారు. అప్పట్లో ఇప్పటిలా వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు లేవు. పల్లెలు, పట్నాల్లోని ప్రజలు నేరుగా నదులు, చెరువుల నీళ్లనే తాగేవారు. రాగికి నీటిని శుద్ధి చేసే అద్భుతమైన శక్తి ఉందని అందరికీ తెలిసిందే. అందుకే నీళ్లలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు రాగి నాణాలను నదుల్లో వేయడం ఆచారంగా మార్చారు ఆనాటి పెద్దలు.

33
నీటి శుద్ధి కోసమే
Image Credit : X

నీటి శుద్ధి కోసమే

నదుల్లో నాణాలు వేయడం అనేది కేవలం నీటి శుద్ధి, అలాగే మన ఆరోగ్యం కోసమే చేసే పని. మన శరీరానికి అత్యవసరమైన ఖనిజాల్లో రాగి కూడా ఒకటి. రాగి నాణేలు నీళ్లలో ఉన్నప్పుడు, ఆ ధాతువు నీటిలో కలిసిపోయి, తాగినప్పుడు మన శరీరంలోకి చేరుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే నదిని దాటేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక నాణెం వేయడం అప్పట్లో ఒక సామాజిక బాధ్యత. దీనివల్ల నది నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేది.

ఇప్పుడు కాలం మారిపోయింది. మనం వాడుతున్న నాణేలు రాగితో చేసినవి కావు. ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా అల్యూమినియంతో తయారవుతున్నాయి. వీటిని నీళ్లలో వేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. పైగా నీరు కలుషితం అవుతుంది. కాబట్టి దీన్ని ఒక గుడ్డి ఆచారంగా పాటించకుండా… ఇకనైన నదుల్లో నాణాలు వేయడం ఆపండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Recommended image2
మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
Recommended image3
Snakes : పాములు రోజుకు ఎంత నీరు తాగుతాయి? వాటి దాహం ఎలా తీరుతుంది?
Related Stories
Recommended image1
Potatoes: బంగాళాదుంపలు ఉడికించే నీటిలో వీటిని కలిపి చూడండి.. కూర ఎంత రుచిగా వస్తుందో
Recommended image2
Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved