MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Potatoes: బంగాళాదుంపలు ఉడికించే నీటిలో వీటిని కలిపి చూడండి.. కూర ఎంత రుచిగా వస్తుందో

Potatoes: బంగాళాదుంపలు ఉడికించే నీటిలో వీటిని కలిపి చూడండి.. కూర ఎంత రుచిగా వస్తుందో

Potatoes: బంగాళాదుంపలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఆలుగడ్డల కూర చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఉడికించేటప్పుడు నీటిలో ఒక పదార్థం వేయడం వల్ల దుంపలు బాగా ఉడుకుతాయి. అలాగే కూర రుచిగా వస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 16 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగాళాదుంపలను ఎలా ఉడికించాలి?
Image Credit : Chat Gpt

బంగాళాదుంపలను ఎలా ఉడికించాలి?

వారానికి ఒకసారి అయిన బంగాళాదుంపల కూరను తింటూ ఉంటారు. ముందుగా వాటిని ఉడికించిన తరువాత కూర వండుతారు. చాలామంది నీళ్లు మరిగిన తర్వాత దుంపలను అందులో వేసి ఉడకబెడతారు. అలా కాకుండా ముందుగానే ఒక గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని బంగాళాదుంపలు పూర్తిగా మునిగేలా ఉంచిన తర్వాతే పొయ్యి వెలిగించాలి. దీనివల్ల నీటి వేడితో పాటే దుంపలు కూడా లోపలి నుంచి బయటి వరకు సమానంగా వేడెక్కి మంచిగా ఉడుకుతాయి. అదే నేరుగా వేడి నీటిలో వేస్తే పై పొర త్వరగా మెత్తబడిపోయి పిండిలా చిదిమిపోతుంది, లోపల మాత్రం గట్టిగా పచ్చిగానే ఉండిపోతుంది. ముక్కలుగా కోసి ఉడికించే పనైతే అన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకుంటే అన్నీ ఒకే సమయంలో ఉడుకుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉడికించిన నీళ్లలో ఉప్పు
Image Credit : Pixabay

ఉడికించిన నీళ్లలో ఉప్పు

బంగాళాదుంపలు ఉడికించడానికి ముందే నీటిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది. ఉడికే క్రమంలోనే ఉప్పు దుంప లోపలి దాకా వెళ్లి ప్రతి ముక్క రుచికరంగా మారుతుంది. సాధారణంగా ఉడకబెట్టిన దుంపలకు మరింత తాజాదనం, సువాసన రావాలనుకుంటే నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు (బే లీవ్స్), నలిపిన వెల్లుల్లి లేదా పుదీనా, కొత్తిమీర లాంటి హెర్బ్స్ వేస్తే దుంపలకు మంచి ఆరోమా వచ్చి మరింత రుచిగా ఉంటాయి. ఉడికిన తర్వాత వీటిని సులభంగా తీసేయవచ్చు.

33
బంగళాదుంప మెత్తగా అవ్వకుండా
Image Credit : Pixabay

బంగళాదుంప మెత్తగా అవ్వకుండా

బంగాళాదుంప సలాడ్స్, వేపుళ్లు లేదా రోస్ట్ చేసుకునేటప్పుడు ఆలు ముక్కలు చితికిపోకుండా గట్టిగా ఉండటం ముఖ్యం. దీనికోసం ఉడికించే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపాలి. వెనిగర్‌లోని స్వల్ప ఆమ్ల గుణం దుంప పైపొరలను దృఢంగా ఉంచి, కలిపినప్పుడు అవి ముద్ద కాకుండా చూస్తుంది. ఇక వండేటప్పుడు నీరు మరగడం ప్రారంభించగానే మంటను వెంటనే తగ్గించి, మూతపెట్టి మీడియం లేదా సిమ్‌లో నెమ్మదిగా ఉడకనివ్వాలి. పెద్ద మంట మీద ఉడికిస్తే నీటి బుడగల ఒత్తిడికి ముక్కలు ఒకదానికొకటి వేగంగా ఢీకొని విరిగిపోయి, స్టార్చ్ అంతా నీటిలో కలిసిపోయి కూర పాడవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Recommended image3
Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో
Related Stories
Recommended image1
భారతదేశం నడిబొడ్డున ఉన్న నగరం ఏదో తెలుసా? ఇది వెరీ స్పెషల్
Recommended image2
Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved