MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !

Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !

Snake Venom Medicines: పాము కరిస్తే ప్రాణాలు పోతాయనే భయం అందరిలోనూ ఉంటుంది. కానీ అదే ప్రాణాంతక పాము విషం ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలను కాపాడే సంజీవని గా మారుతోంది. వైద్య శాస్త్రంలో విప్లవాత్మక పరిశోధనలతో ఎన్నో వ్యాధులకు మందులను తయారు చేస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 16 2026, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విషం కాదది సంజీవని: పాముల విషంతో తయారయ్యే 6 ప్రాణాధార మందులు!
Image Credit : Chatgpt

విషం కాదది సంజీవని: పాముల విషంతో తయారయ్యే 6 ప్రాణాధార మందులు!

పాము పేరు వింటేనే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. దాని కాటుకు క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కానీ అదే విషం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోందంటే నమ్ముతారా? అవును, ఇది అక్షరాలా నిజం. పాముల విషంలో ఉండే విభిన్నమైన ప్రోటీన్లు, ఎంజైములను ఉపయోగించి శాస్త్రవేత్తలు ప్రాణాధార మందులను తయారు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన ఆరు ముఖ్యమైన మందులతో పాటు మరికొన్ని పరిశోధన దశలో ఉన్నాయి. గుండెపోటు, హై బీపీ, రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలకు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హై బీపీ, గుండె సమస్యలకు పాము విషయంతో చెక్
Image Credit : others

హై బీపీ, గుండె సమస్యలకు పాము విషయంతో చెక్

పాము విషం నుంచి వచ్చిన అత్యంత ప్రసిద్ధ మందు క్యాప్టోప్రిల్. బ్రెజిల్ వైపర్ అనే పాము విషంలో ఉండే బ్రాడైకినిన్-పొటెన్షియేటింగ్ పెప్టైడ్స్ ఆధారంగా దీనిని తయారు చేశారు. 1981లో ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఈ మందు, హై బీపీ తగ్గించడంలో, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చూడటంలో సూపర్ గా పనిచేస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత హృదయాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇదే మోడల్‌ను బేస్ చేసుకుని ఎనలాప్రిల్ వంటి ఇతర బీపీ మందులను కూడా డెవలప్ చేశారు.

36
రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే యాంటీప్లేట్‌లెట్స్
Image Credit : Getty

రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే యాంటీప్లేట్‌లెట్స్

హార్ట్ ఎటాక్ లేదా గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం. దీనిని అడ్డుకోవడానికి పిగ్మీ రాటిల్‌స్నేక్ విషంలో ఉండే బార్బౌరిన్ అనే డిసింటిగ్రిన్ ఆధారంగా ఎప్టిఫిబాటైడ్ అనే మందును తయారుచేశారు. ఇది 1998లో ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. ఆంజియోప్లాస్టీ లేదా స్టెంట్ వేసే సమయంలో ఇది రక్తాన్ని గడ్డకట్టనివ్వదు. అలాగే, ఆఫ్రికన్ సా స్కేల్డ్ వైపర విషంలోని ఎకిస్టాటిన్ ప్రోటీన్ ఆధారంగా టిరోఫిబాన్ అనే మందును కూడా తయారుచేశారు.

46
సర్జరీల్లో రక్తస్రావాన్ని ఆపే ఎంజైమ్‌లు
Image Credit : Asianet News

సర్జరీల్లో రక్తస్రావాన్ని ఆపే ఎంజైమ్‌లు

కొన్ని రకాల పాముల విషం రక్తాన్ని గడ్డకట్టించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. Bothrops atrox వంటి పాముల విషం నుంచి శుద్ధి చేసిన బాట్రాక్సోబిన్ అనే ఎంజైమ్ రక్తంలోని ఫైబ్రినోజెన్‌పై పనిచేస్తుంది. శస్త్రచికిత్సలు చేసే సమయంలో లేదా అత్యవసర రక్తస్రావ సమస్యల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నియోంత్రించడానికి కొన్ని దేశాల్లో దీనిని హెమోస్టాటిక్‌గా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కోబ్రా విషం నుంచి నేరుగా శుద్ధి చేసిన కోబ్రాటైడ్ అనే కాంపౌండ్ నరాల నొప్పి, రక్తనాళాల సమస్యల చికిత్సలో ఉపయోగపడుతోంది.

56
క్యాన్సర్, నరాల వ్యాధులపై జరుగుతున్న పరిశోధనలు
Image Credit : AI

క్యాన్సర్, నరాల వ్యాధులపై జరుగుతున్న పరిశోధనలు

ప్రస్తుతం పాముల విషంపై జరుగుతున్న పరిశోధనలు క్యాన్సర్ థెరపీలో కొత్త ఆశలు రేపుతున్నాయి. విషంలో ఉండే కొన్ని పెప్టైడ్లు, ప్రోటీన్లు క్యాన్సర్ కణాల వృద్ధిని ఆపడమే కాకుండా, అవి శరీరం మొత్తం వ్యాపించకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు, కాపర్‌హెడ్ పాము విషంలో ఉండే కంటోర్ట్రోస్టాటిన్ అనే ప్రోటీన్ క్యాన్సర్ చికిత్సలో పరిశోధన దశలో ఉంది. అంతేకాకుండా, మోర్ఫిన్ కంటే శక్తివంతమైన నాన్ అడిక్టివ్ నొప్పి నివారిణులుగా, నరాల వ్యాధులు, మధుమేహం, పక్షవాతం చికిత్సల్లోనూ ఈ విషపు పెప్టైడ్లు భవిష్యత్ మందులుగా మారుతున్నాయి.

66
విషం నేరుగా మందుగా మారుతుందా? అసలు ప్రాసెస్ ఇదే
Image Credit : AI

విషం నేరుగా మందుగా మారుతుందా? అసలు ప్రాసెస్ ఇదే

చాలామంది పాము విషాన్ని నేరుగా ఇంజెక్షన్ లా ఇస్తారని అనుకుంటారు. కానీ అది తప్పు. పాము విషంలో వందలాది జీవక్రియాశీల అణువులు ఉంటాయి. శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో విషంలోని నిర్దిష్ట మాలిక్యూల్స్‌ను వేరు చేసి, వాటి నిర్మాణాన్ని అధ్యయనం చేస్తారు. మానవ శరీరానికి సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేసేలా వాటిని సింథటిక్ లేదా మార్చబడిన రూపంలో తయారు చేస్తారు. క్యాప్టోప్రిల్ పూర్తిగా ల్యాబ్‌లో తయారైన సింథటిక్ మందే, కానీ దాని డిజైన్ బ్లూప్రింట్ మాత్రం బ్రెజిలియన్ వైపర్ విషమే. అలాగే పాముకాటు బాధితులను కాపాడే యాంటీ వెనమ్ ను గుర్రాలు లేదా గొర్రెలలో పాము విషాన్ని పంపి తయారైన యాంటిబాడీల నుంచి సేకరిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image3
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved