MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగిపోయే ఎందుకు కనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇంద్రధనుస్సు సగం వృత్తం కాదు, అదొక పూర్తి వృత్తం. వాన చినుకులు, సూర్యరశ్మి, మన చూపు.. ఈ మూడింటి మధ్య ఉండే కోణమే దీనికి సగం వృత్తంగా చూపిస్తాయి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 16 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంద్రధనుస్సు ఎందుకు వంగి కనిపిస్తుంది?
Image Credit : Chatgpt

ఇంద్రధనుస్సు ఎందుకు వంగి కనిపిస్తుంది?

వర్షం పడిన తర్వాత సూర్యుడు వస్తే ఆకాశంలో అందమైన రంగురంగుల హరివిల్లు కనిపిస్తుంది. ఇది కనిపిస్తే చాలు చిన్నారులు, అమ్మాయిలు మురిసిపోతారు… వాళ్లూవీళ్లని కాదు ప్రతిఒక్కరు ఇష్టపడతారు. అయితే ఇంద్రధనుస్సును చూసిన చాలామందికిి ఓ డౌట్ వస్తుంది.. ఇది స్ట్రెయిట్ గా కాకుండా విల్లులా ఎందుకు వంగి ఉంటుంది? దీనివెనక దాగున్న సెన్స్ ఏంటి? అని.

అయితే మన కళ్లకు కనిపించేది అసలు ఇంద్రధనుస్సు కాదు… అది పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. కానీ వాన చినుకుల్లోకి సూర్యకాంతి వెళ్లే విధానం, ఆ కాంతి మన కళ్లను చేరే కోణమే అర్థవృత్తాకారంలో కనిపించేలా చేస్తుంది. ఇలా కనిపించడం వెనకున్న ఆసక్తికర స్టోరీని తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాన చినుకు లోపల ఏం జరుగుతుంది?
Image Credit : ANI

వాన చినుకు లోపల ఏం జరుగుతుంది?

సూర్యకాంతి వాన చినుకులోకి ప్రవేశించినప్పుడు దాని మార్గం కొద్దిగా వంగుతుంది. దీన్నే కాంతి వక్రీభవనం (Refraction) అంటారు. ఆ తర్వాత ఆ కాంతిలో కొంత భాగం చినుకు లోపల పరావర్తనం చెంది, మళ్లీ బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు కూడా కాంతి మళ్లీ వంగుతుంది.

అయితే సూర్యకాంతిలో చాలా రంగులు కలిసి ఉంటాయి… కానీ సాధారణంగా మన కంటికి కనిపించవు. కానీ వర్ష సమయంలో కాంతిలోని ఒక్కో రంగు ఒక్కో స్థాయిలో వంగడం వల్ల, అవి విడిపోయి అన్నీ కనిపిస్తాయి. అందుకే మనకు కాంతిలోని ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయ రంగుల్లా కనిపిస్తాయి.

35
ఇంద్రధనుస్సు విల్లులా ఎందుకు ఏర్పడుతుంది?
Image Credit : GK

ఇంద్రధనుస్సు విల్లులా ఎందుకు ఏర్పడుతుంది?

అసలు రహస్యం ఇక్కడే ఉంది. సూర్యుడు మన వెనుక ఉన్నప్పుడు, మన ముందున్న వాన చినుకుల నుంచి వచ్చే కాంతి ఒక నిర్దిష్ట కోణంలో మన కళ్లను చేరితేనే ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ప్రాథమిక ఇంద్రధనుస్సుకు ఈ కోణం సుమారు 42 డిగ్రీలు ఉంటుంది. ఈ 42 డిగ్రీల కోణం ఒకే దిశలో కాకుండా, మన చుట్టూ ఒక వృత్తంలా ఏర్పడుతుంది. అందుకే ఇంద్రధనుస్సు మనకు వంగిన విల్లులా కనిపిస్తుంది.

45
నిజానికి ఇంద్రధనుస్సు ఒక పూర్తి వృత్తం... అర్థవృత్తంలా ఎందుకు కనిపిస్తుంది?
Image Credit : Asianet News

నిజానికి ఇంద్రధనుస్సు ఒక పూర్తి వృత్తం... అర్థవృత్తంలా ఎందుకు కనిపిస్తుంది?

ఈ విషయం తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. మనం నేల మీద నిలబడి చూసినప్పుడు ఇంద్రధనుస్సు కింది భాగం కనిపించదు. అందుకే పైన కనిపించే భాగం మాత్రమే మనకు విల్లులా కనిపిస్తుంది.

అయితే సరైన వాతావరణంలో అంటే విమానం నుంచి చూస్తే పూర్తి వృత్తాకారంలో ఉండే ఇంద్రధనుస్సును చూడొచ్చు. జలపాతాలు లేదా నీటి తుంపర్లు ఎగిరే చోట కూడా సరైన కోణంలో చూస్తే పూర్తి వృత్తంలాంటి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అయితే ఇలా వృత్తాకార ఇంద్రధనుస్సు చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు, మీ పక్కన నిలబడిన వ్యక్తి ఇద్దరూ ఒకే ఇంద్రధనుస్సును చూడలేరు! ఇంద్రధనుస్సు అనేది ఆకాశంలో ఒకే చోట ఉండే వస్తువు కాదు. సూర్యుడు, వాన చినుకులు, చూసే వ్యక్తి నిలబడిన ప్రదేశం.. వీటి ఆధారంగానే అది ఏర్పడుతుంది. మీరు కొన్ని అడుగులు పక్కకు జరిగినా, మీ కళ్లను చేరే కాంతిని సృష్టించే వాన చినుకుల అమరిక మారిపోతుంది. అందుకే ఒక్కొక్కరికీ ఇంద్రధనుస్సు కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

55
ఇంద్రధనుస్సు ఎక్కడ ముగుస్తుందో కనిపెట్టలేమా?
Image Credit : Asianet News

ఇంద్రధనుస్సు ఎక్కడ ముగుస్తుందో కనిపెట్టలేమా?

ఇంద్రధనుస్సు "ముగింపు" ఎక్కడ ఉందో అక్కడికి పరిగెత్తుకెళ్లి దాన్ని తాకలేము. ఎందుకంటే అది ఆకాశంలో ఉండే వస్తువు కాదు. సూర్యకాంతి + వాన చినుకు + మన చూపు + సరైన కోణం — ఈ నాలుగూ కలిస్తేనే మనకు ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అందుకే ఈసారి ఇంద్రధనుస్సు కనిపించినప్పుడు, "అక్కడొక రంగుల విల్లు ఉంది" అని మాత్రమే అనుకోకండి. మన కళ్లకు సరైన కోణంలో చేరే సూర్యకాంతిని, లక్షలాది వాన చినుకులు కలిసి సృష్టించే ఒక అద్భుతమైన ఆప్టికల్ మ్యాజిక్ ఈ ఇంద్రధనుస్సు!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image3
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved